శ్రీకాకుళం, న్యూస్‌లైన్: జిల్లాలో జరుగుతున్న జెడ్పీటీసీ ఎన్నికల బరిలో 121 మందే మిగి లారు. నామినేషన్లు ఉపసంహరణ గడువు పూర్తి అయిన తర్వాత ఒక జెడ్పీటీసీ ఏకగ్రీవం కాగా.. మిగిలిన 37 జెడ్పీటీసీలకు 139 మంది అభ్యర్థులు రంగంలో ఉన్నట్లు అధికారులు సోమవారం రాత్రి ప్రకటించారు. అయితే రంగంలో మిగిలిన కొందరు అభ్యర్థులు రెండు సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. అటువంటి వాటిని తొలగించడంతో 121 మందే బరిలో ఉన్నట్లు తేలింది. ఆ మేరకు అధికారులు ప్రకటించారు. నరసన్నపేట జెడ్పీటీసీ స్థానం ఏకగ్రీవమైనట్లు ప్రకటించారు. అభ్యర్థులకు గుర్తుల కేటాయింపు సైతం పూర్తి చేశారు.
పార్టీల బీ ఫారాలు సమర్పించిన వారికి ఆయా పార్టీల గుర్తులను కేటాయించగా స్వతంత్రులకు ఉంగరం, ఎయిర్ కండిషనర్, చీపురు, బీరువా వంటి గుర్తులు కేటాయించారు. గుర్తులతో కూడిన తుది జాబితాను మంగళవారం సాయంత్రం జిల్లాపరిషత్ కార్యాలయ నోటీసు బోర్డులో ఉంచారు. కాగా జిల్లాలో బరిలో ఉన్న ఎంపీటీసీ అభ్యర్థుల వివరాలు మంగళవారం రాత్రి 10 గంటల సమయానికి కూడా పూర్తి స్థాయిలో జిల్లా పరిసత్ కార్యాలయానికి చేరలేదు. ఆయా మండల కేంద్రాల్లో మాత్రం తుది జాబితాలను ప్రటించారు. బుధవారం ఉదయానికి ఈ జాబితాలు జిల్లా కేంద్రానికి చేరే అవకాశం ఉంది.
జెడ్పీటీసీ బరిలో 121 మందే
Published Wed, Mar 26 2014 1:49 AM | Last Updated on Sun, Sep 2 2018 4:46 PM
Advertisement
Advertisement