సాక్షి, ఢిల్లీ: రాజ్యసభ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లోని మూడు రాజ్యసభ స్థానాలను వైఎస్సార్‌సీపీ ఏకగ్రీవంగా దక్కించుకుంది. ఈ మేరకు ఎన్నికల కమిషన్ అధికారికంగా ప్రకటించింది. వైఎస్సార్‌సీపీ అభ్యర్థులుగా గొల్ల బాబూరావు, వైవీ సుబ్బారెడ్డి, మేడా రఘునాథరెడ్డి నామినేషన్లు వేసిన విషయం తెలిసిందే. ఈ మూడు స్థానాల గెలుపుతో.. వైఎస్సార్‌సీపీ రాజ్యసభ సభ్యుల సంఖ్య 11కు చేరుకుంది. ఏకగ్రీవమైన రాజ్యసభ సభ్యులకు ఎన్నికల అధికారులు ధృవ పత్రాలను అందించనున్నారు.
కాగా, తాజా ఎన్నికలతో రాజ్యసభలో టీడీపీ జెండా మాయమయినట్టయింది. పార్టీ ఏర్పడిన 41 ఏళ్ల తర్వాత రాజ్యసభలో టీడీపీ సభ్యులు లేని పరిస్థితి వచ్చింది. చంద్రబాబు నాయకత్వంలో టీడీపీ దీనస్థితికి ఇది నిదర్శనం. తన పార్టీకి బలం లేకున్నా.. చివరి వరకు ఓటుకు కోట్లు ఫార్ములా నమ్ముకున్న చంద్రబాబు.. ఆ ఎత్తులు పని చేయకపోవడంతో ఎన్నికల్లో అభ్యర్థిని దించే పని చెయ్యలేదు.
Comments
Please login to add a commentAdd a comment