
స్వచ్ఛభారత్ సదస్సుకు ఎంపీడీఓ
దేశంలో స్వచ్ఛభారత్ కార్యక్రమం ప్రారంభించి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా సాధించిన ప్రగతి, భవిష్యత్‌లో చేపట్టబోయే కార్యక్రమాలపై సదస్సులో చర్చిస్తారని తెలిపారు. ఈ సదస్సుకు హాజరు కావాలని పంచాయతీరాజ్ ప్రిన్సిపాల్ సెక్రటరీ జవహార్‌రెడ్డి నుంచి ఉత్తర్వులు అందాయని చెప్పారు. రాష్ట్రంలో 13 జిల్లాల నుంచి ఒక్కొక్కరికి ఆహ్వానాలు అందగా, శ్రీకాకుళం జిల్లా నుంచి తనకు అవకాశం వచ్చినట్టు పేర్కొన్నారు. శుక్రవారం ఢిల్లీలో ప్రధాన మంత్రి నరేంద్రమోదీ ప్రసంగించే స్వచ్ఛభారత్ సదస్సులో హాజరు కానున్నట్టు తెలిపారు.