సాక్షి, ఆసిఫాబాద్ : జిల్లాలోని సిర్పూర్ (టీ) ఎంపీడీవోపై అతని భార్య జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. తన భర్త జగదీష్ అనిల్‌కుమార్ అదనపు కట్నం వేధిస్తున్నాడని ఆమె జిల్లా ఎస్పీ మల్లారెడ్డికి ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. నిత్యం తాగొచ్చి శారీరకంగా వేధిస్తున్నాడని వాపోయారు. శుక్రవారం కూడా మద్యం సేవించి తనపై కత్తితో దాడిచేసినట్టు బాధితురాలు మేరీ కుమారి కన్నీటి పర్యంతమయ్యారు. రెండు చేతులపై కత్తి గాయాలను మీడియాకు చూపారు.
ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లా నరసరావుపేటకు చెందిన జగదీశ్ అనిల్‌కుమార్, గుంటూరు వాసి మేరీకుమారితో 2018లో వివాహమైంది. ప్రస్తుతం అనిల్‌కుమార్ కుమురం భీ అసిఫాబాద్ జిల్లా సిర్పూర్ (టి) ఎంపీడీవోగా పనిచేస్తున్నాడు. కాగజ్‌నగర్‌లోని శ్రీరాంనగర్ కాలనీలో నివాసముంటున్నారు. అదనపు కట్నం కోసం గతంలోనూ తనపై హత్యయత్నం జరిగిందని మేరీకుమారి చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment