సాక్షి,హైదరాబాద్ : ఎన్నికల సమయంలో తరుచుగా ఏ–ఫారం, బీ–ఫారం పేర్లు వింటుంటాం. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల గుర్తులు అభ్యర్థులకు రావాలంటే వీటి అవసరం ఉంటుంది. అవి ఏమిటో..ఎలా ఇస్తారో తెలుసుకుందాం.
ఏ–ఫారం అంటే..
పార్టీ తన అభ్యర్థిగా ఎవరినైతే ఎంపిక చేస్తుందో వారికి బీ–ఫారం అందజేస్తారు. బీ–ఫారం అందించే వ్యక్తికి ముందుగా ఇచ్చేది ‘ఏ’ ఫారం. ఎవరిని పార్టీ ఎంపిక చేసి ఏ–ఫారం అందిస్తుందో వారికి మాత్రమే బీ–ఫారం అందిస్తారు. ఏ–ఫారం అందుకున్న పార్టీ అభ్యర్థి ముందుగా తనకు లభించిన ఏ–ఫారంను ఎన్నికల అధికారులకు అందజేస్తారు.
బీ–ఫారం అంటే...
గుర్తింపు పొందిన జాతీయ, ప్రాంతీయ పార్టీలు తమ పార్టీ నుంచి ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు వీరేనని గుర్తించేలా ఇచ్చేదే ‘బీ’ ఫారం. నామినేషన్ వేసే సమయంలో ఎన్నికల అధికారులకు ఈ ఫారాన్ని దాఖలు చేస్తేనే పార్టీకి సంబంధించి ఎన్నికల గుర్తును సదరు అభ్యర్థికి కేటాయిస్తారు. పార్టీ అధ్యక్షుడు, ప్రత్యేకంగా నియమితులైన ప్రతినిధుల ద్వారా బీ–ఫారాన్ని అందిస్తారు.
Comments
Please login to add a commentAdd a comment