
సాక్షి, హైదరాబాద్: మునుగోడు ఉపఎన్నికలో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేయనున్న కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి సీఎం కేసీఆర్ బీ ఫామ్‌ను ప్రగతి భవన్‌లో శుక్రవారం అందజేశారు. ఎన్నికల ఖర్చు నిమిత్తం పార్టీ నిధి నుంచి రూ.40 లక్షల చెక్కును ఇచ్చారు. తనకు అభ్యర్థిగా అవకాశమిచ్చినందుకు సీఎం కేసీఆర్‌కు కూసుకుంట్ల ఈ సందర్భంగా కృతజ్జతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో నల్గగొండ జిల్లా మంత్రి జగదీశ్ రెడ్డి, ఎమ్మెల్సీలు తక్కెళ్లపల్లి రవీందర్ రావు, పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, గువ్వల బాలరాజు,మాజీ ఎమ్మెల్సీ శ్రీనివాస రెడ్డి తదితరులున్నారు పాల్గొన్నారు.
మునుగోడు ఉపఎన్నికకు శుక్రవారమే నోటిఫికేషన్ విడుదలైంది. పోలింగ్ నవంబర్ 3న ఉండనుంది. ఫలితాలు 6న ప్రకటిస్తారు. కాంగ్రెస్ నుంచి పాల్వాయి స్రవంతి రెడ్డి, బీజేపీ నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బరిలోకి దిగుతున్నారు.
చదవండి: మునుగోడు ఉపఎన్నిక నోటిఫికేషన్ విడుదల
Comments
Please login to add a commentAdd a comment