
సాక్షి, అమరావతి: ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా ఖరారైన పెన్మత్స సురేష్‌బాబుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బీఫాం అందజేశారు. సురేష్‌బాబు వెంట మంత్రి బొత్స సత్యన్నారాయణ, వైఎస్సార్‌సీపీ విజయనగరం జిల్లా రాజకీయవ్యవహారాల సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు ఉన్నారు. ఇటీవల రాజ్యసభకు ఎన్నికైన మోపిదేవి వెంకటరమణ ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయడంతో ఎమ్మెల్సీ స్థానం ఖాళీ ఏర్పడింది. ఖాళీ అయిన ఎమ్మెల్సీ స్థానానికి వైఎస్సార్‌సీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి, దివంగత పెన్మత్స సాంబశివరాజు కుమారుడు సురేష్‌బాబును అభ్యర్థిగా దించారు.
సీఎం జగన్‌కు ధన్యవాదాలు..
మీడియాతో సురేష్‌బాబు మాట్లాడుతూ ఇచ్చిన మాటకు కట్టుబడి ఇంత త్వరగా టిక్కెట్ ఇచ్చినందుకు ఎంతో ఆనందంగా ఉందన్నారు.ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్‌కు ఆయన ధన్యవాదాలు తెలిపారు. ‘‘ఓదార్పు యాత్రతో పాటు ప్రతి కార్యక్రమంలో నాన్నగారితో కలిసి పాల్గొన్నాను.గత ఎన్నికల్లో వైఎస్ జగన్ నాకు ఎమ్మెల్యే టిక్కెట్ ఇచ్చినప్పటికీ స్వల్ప మెజారిటీతో ఓడిపోయాను.అయినప్పటికీ పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గానే ఉంటున్నాను. మా తండ్రి చేసిన సేవలకు గుర్తించి తనకు ఎమ్మెల్సీ టిక్కెట్ ఇచ్చారని ’’ సురేష్‌బాబు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment