![CM YS Jagan Handovers B Form To MLC Candidate Ruhullah - Sakshi](/styles/webp/s3/article_images/2022/03/9/CM-JAGAN.jpg.webp?itok=NjbYyMnJ)
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎండీ రుహుల్లా బీఫాం తీసుకున్నారు. తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేతుల మీదగా బీంఫాం అందుకున్నారు. ఇటీవల మరణించిన కరీమున్నీసా స్థానంలో ఆమె కుమారుడికి అవకాశం కల్పించారు. ఈ కార్యక్రమంలో దేవాదాయశాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్, రుహుల్లా తండ్రి మహ్మద్ సలీమ్ పాల్గొన్నారు.
చదవండి: సీఎం మాటలు మనో ధైర్యాన్ని నింపాయి
ఈ సందర్భంగా రుహుల్లా మీడియాతో మాట్లాడుతూ, మూడు నెలల క్రితం అమ్మ కరీమున్నీసా మరణించారని.. సీఎం వైఎస్ జగన్ పిలిపించి ఈ రోజు బీఫామ్ ఇచ్చారని తెలిపారు. రేపు నామినేషన్ దాఖలు చేస్తున్నానని పేర్కొన్నారు. మైనారిటీలంతా సీఎం జగన్‌కి రుణపడి ఉంటారన్నారు. మేమంతా ఆయనకు అండగా ఉండి ఆయన అడుగుజాడల్లో నడుస్తామన్నారు. తన తల్లి చేసిన అభివృద్ధిని కొనసాగిస్తానని రుహుల్లా అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment