వైఎస్సార్‌సీపీ శింగనమల నియోజకవర్గ సమన్వయకర్త జొన్నలగడ్డ పద్మావతి చేపట్టిన మేలుకొలుపు పాదయాత్ర ముగింపు సందర్భంగా ఈ నెల 3వ తేది గార్లదిన్నెలో నిర్వహించిన బహిరంగసభపై గార్లదిన్నె పోలీసులు కేసు నమోదు చేశారు.
గార్లదిన్నె: వైఎస్సార్‌సీపీ శింగనమల నియోజకవర్గ సమన్వయకర్త జొన్నలగడ్డ పద్మావతి చేపట్టిన మేలుకొలుపు పాదయాత్ర ముగింపు సందర్భంగా ఈ నెల 3వ తేది గార్లదిన్నెలో నిర్వహించిన బహిరంగసభపై గార్లదిన్నె పోలీసులు కేసు నమోదు చేశారు. బహిరంగసభకు పోలీసులే అనుమతులు ఇచ్చినప్పటికీ, నిబంధనలు ఉల్లంఘించారనీ, ప్రజలకు ఇబ్బందులు కలిగించారని కేసు నమోదు చేశారు. ఆదేవిధంగా మేలుకొలుపు యాత్ర సందర్భంగా నార్పల బస్టాండు వద్ద బహిరంగ సభ నిర్వహించడంపై నార్పల పోలీసులు కేసు నమోదు చేశారు.