సాక్షి, వికారాబాద్ : హైదరాబాద్ నగరాన్ని ప్రపంచ పటంలో పెట్టానని గొప్పలు చెప్పుకునే చంద్రబాబు నాయుడు నాలుగేళ్ల కాలంలో అమరావతిలో ఒక్క ఇటుక కూడా ఎందుకు పెట్టలేక పోయారని టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ప్రశ్నించారు. ఎన్నో త్యాగాలు చేసి సాధించుకున్న స్వరాష్ట్రంలో వలసవాదుల పెత్తనం అవసరమా అని అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా వికారాబాద్ జిల్లా పరిగిలో జరిగిన బహిరంగ సభలో కేసీఆర్ ప్రసంగించారు. చంద్రబాబు ఉమ్మడి ఏపీలో సీఎంగా ఉన్న సమయంలో కరెంటు చార్జీలు పెంచినప్పుడే తెలంగాణ కోసం పోరాడాలని నిర్ణయం తీసుకున్నట్లు కేసీఆర్ గుర్తుచేశారు.
యుద్దం ఇంకా ముగియలేదని.. తెలంగాణ వ్యతిరేక శక్తులు మనపై దండయాత్రకు వస్తున్నాయని.. వారికి తిప్పి కొట్టేవరకు పోరాటం సాగుతుందని పేర్కొన్నారు. వివిధ సర్వేల ఫలితాల ప్రకారం టీఆర్‌ఎస్‌కు వందకుపైగా సీట్లు వస్తున్నట్లు కేసీఆర్ వెల్లడించారు. పాలమూరు ప్రాజెక్టు ద్వారా పరిగికి సాగు నీరు అందిస్తున్నామని, తెలంగాణ ప్రాజెక్టులకు వ్యతిరేకంగా లేఖలు రాస్తున్న చంద్రబాబు పార్టీకి ఓట్లు ఎందుకు వెయ్యాలని ప్రశ్నించారు. కాంగ్రెస్ నాయకులు చంద్రబాబును భుజానకెత్తుకుని వస్తున్నారని మండిపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment