స్థానిక ఎన్నికల సందర్భంగా చిత్తూరు నగర పాలక కార్యాలయం వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. కార్పొరేషన్ ఎన్నికల్లో నామినేషన్లు దాఖలు చేయడానికి తెలుగుదేశం పార్టీ తన అభ్యర్థులకు చిట్ట చివరి నిమిషం వరకు బీ-ఫారాలు అందజేయలేదు. దీంతో వాళ్లు వచ్చి, తమ బీ ఫారాలతో నామినేషన్లు దాఖలు చేయడానికి సిద్ధం కాగా, అప్పటికే సమయం మించిపోయిందంటూ అధికారులు అందుకు అనుమతించలేదు.
ఈ మొత్తం తతంగం పట్ల చిత్తూరు జిల్లా తెలుగు మహిళ ఉపాధ్యక్షురాలు విజయ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారిక అభ్యర్థులెవరో ముందే నిర్ణయించుకున్నప్పుడు, బీ ఫారాలు ఇవ్వడానికి అభ్యంతరం ఏంటని ఆమె మండిపడ్డారు. మొత్తమ్మీద కార్పొరేషన్ ఎన్నికల రంగంలో టీడీపీ తిరుగుబాటు అభ్యర్థులుగా 10 మంది నామినేషన్లు దాఖలు చేశారు.
చిత్తూరులో తెలుగు తమ్ముళ్ల గలాటా
Published Tue, Mar 18 2014 4:57 PM | Last Updated on Fri, Aug 10 2018 8:01 PM
Advertisement