విద్యుత్ దీపాలతో అలంకరించిన కలెక్టరేట్ కార్యాలయ సముదాయం
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆదివారం జిల్లా కేంద్రం సూర్యా పేటలో పర్యటించనున్నారు. జిల్లా కేంద్రంలో నిర్మించిన కలెక్టరేట్ కార్యాలయ సముదాయం, ఎస్పీ కార్యాలయం, మెడికల్ కళాశాల, వెజ్, నాన్ వెజ్ మార్కెట్, బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయ భవనాలను ఆయన ప్రారంభిస్తారు. అనంతరం కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాలను జిల్లాకు తీసుకొచ్చినందున ప్రజల తరఫున ధన్యవాదాలు తెలుపుతూ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం ప్రసంగించనున్నా రు.
ఎన్నికలకు ముందు నిర్వహిస్తున్న మొదటి సభ కావడంతో విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి నేతృత్వంలో 100 ఎకరాల్లో పెద్ద ఎత్తున సభకు ఏర్పాట్లు చేశారు. ఉదయం 11:15 గంటలకు సీఎం కేసీఆర్ సూర్యాపేట పట్టణ కేంద్రానికి చేరుకొని, సాయంత్రం 4:50 గంటలకు అక్కడి నుంచి బయలుదేరి తిరిగి హైదరాబాద్‌కు వెళ్లనున్నారు.
జాతీయ రహదారిపై నేడు వాహనాల మళ్లింపు
సూర్యాపేట జిల్లా కేంద్రంలో సీఎం కేసీఆర్ బహిరంగసభ నేపథ్యంలో వాహనాలను దారి మళ్లిస్తు న్నట్లు పోలీసులు తెలిపారు. హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్లే వాహనాలను నార్కట్‌పల్లి వద్ద నల్లగొండ వైపు మళ్లిస్తారు. ఖమ్మం వెళ్లే వాహనాలను టేకుమట్ల నుంచి ఖమ్మం రహదారి మీదుగా మళ్లించనున్నారు. విజయవాడ నుంచి హైదరాబా ద్ వెళ్లే వాహనాలను కోదాడ, హుజూర్‌నగర్, మి ర్యాలగూడ మీదుగా నార్కట్‌పల్లి వైపు మళ్లిస్తారు.
Comments
Please login to add a commentAdd a comment