సభాస్థలిని పరిశీలిస్తున్న సీపీ కార్తికేయ, బీజేపీ నాయకులు
సాక్షి, నిజామాబాద్‌అర్బన్: దేశ ప్రధాని నరేంద్రమోడీ ఈ నెల 27 జిల్లా కేంద్రానికి రానున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాన మంత్రి పర్యటన కొనసాగనుంది. జిల్లా కేంద్రలోని గిరిరాజ్ డిగ్రీ క ళాశాలలో సభ ఏర్పాటు చేశారు. ఉదయం 10.30 గంటలకు సభ ప్రారంభం కానుంది. ఇందుకు గా ను కేంద్ర మంత్రులు, బీజేపీ నాయకులు పలుసా ర్లు సభాస్థలిని పరిశీలించారు. ప్రధాని పర్యటన ఉండడంతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. శనివారం కేంద్ర బలగాలు ఎస్‌పీజీ(ప్రత్యేక రక్షణ బృందాలు) జిల్లాకు వచ్చాయి. రైల్వే స్టేషన్‌లో ప్రాంతాల్లో వాహనాలను నిలిపి ఉంచారు. ఒక్కో ప్లాటూన్‌లో వంద మంది ప్రత్యేక బలగాలు వచ్చా యి.
కేంద్ర నిఘా బృందాలు సైతం జిల్లా కేంద్రం లో డేగ కన్ను వేశారు. పరిస్థితులను పర్యవేక్షిస్తున్నారు. కేంద్ర బలగాలు కళాశాల స్థలాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. సీపీ కార్తికేయ బం దోబస్తుపై దృష్టి సారించారు. శనివారం సభాస్థలా న్ని పరిశీలించారు. దాదాపు 2 వేల మంది పోలీసులతో బందోబస్తు నిర్వహించనున్నారు. సభ కో సం నిజామాబాద్‌తో పాటు మెదక్, కామారెడ్డి, సంగారెడ్డి, సిద్దిపేట, హైదరాబాద్ జిల్లాల నుంచి పోలీసులు బందోబస్తు కోసం రానున్నారు. ప్రధా న మంత్రిగా నరేంద్రమోడీ తొలిసారిగా జిల్లాకు వస్తున్నారు. గత ఎన్నికల్లో ప్రచారం చేసేందుకు వచ్చినా నాడు ప్రధాని హోదాలో లేరు.
రేపు కేసీఆర్ పర్యటన
జిల్లాలో సీఎం కేసీఆర్ సోమవారం పర్యటన కొనసాగనుంది. నిజామాబాద్‌రూరల్, బోధన్, బా ల్కొండలో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటా రు. ఇందుకుగాను పోలీసులు బందోబస్తు పరిశీలించారు. నిజామాబాద్ ఏసీపీ శ్రీనివాస్‌కుమార్ కేసీఆర్ హెలీప్యాడ్ స్థలాలను పరిశీలించారు.
Comments
Please login to add a commentAdd a comment