►వైసీపీ నాయకులపై చింతమనేని, టీడీపీ నాయకుల దాడి
►రోడ్డు కోసం కొంత స్థలం ఇస్తామన్నా మొత్తం లాక్కునే ప్రయత్నం
►బాధితులను స్టేషన్‌కు తరలించిన పోలీసులు
►దాడికి గురైన వారిపై ఇన్‌చార్జి ఎంపీడీవో ఫిర్యాదు
►కక్ష సాధిస్తున్న ఎమ్మెల్యే ప్రభాకర్
జగన్నాధపురం (పెదవేగి రూరల్) : తెలుగుదేశం పార్టీ ఆగడాలకు అడ్డూ అదుపూ లేకుండాపోతోంది. అధికారాన్ని అడ్డం పెట్టుకుని వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ నేతలపై టీడీపీ నాయకులు దౌర్జన్యాలకు దిగుతున్నారు. సాక్షాత్తు ఎమ్మె ల్యే కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారు. తాజాగా పెదవేగి మండలం జగన్నాథపురంలో వైఎస్సార్ కాం గ్రెస్ పార్టీ నాయకులపై ప్రభుత్వ విప్, దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, అతని అనుచరుడు గద్దే కిషోర్ దాడికి పాల్పడ్డారు. ‘గ్రామాభివృద్ధి కోసం కొంత స్థలం ఇస్తామన్నాం.
మొత్తం మా స్థలమే ఆక్రమించుకుని రోడ్డు వేస్తామన్నారు. రోడ్డు వేసే పద్ధతి ఇదేనా? ఇదెక్కడి న్యాయమని అడిగినందుకు దౌర్జన్యం చేశారంటూ జగన్నాథపురం ఉప సర్పంచ్ కొడాలి కృష్ణ కుమారి, వైస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కొడాలి రాటాలు, దుర్గా ప్రసాద్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి బాధితులు తెలిపిన వివరాల ప్రకారం... జగన్నాథపురంలోని కమ్మటూరు వీధిలో గత ఎంపీ కావూరి సాంబశివరావు ఎంపీ ల్యాడ్స్ నిధులతో సీసీ రోడ్డు నిర్మాణం చేశారు.
రూ.3 లక్షలతో 45 రోజుల క్రితం నిర్మాణం చేపట్టిన ఈ రోడ్డు పనులను పరిశీలించడానికి శనివారం గ్రామానికి వచ్చిన ఎమ్మెల్యే చింతమనేని ఆ పనుతను మరికొంత దూరం పొడిగించాలని, కమ్మ వీధిలో మలుపుకాకుండా నిలువుగా రోడ్డు వేయాలని అధికారులను ఆదేశించారు. అలా పొడిగించే రోడ్డు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాటాలుకు చెం దిన స్థలంలోంచి వెళ్లాల్సి ఉన్నందున రాటాలు కొం త అభ్యంతరం వ్యక్తం చేశారు. గ్రామాభివృద్ధి కోసం గజం స్థలం ఇస్తానని చెప్పారు.
వెంటనే ‘మీరేంటి మాకిచ్చేది’ అంటూ ఎమ్మెల్యే దుర్భాషలాడుతూ రాటాలుపై చేయిచేసుకున్నారు. రాటాలు అన్న కుమారుడు దుర్గాప్రసాద్‌ను కొట్టారు. అంతటితో ఆగకుండా వారిద్దరినీ అదుపులోకి తీసుకోవాల్సిం దిగా పోలీసులను ఎమ్మెల్యే ఆదేశించారు. పెదవేగి ఎస్సై కె.స్వామి వారిద్దరినీ స్టేషన్‌కు తరలించారు. కాగా, ఎమ్మెల్యేపై దాడికి పాల్పడ్డారంటూ రాటాలు, దుర్గాప్రసాద్‌లపై పెదవేగి ఇన్‌చార్జి ఎంపీడీవో రవిప్రసాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
టీడీపీ దౌర్జన్యకాండ
Published Sun, Jul 27 2014 2:24 AM | Last Updated on Sat, Jul 6 2019 1:14 PM
Advertisement