
సాక్షి, తాడేపల్లి: స్థానిక సంస్థల కోటా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గురువారం బీఫాంలు అందజేశారు. శాసనసభలోని సీఎం కార్యాలయంలో పార్టీ అభ్యర్థులు వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్, తూమాటి మాధవరావు, డాక్టర్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు సీఎం జగన్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వీరికి సీఎం జగన్ బీఫాంలు అందజేశారు. ఇతర పార్టీల అభ్యర్థులు ఎవరైనా నామినేషన్ దాఖలు చేస్తే ఈ నెల 29న అసెంబ్లీ భవనంలో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ నిర్వహిస్తారు. అదేరోజు సాయంత్రం 5 గంటలకు ఓట్లు లెక్కిస్తారు. లేనిపక్షంలో అభ్యర్థులు ఏకగ్రీవం కానున్నారు.
చదవండి: (ఏపీ శాసనమండలి చైర్మన్ ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల)