సాక్షి, అమరావతి: వైఎస్సార్‌సీపీ తరపున ముగ్గురు రాజ్యసభ అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేశారు. వైఎస్సార్‌సీపీ అభ్యర్థులైన వైవీ సుబ్బారెడ్డి, మేడా రఘునాథరెడ్డి, గొల్ల బాబురావు.. అసెంబ్లీ జాయింట్ సెక్రటరీ, రాజ్యసభ ఎన్నికల రిటర్నింగ్ అధికారికి తమ నామినేషన్ పత్రాలను సమర్పించారు.
అంతకుముందు తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని కలిశారు. సీఎంను కలిసిన వారిలో వైవీ సుబ్బారెడ్డి, మేడా రఘునాథ్ రెడ్డి, గొల్ల బాబూరావు ఉన్నారు. రాజ్యసభ అభ్యర్ధులకు సీఎం జగన్ బీఫాం అందజేశారు.
సందర్భంగా వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు వైఎస్సార్‌సీపీలో అధిక ప్రాధాన్యత ఉంటుందన్నారు. రాజ్యసభ ఎన్నికల్లో సీఎం జగన్ సామాజిక న్యాయం చేశారని కొనియాడారు. గతంలో బీసీలకు నలుగురికు రాజ్యసభకు అవకాశం కల్పించగా.. తాజాగా దళితుడైన గొల్ల బాబురావుకి అవకాశం ఇచ్చినట్లు తెలిపారు. శాసన సభలో అత్యధిక బలం తమకే ఉందని, వైఎస్సార్‌సీపీ నుంచి ముగ్గురు అభ్యర్థులం విజయం సాధిస్తామని చెప్పారు. సీఎం జగన్ పాలనను ప్రజలు కోరుకుంటున్నారని, మళ్ళీ వైఎస్ జగన్‌ను గెలిలిపిస్తారని ధీమా వ్యక్తం చేశారు.
రఘునాథరెడ్డి, రాజ్యసభ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి
- సీఎం జగన్ నాకు అవకాశం కల్పించారు
- సీఎం జగన్ ఆశయాలకు అనుగుణంగా పని చేస్తాం
- రాష్ట్ర ప్రయోజనాలకోసం పనిచేస్తాం
గొల్ల బాబూరావు, రాజ్యసభ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి
- సీఎం జగన్ చరిత్ర సృష్టించారు
- పేద వర్గాల వారికి రాజ్యసభ కి పంపిస్తున్నారు
- కోట్లు ఇచ్చిన దొరకని రాజ్యసభ స్థానాన్ని దళితుడినైన నాకు ఇచ్చారు
- వచ్చే ఎన్నికల్లో సీఎం జగన్ విజయం తథ్యం
- మూడు స్థానాలు కూడా మేమే గెలుస్తాం
- చంద్రబాబు గతంలో దళితుడైన వర్ల రామయ్య ను అవమానించారు
- రాజ్యసభ సభ్యుడిని చేస్తానని మోసం చేశారు
- తన కులానికి చెందిన కనకమేడల కోసం వర్ల రామయ్య ని అవమానించారు
- సంఖ్యాబలం ప్రకారం మూడు స్థానాలు మేమే దక్కించుకుంటాం
Comments
Please login to add a commentAdd a comment