
సాక్షి, హైదరాబాద్ : ముందస్తు ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పావులు కదువుతున్న టీఆర్‌ఎస్ అధినేత ఆపధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదివారం టీఆర్‌ఎస్ అభ్యర్థులతో భేటీ అయ్యారు. తెలంగాణ భవన్‌కు చేరుకున్న కేసీఆర్ ముందుగా తెలంగాణ తల్లి విగ్రహానికి నివాళులర్పించారు. ముందుగా ప్రకటించిన 107 మంది అభ్యర్థులకు బీఫారాలు అందించిన కేసీఆర్.. నామినేషన్ దాఖలు చేసే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి అభ్యర్థులకు వివరించారు. నియోజకవర్గంలోని అన్ని ప్రాంతాలను చుట్టి రావాలని.. ఇతర పార్టీలకంటే ప్రచారంలో ముందుండాలిన అభ్యర్థులకు సూచించారు. ఈనెల 14న నామినేషన్ దాఖలు చేయనున్నట్లు కేసీఆర్ ప్రకటించారు. మిగిలిన 12 స్థానాల అభ్యర్థులపై చర్చ జరిగినా.. కూటమి సీట్లను ప్రకటించిన తరువాతనే ప్రకటించే అవకాశం ఉందని సమాచారం.