MLC posts
-
అనూహ్యంగా తెరపైకి బల్మూరి వెంకట్
సాక్షి, హైదరాబాద్: ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎన్ఎస్యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట నర్సింగరావు పేరు తెరపైకి వచ్చింది. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్‌కుమార్‌గౌడ్ పేరు దాదాపు ఖరారైందని ప్రచారం జరిగినా, మంగళవారం అనూహ్యంగా వెంకట్ రేసులోకి వచ్చారు. టీపీసీసీ ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్‌తో పాటు వెంకట్‌ను రెండో ఎమ్మెల్సీ అభ్యర్థిగా పార్టీ అధిష్టానం ఎంపిక చేసింది. ఈ మేరకు మంగళవారం మధ్యాహ్నం నుంచే ప్రచారం జరిగినా అధికారికంగా ఎలాంటి ప్రకటన రాలేదు. అయితే ఇద్దరికీ ఏఐసీసీ నుంచి వ్యక్తిగతంగా సమాచారం అందిందని, నామినేషన్లు సిద్ధం చేసుకోవాల్సిందిగా సూచించినట్లు తెలిసింది. ఈ నెల 18న నామినేషన్లు దాఖలు చేయాల్సి ఉన్న నేపథ్యంలో ఏ క్షణమైనా ఈ ఇద్దరి పేర్లను ఏఐసీసీ అధికారికంగా ప్రకటిస్తుందని తెలుస్తోంది. నిజానికి మంగళవారమే ప్రకటించాల్సి ఉన్నప్పటికీ అనివార్య కారణాల వల్ల ఆగిపోయిందని, బుధవారం అధికారిక ప్రకటన వస్తుందని గాంధీ భవన్ వర్గాలంటున్నాయి. జగ్గారెడ్డికి బీ ఫారాలపై సంతకాల అధికారం ఇద్దరు ఎమ్మెల్సీ అభ్యర్థులు సమర్పించనున్న బీఫారాలపై టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ టి.జగ్గారెడ్డి సంతకాలు చేయనున్నారు. పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న సీఎం రేవంత్‌రెడ్డి విదేశీ పర్యటనలో ఉన్న నేపథ్యంలో, వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో బీఫారాలిచ్చే అధికారాన్ని ఏఐసీసీ జగ్గారెడ్జికి ఇచి్చంది. ఇక నామినేషన్ల దాఖలు, ఎమ్మెల్యేల చేత ప్రతిపాదిత సంతకాలు చేయించే వ్యవహారాలను సమన్వయం చేసే బాధ్యతను డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కకు అప్పగించినట్టు సమాచారం. కాంగ్రెస్ అధిష్టానం అధికారికంగా ప్రకటించిన నేపథ్యంలో అతిపిన్న వయస్కుడిగా మండలిలో అడుగుపెట్టే ఎమ్మెల్సీగా బల్మూరి వెంకట్ రికార్డు సృష్టించనున్నారు. దేశంలోనే శాసనమండలికి ఎన్నికైన వారిలో ఇంత చిన్న వయస్సు ఉన్న వారెవరూ లేరు. ప్రస్తుతం వెంకట్ వయసు 30 సంవత్సరాల 9 నెలలు. ఇప్పటివరకు 33 ఏళ్ల వయసులో ఒకరు గుజరాత్ శాసనమండలికి ఎన్నిక కావడమే రికార్డు అని, ఇప్పుడు ఆ రికార్డును వెంకట్ అధిగమిస్తారని గాంధీభవన్ వర్గాల సమాచారం. -
తెలంగాణలో రెండు ఎమ్మెల్సీ స్థానాలకు షెడ్యూల్ విడుదల
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో రెండు ఎమ్మెల్సీ స్థానాలకు షెడ్యూల్ విడుదలైంది. ఈ నెల 11న నోటిఫికేషన్ విడుదల కానుంది. 29న పోలింగ్ జరగనుంది. ఎమ్మెల్యేలుగా ఎన్నికయిన కడియం శ్రీహరి, పాడి కౌశిక్‌రెడ్డి ఎమ్మెల్సీలుగా రాజీనామాతో రెండు స్థానాలు ఖాళీ అయ్యాయి. వీరిద్దరూ ఎమ్మెల్యే కోటా కిందనే ఎన్నికయ్యారు. దీంతో ఈ రెండు స్థానాలకు ఈ నెల 29న పోలింగ్ నిర్వహించి అదే రోజున ఫలితాలను వెల్లడించనున్నట్లు కేంద్ర ఎన్నికల కమిషన్ పేర్కొంది. ►జనవరి 11న నోటిఫికేషన్ ►నామినేషన్ల దాఖలుకు చివరితేదీ జనవరి 18 ►జనవరి 19న నామినేషన్ల స్క్రూట్నీ ►నామినేషన్ల ఉపసంహరణకు చివరితేదీ జనవరి 22 ►జనవరి 29న ఎమ్మెల్సీ ఎన్నిక పోలింగ్, కౌంటింగ్ -
గవర్నర్ కోటా చాన్స్ ఎవరికో..? 20 మంది ఆశావహులు.. ఆ ఇద్దరు ఎవరు?
సాక్షి, హైదరాబాద్: సుమారు నెలన్నరకు పైగా ఖా ళీగా ఉన్న రెండు గవర్నర్ కోటా ఎమ్మెల్సీ స్థానాల భర్తీకి సంబంధించిన ప్రక్రియపై బీఆర్ఎస్ అధి నేత, సీఎం కె.చంద్రశేఖర్‌రావు కసరత్తు చేపట్టారు. అభ్యర్థులను ఖరారు చేసి ప్రతిపాదనలు పంపడంపై దృష్టి సారించారు. ఇద్దరి పేర్లను వారం రోజుల్లో నే గవర్నర్ ఆమోదానికి పంపే అవకాశ ముందని బీఆర్ఎస్ వర్గాలు వెల్లడించాయి. ఈ ఏడాది మే 27న గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా పనిచేసిన ఫారూఖ్ హుస్సేన్, డి.రాజేశ్వర్ ఆరేళ్ల పదవీ కాలం పూర్తి చేసుకున్నారు. వీరి స్థానంలో ఎవరినీ నామినేట్ చేయకపోవడంతో సుమారు నెలన్నర రోజులుగా ఈ రెండు పదవులు ఖాళీగా ఉన్నాయి. భారీ సంఖ్యలో ఆశావహులు మైనార్టీ వర్గానికి చెందిన ఫారూఖ్ హుస్సేన్, డి.రాజేశ్వర్ ఇద్దరూ తమకు మరోమారు అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. మరోవైపు క్రిస్టియన్ మై నారిటీ వర్గానికి చెందిన రాయిడిన్ రోచ్.. తనకు అవకాశం ఇవ్వాలని కోరుతూ పలు సంఘాలు చేసిన తీర్మానాలను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకె ళ్తున్నారు. వీరితో సుమారు 20 మంది నేతలు ఎమ్మె ల్సీ పదవులను ఆశిస్తుండగా పలువురి పేర్లు ముఖ్య మంత్రి పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. మండలి మాజీ చైర్మన్ స్వామిగౌడ్, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు, మాజీ ఎమ్మెల్యే భిక్షమయ్యగౌడ్, ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి, దాసోజు శ్రవణ్, పీ ఎల్ శ్రీనివాస్ తదితరుల పేర్లకు సంబంధించి వడ పోత జరుగుతున్నట్లు బీఆర్ఎస్ వర్గాలు చెప్తున్నా యి. 40 మంది సభ్యులున్న శాసనమండలిలో ప్రస్తుతం గవర్నర్ కోటాలో ఖాళీగా ఉన్న రెండు స్థానాలను మినహాయిస్తే ఇప్పట్లో ఇతర కోటాల్లో ఖాళీలు ఏర్పడే అవకాశం లేదు. సుమారు మూడొంతులకు పైగా మండలి సభ్యులు 2027 నుంచి 2029 మధ్యకాలంలో ఆరేళ్ల పదవీ కాలం పూర్తి చేసుకోను న్నారు. వచ్చే ఏడాది ఒక్క ఖాళీ కూడా ఏర్పడే అవ కాశం లేకపోగా, 2025లో మాత్రం కేవలం ఇద్దరు ఎమ్మెల్సీలు ఎంఎస్ ప్రభాకర్, టి.జీవన్‌రెడ్డి పదవీ విరమణ చేస్తారు. ఈ నేపథ్యంలోనే గవర్నర్ కోటాలో ఖాళీగా ఉన్న రెండు స్థానాలకు గట్టి పోటీ నెలకొందని, ఈ కారణంగానే సీఎం కేసీఆర్ వీటి భర్తీ విషయంలో నెలన్నర రోజులుగా తాత్సారం చేస్తున్నట్లు చెబుతున్నారు. త్వరలో మండలికి కూచుకుళ్ల గుడ్‌బై! బీఆర్ఎస్ నాయకత్వంపై కొంతకాలంగా అసంతృప్తిగా ఉన్న మహబూబ్‌నగర్ స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్ రెడ్డి త్వరలో పార్టీని వీడేందుకు సిద్ధమవుతు న్నారు. కూచుకుళ్ల కుమారుడు నాగర్‌కర్నూల్ అసెంబ్లీ టికెట్‌ను ఆశిస్తుండటం, సిట్టింగ్ ఎమ్మె ల్యే మర్రి జనార్దన్‌రెడ్డితో విభేదాల నేపథ్యంలో ఆయన కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతున్నారు. కూచుకుళ్ల కుమారుడు ఇప్పటికే రాహుల్ సమ క్షంలో కాంగ్రెస్‌లో చేరగా, ఈనెల 20న కొల్లా పూర్లో జరిగే ప్రియాంకాగాంధీ సభలో ఆయ న కూడా చేరనున్నారు. ప్రస్తుతం అమెరికా నుంచి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి తిరిగి వచ్చిన తర్వాత ఆయనతో చర్చించి ఎమ్మెల్సీ పదవికి కూడా రాజీనామా చేయాలని కూచుకుళ్ల భావిస్తున్నట్టు తెలిసింది. అదే జరిగితే ఎన్నికల కమిషన్ నిర్ణయం మేరకు ఈ ఏడాది చివర్లో కాని, వచ్చే ఏడాది ప్రారంభంలో కానీ ఈ ఖాళీ భర్తీకి ఎన్నిక జరిగే అవకాశం ఉంటుంది. -
MLC: వచ్చే ఏడాది 17 ఎమ్మెల్సీలు ఖాళీ.. గెలుచుకునే అవకాశాలు ఇలా..
ముంబై: మహరాష్ట్ర శాసన మండలిలో వచ్చే ఏడాది 17 స్థానాలు ఖాళీ కానున్నాయి. 2016లో ఎన్నికైన 17 మంది ఎమ్మెల్సీల పదవీకాలం వచ్చే ఏడాదితో ముగియనుంది. ఈ 17 మందిలో పదిమంది సభ్యులు శాసనసభ సభ్యులచే ఎన్నుకోబడిన వారు కాగా, మిగతా ఏడుగురు స్థానిక స్వపరిపాలనా సంస్థల ద్వారా ఎన్నికయ్యారు. వీరి పదవీకాలం ముగియనుండటంతో వచ్చే ఏడాది జరిగే మండలి ఎన్నికల తర్వాత మహరాష్ట్ర శాసన మండలి రాజకీయ ముఖచిత్రం మారిపోయే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం శాసన సభలో ఆయా పార్టీలకు ఉన్న సభ్యుల సంఖ్య ప్రకారం బీజేపీ నాలుగు ఎమ్మెల్సీలు, శివసేన, ఎన్సీపీలు చెరో రెండు ఎమ్మెల్సీ స్థానాలు గెలుచుకునే అవకాశాలుండగా, కాంగ్రెస్ ఒక ఎమ్మెల్సీని గెలుచుకునే అవకాశముంది. ఇలా తొమ్మిది సీట్లు బీజేపీ, శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్‌లు గెలుచుకున్నా పదవ సీటు కోసం మాత్రం గట్టి పోటీ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే స్వతంత్రులు కాంగ్రెస్ అభ్యర్థికి మద్దతు పలికితే పదో స్థానం కూడా కాంగ్రెస్ ఖాతాలో పడవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ రకంగా మహా ఆఘాడికి చెందిన ఆరుగురు, బీజేపీకి చెందిన నలుగురు సభ్యులు ఎమ్మెల్సీలుగా గెలిచే అవకాశాలున్నాయి. పదవీ కాలం ముగియనున్న సభ్యుల్లో రామ్‌రాజే నాయిక్ నింబాల్కర్, పరిశ్రమల శాఖ మంత్రి సుభాష్ దేశాయ్‌కి మరోసారి అవకాశం ఇస్తారా లేదా అనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. వీరిద్దరి వయస్సు ఎక్కువగా ఉండటం వల్ల మళ్లీ అవకాశం దక్కకపోవచ్చని, వారిద్దరికి ఉన్న రాజకీయ అనుభవాన్ని వినియోగించుకునేందుకు అవకాశం ఇచ్చినా ఇవ్వొచ్చని పలువురు విశ్లేషణలు చేస్తున్నారు. చదవండి: (దారుణ హత్య: తల, మొండెం వేరుచేసి తలతో పారిపోయిన ప్రియుడు) బీజేపీ నుంచి ఎనిమిదిమంది.. పదవీకాలం ముగియనున్న సభ్యుల్లో ఎనిమిది మంది బీజేపీకి చెందిన వారుకాగా, శివసేనకు చెందిన నలుగురు, ఎన్సీపీకి చెందిన ముగ్గురు, కాంగ్రెస్‌కు చెందిన ఇద్దరు సభ్యులు ఉన్నారు. తన సంఖ్యాబలాన్ని నిలబెట్టుకునేందుకు బీజేపీ తీవ్రంగానే ప్రయత్నించవచ్చు. శాసన సభ సభ్యుల ద్వారా బీజేపీకి చెందిన నలుగురు సభ్యులు ఎన్నిక కావొచ్చు. స్థానిక స్వపరిపాలనా సంస్థల నియోజక వర్గాల సంఖ్యాబలం కాగితాలపై కనిపించదు. ఎక్కువ ప్రభావం కలిగిన వ్యక్తులు గెలుస్తారు. గవర్నర్ కోటాలో నియమించే 12 మంది సభ్యుల స్థానాలు ఖాళీగానే ఉన్నాయి. కొత్త ఏడాదిలో మరో 17 మంది నూతనంగా ఎన్నిక కానున్నారు. దీంతో శాసన మండలి ముఖచిత్రం పూర్తిగా మారిపోయే అవకాశాలు మెండుగా ఉన్నాయి. చదవండి: (రైల్వే కోచ్ రెస్టారెంట్ సూపర్ సక్సెస్) ఎవరెవరి పదవీ కాలం ముగియనుందంటే.. వచ్చే ఏడాది పదవీ కాలం ముగియనున్న ఎమ్మెల్సీలలో బీజేపీకి చెందిన ప్రవీణ్ దరేకర్, సదాభావు ఖోత్, సుజీర్త్సహ్ ఠాకూర్, వినాయక్ మోరే, ప్రసాద్ లాడ్, రామ్నివాస్ సింగ్, చందూభాయి పటేల్, పరిణయ్ ఫుకే ఉన్నారు. శివసేనకు చెందిన ఎమ్మెల్సీల్లో సుభాశ్ దేశాయ్, దివాకర్ రావ్తే, రవీంద్ర ఫాటక్, దుష్యంత్ చతుర్వేది తదితరుల పదవీకాలం వచ్చే ఏడాది ముగియనుంది. ఎన్సీపీ నుంచి సంజయ్ ధౌండ్, రామ్‌రాజే నాయిక్ నింబాల్కర్, అనిల్ భోంస్లేల పదవీ కాలం ముగియనుండగా.. కాంగ్రెస్ నుంచి మోహన్ కదం, అమర్ రాజుర్కర్ల పదవీ కాలం వచ్చే ఏడాది ముగియనుంది. -
ఎమ్మెల్సీ అభ్యర్థులకు బీఫాంలు అందజేసిన సీఎం జగన్
సాక్షి, తాడేపల్లి: స్థానిక సంస్థల కోటా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గురువారం బీఫాంలు అందజేశారు. శాసనసభలోని సీఎం కార్యాలయంలో పార్టీ అభ్యర్థులు వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్, తూమాటి మాధవరావు, డాక్టర్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు సీఎం జగన్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వీరికి సీఎం జగన్ బీఫాంలు అందజేశారు. ఇతర పార్టీల అభ్యర్థులు ఎవరైనా నామినేషన్ దాఖలు చేస్తే ఈ నెల 29న అసెంబ్లీ భవనంలో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ నిర్వహిస్తారు. అదేరోజు సాయంత్రం 5 గంటలకు ఓట్లు లెక్కిస్తారు. లేనిపక్షంలో అభ్యర్థులు ఏకగ్రీవం కానున్నారు. చదవండి: (ఏపీ శాసనమండలి చైర్మన్ ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల) -
స్థానిక సంస్థల కోటాలో 11 మంది పేర్లు ప్రకటించాం: సజ్జల
-
మా పార్టీ అభ్యర్థుల ఎన్నిక లాంఛనమే: సజ్జల
సాక్షి, అమరావతి: టీడీపీ శాసన మండలిలో సైందవ పాత్ర పోషించిందని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ఎమ్మెల్యే కోటాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థులు మంగళవారం నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. 'శాసనసభలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. మా పార్టీ అభ్యర్థుల ఎన్నిక లాంఛనమే అవుతుంది. స్థానిక సంస్థల కోటాలో కూడా 11 మంది పేర్లు ప్రకటించాం. దీంతో శాసనమండలిలో వైఎస్సార్సీపీ బలం 32 మందికి పెరుగుతుంది. 18 మంది బలహీన వర్గాలకు చెందిన వ్యక్తులకు కేటాయించామని సగర్వంగా ప్రకటిస్తున్నాం. అందులో నలుగురు మైనార్టీలు. టీడీపీలో బలహీన వర్గాలకు అన్యాయం జరిగింది. ఆ పార్టీని ప్రజా కోర్టులో ప్రజలు తిరస్కరించారు. నామినేటెడ్ పోస్టుల భర్తీలో బలహీన వర్గాలకు 50 శాతం కేటాయించాం. సోషల్ ఇంజనీరింగ్‌లో సామాజిక న్యాయానికి పెద్దపీట వేశాం' అని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. చదవండి: (రైతుల కోసం మరో అడుగు ముందుకు వేస్తున్నాం: సీఎం జగన్) -
సెంట్రల్ జైలులో ఉంచినా.. నమ్మిన జెండా వీడలేదు.. సమర్థతను గుర్తించి
సాక్షి, రాజమహేంద్రవరం: పార్టీ కోసం క్రమశిక్షణతో పని చేసిన నాయకులకు వైఎస్సార్ సీపీలో సముచిత స్థానం లభిస్తుందనేది మరోసారి రుజువైంది. పార్టీకి అనంతబాబు చేసిన సేవలకు గుర్తింపుగా సముచిత స్థానం కల్పిస్తానని వైఎస్ జగన్మోహన్రెడ్డి పలు సందర్భాల్లో మాట ఇచ్చారు. ఆ మాట ప్రకారం సీఎం ఆదేశాల మేరకు వైఎస్సార్ సీపీ అధిష్టానం రంపచోడవరం నేత అనంత సత్య ఉదయభాస్కర్(అనంత బాబు)ను స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా శుక్రవారం ప్రకటించింది. ఆయన గెలుపు లాంఛనమే కానుంది. మున్సిపల్, జిల్లా, మండల ప్రాదేశిక నియోజకవర్గాల్లో ఇటీవల వైఎస్సార్ సీపీ తిరుగులేని ఆధిక్యం చాటుకుంది. ఈ క్రమంలో అనంతబాబు గెలుపు నల్లేరుపై నడకే కానుంది. ‘ఓదార్పు’ నుంచీ జగన్ వెంటే.. దివంగత జక్కంపూడి రామ్మోహనరావు ముఖ్య అనుచరుడు అనంతబాబు. ఓదార్పు యాత్ర నుంచి ఇప్పటి వరకూ వైఎస్ జగన్మోహన్రెడ్డి వెన్నంటి నిలిచారు. అధికారంలో ఉండగా తమ పార్టీలో చేరాలని టీడీపీ నుంచి అనేక ఒత్తిళ్లు వచ్చాయి. అక్రమ కేసులు పెట్టి వేధించినా తల వంచలేదు. తొమ్మిది రోజులు విశాఖ సెంట్రల్ జైలులో ఉంచినా పార్టీకే కట్టుబడి ఉన్నారు. ఆయన చెమటోడ్చి 2014లో వంతల రాజేశ్వరిని ఎమ్మెల్యేగా గెలిపించినా ప్రలోభాలకు లొంగిన ఆమె పార్టీ ఫిరాయించారు. స్వయానా మేనమామలైన జ్యోతుల నెహ్రూ, వరుపుల సుబ్బారావు సైతం వైఎస్సార్ సీపీ నుంచి టీడీపీకి ఫిరాయించినా అనంతబాబు నమ్మిన జెండా వీడలేదు. రంపచోడవరం నియోజకవర్గంలో జగన్ ఓదార్పు యాత్ర చరిత్రలో నిలిచిపోయేలా విజయవంతం చేశారు. అప్పటి నుండి జగన్ వెంట నడుస్తూ పార్టీని ఒంటి చేత్తో విజయపథాన నడిపిస్తూ మంచి గుర్తింపు పొందారు. చదవండి: (అన్నిటా అగ్రతాంబూలం.. రెండు ఎమ్మెల్సీ పదవులూ వారికే..) రాజకీయ కుటుంబ నేపథ్యం అనంత బాబు తాత వీర్రాజు, ముత్తాత పడాల వీర్రాజు పలు పర్యాయాలు అడ్డతీగల సమితి అధ్యక్షులుగా పని చేశారు. తండ్రి అనంత చక్రరావు 1982లో అడ్డతీగల సమితి ప్రెసిడెంట్, 1987లో అడ్డతీగల ఎంపీపీగా పని చేశారు. వారి రాజకీయ వారసత్వాన్ని అందిపుచ్చుకున్న అనంత బాబు ఏజెన్సీలో తిరుగులేని నాయకుడిగా చక్రం తిప్పుతున్నారు. టీడీపీ కంచుకోటగా ఉన్న ఏజెన్సీలో తనదైన రాజకీయ వ్యూహంతో వైఎస్సార్ సీపీకి బలమైన బాటలు వేశారు. 2014, 2019 సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ జెండాను రెపరెపలాడించడంలో క్రియాశీలక పాత్ర పోషించారు. 2019 ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ పక్షాన నాగులపల్లి ధనలక్ష్మి సాధించిన 38 వేల ఓట్ల భారీ మెజారి అప్పట్లో ఒక రికార్డు. 2014, 2019లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో 90 శాతం స్థానాలను కైవశం చేసుకోవడంలో అనంతబాబు విశేష కృషి చేశారు. 2001లో అడ్డతీగల జెడ్పీటీసీగా, 2006లో ఎంపీపీగా, 2019లో డీసీసీబీ చైర్మన్‌గా పని చేశారు. టీడీపీ హయాంలో డీసీసీబీ పరిధిలోని పలు ప్రాథమిక సహకార సంఘాలు, బ్రాంచిల్లో జరిగిన అవినీతి బాగోతాలపై ఉక్కు పాదం మోపారు. -
అన్నిటా అగ్రతాంబూలం.. రెండు ఎమ్మెల్సీ పదవులూ వారికే..
బీసీ లంటే బ్యాక్వర్డ్ క్లాస్ కాదు.. బ్యాక్‌బోన్ అని సరికొత్త భాష్యాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చాటి చెప్పారు. తాజాగా ప్రకటించిన రెండు ఎమ్మెల్సీలు కూడా బీసీలకే కేటాయించి మరోసారి వైఎస్సార్సీపీ వెనుకబడిన వర్గాల పక్షపాతి అని నిరూపించారు. – సాక్షి, విశాఖపట్నం ఆ మధ్య జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ వైఎస్ జగన్ ప్రభుత్వం జారీ చేసిన జీవోను కోర్టు నిలిపి వేయడంతో కొరత పడిన 10 శాతం సీట్లను పార్టీ పరంగా కేటాయించాలని వైఎస్ జగన్ విప్లవాత్మక నిర్ణయం తీసుకున్నారు. ఇటీవల జరిగిన జీవీఎంసీ ఎన్నికల్లో మొత్తం 98 వార్డుల్లో ఏకంగా 65 వార్డులను బీసీ వర్గాలకే కేటాయించి.. బీసీలకు సామాజిక న్యాయం అందించడంలో తానెంత ముందుంటానో నిరూపించారు. అదేవిధంగా బీసీలకు రిజర్వు చేసిన 9 జెడ్పీటీసీ స్థానాలతో పాటు మరో 10 జనరల్ స్థానాల్లో టికెట్లు కేటాయించారు. జీవీఎంసీ మేయర్ పదవిని కూడా బీసీ మహిళకు అప్పగించారు. ఇవే కాకుండా ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల్లోనూ బీసీ లబ్ధిదారులే ఎక్కువగా ఉన్నారు. ఇటీవల ప్రకటించిన వివిధ కార్పొరేషన్ల పదవుల్లోనూ వెనుకబడిన తరగతులకు అగ్రస్థానం కల్పించారు. తాజాగా ప్రకటించిన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థుల జాబితాలో విశాఖకు కేటాయించిన రెండు సీట్లనూ బీసీలకే ప్రకటించడంతో అంతటా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. వంశీకృష్ణ శ్రీనివాస్ బీసీ (యాదవ) కాగా, వరుదు కల్యాణి కూడా బీసీ (వెలమ) కావడం గమనార్హం. జగనన్నకు కృతజ్ఞతలు పార్టీలో చేరినప్పటి నుంచి అనునిత్యం జగనన్న గుర్తింపునిస్తున్నారు. పార్టీ నగర అధ్యక్షుడిగా బాధ్యతలు అప్పగించారు. ఇప్పుడు బాధ్యతాయుతమైన శాసన మండలి సభ్యుడిగా గుర్తింపునిచ్చారు. సామాజికంగా, ఆర్థికంగా అట్టడుగున ఉన్న వెనుకబడిన తరగతుల సంక్షేమం కోసం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం నిరంతరం శ్రమిస్తోందనడానికి ఇదే నిదర్శనం. పార్టీని నమ్ముకున్న ప్రతి ఒక్కరికీ జగనన్న గుర్తింపునిస్తారు. ఎమ్మెల్సీ పదవిని బాధ్యతాయుతంగా నిర్వర్తించి ప్రభుత్వ ఆశయాలకు అనుగుణంగా పని చేస్తా. ఈ అవకాశం కల్పించిన సీఎం జగనన్నకు, రాజ్యసభసభ్యుడు విజయసాయిరెడ్డికి ఎప్పటికీ రుణపడి ఉంటాను. – వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్సీ అభ్యర్థి ఇది నా అదృష్టం వైఎస్ జగన్మోహన్రెడ్డి పార్టీ కోసం కష్టపడిన వారిని ఎప్పుడూ విడిచి పెట్టరని మరోసారి నిరూపించారు. మిగిలిన పార్టీల్లో ఎవరు ఎంత డబ్బులిస్తే వారికి ఎమ్మెల్సీ పదవులు ఇస్తుంటారు. కానీ.. వైఎస్ జగన్ మాత్రం పార్టీలో ఎంత కష్టపడ్డారో వారిని గుర్తించి పదవులు ఇస్తుంటారు. ఉత్తరాంధ్ర జిల్లాలో ఒక బీసీ మహిళకు ఈ అవకాశం ఇవ్వడం నిజంగా అదృష్టం. పదకొండేళ్లు జగనన్న వెంట నడిచాను. పార్టీ పదవుల్లో ఎన్నోసార్లు గుర్తింపు ఇచ్చారు. ఆయన నా మీద పెట్టిన నమ్మకాన్ని వమ్ము చేయను. – వరుదు కల్యాణి, ఎమ్మెల్సీ అభ్యర్థి -
Andhra Pradesh: కొనసాగుతున్న కొత్త విప్లవం
సాక్షి, అమరావతి: 2019 సార్వత్రిక ఎన్నికల్లో అత్యధికంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల అభ్యర్థులను బరిలోకి దించి ఎమ్మెల్యేలు, ఎంపీలుగా అవకాశం కల్పించి సరికొత్త సామాజిక రాజకీయ విప్లవానికి నాంది పలికిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అదే ఒరవడిని కొనసాగిస్తున్నారు. తాజాగా ఎన్నికలు నిర్వహిస్తున్న 11 స్థానిక సంస్థల ఎమ్మెల్సీ నియోజకవర్గాలకు వైఎస్సార్ సీపీ అభ్యర్థులను ఖరారు చేశారు. ఎమ్మెల్యేల కోటాలో ఎన్నికలు నిర్వహిస్తున్న మూడు ఎమ్మెల్సీ స్థానాలకు పార్టీ అభ్యర్థులను బుధవారమే ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రతిపక్షంలో ఉన్నప్పుడూ, అధికారంలోకి వచ్చాక సామాజిక న్యాయానికే ముఖ్యమంత్రి జగన్ పెద్దపీట వేస్తూ వస్తున్నారని వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో స్థానిక సంస్థల కోటా పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థుల వివరాలను శుక్రవారం ఆయన మీడియాకు వెల్లడించారు. ఎన్నికలు జరుగుతున్న మొత్తం 14 ఎమ్మెల్సీ స్థానాల్లో ఎస్సీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన ఏడుగురికి వైఎస్సార్సీపీ అవకాశం కల్పించడం గమనార్హం. మిగతా ఏడు చోట్ల ఓసీ (క్షత్రియ–1, కాపు–2, కమ్మ–2, రెడ్డి–2) అభ్యర్థులను బరిలోకి దించుతున్నారు. ముఖ్యమంత్రి జగన్ 50 శాతం స్థానాల్లో ఎస్సీ, బీసీ, మైనార్టీ వర్గాలకు అవకాశం కల్పించడం ద్వారా సామాజిక న్యాయంపై తన చిత్తశుద్ధిని మరోసారి చాటుకున్నారని రాజకీయ విశ్లేషకులు ప్రశంసిస్తున్నారు. ఇంత ప్రాధాన్యం ఇదే తొలిసారి.. ప్రస్తుతం శాసనమండలిలో వైఎస్సార్సీపీ తరఫున 18 మంది ప్రాతినిధ్యం వహిస్తుండగా అందులో 11 మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల వారే కావడం గమనార్హం. శాసనసభ, స్థానిక సంస్థల్లో పార్టీలకు ఉన్న బలాబలాలను పరిగణలోకి తీసుకుంటే ప్రస్తుతం ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్న 14 స్థానాల్లోనూ వైఎస్సార్సీపీ అభ్యర్థులు విజయకేతనం ఎగరవడం ఖాయమని స్పష్టమవుతోంది. అప్పుడు మండలిలో వైఎస్సార్సీపీ సభ్యుల సంఖ్య 18 నుంచి 32కు పెరుగుతుంది. తద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన ఎమ్మెల్సీల సంఖ్య 11 నుంచి 18కి పెరగనుంది. మండలిలో ఒక పార్టీ తరఫున ప్రాతినిధ్యం వహించే సభ్యుల్లో 56.25 శాతం మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన వారే కానుండటం ఇదే తొలిసారి అని పేర్కొంటున్నారు. ఇక రాష్ట్రంలో మైనార్టీ వర్గాల నుంచి ఒక పార్టీ తరఫున నలుగురు సభ్యులు మండలికి ప్రాతినిధ్యం వహించడం కూడా చరిత్రలో ఇదే మొదటిసారి కావడం గమనార్హం. దేశంలో ఎక్కడా లేని రీతిలో సంక్షేమ పథకాలను అమలు చేస్తూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల అభ్యున్నతితోపాటు మహిళా సాధికారతకు బాటలు వేస్తున్న ముఖ్యమంత్రి జగన్ పరిపాలనలోనూ ఆ వర్గాల వారికే సింహభాగం అవకాశం కల్పించడం ద్వారా సామాజిక న్యాయాన్ని చాటిచెబుతున్నారని సామాజికవేత్తలు ప్రశంసిస్తున్నారు. చిత్తశుద్ధితో సింహభాగం... పరిపాలనలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల వర్గాలకు సింహభాగం అవకాశం కల్పించడం ద్వారా ఆయా వర్గాల అభ్యున్నతికి దోహదం చేస్తుందని, ఇది పేదరిక నిర్మూలనకు బాటలు వేస్తుందని సీఎం వైఎస్ జగన్ పలు సందర్భాల్లో తన అభిమతాన్ని చాటిచెప్పారు. పరిపాలనలో భాగస్వా్మ్యం కల్పించడం ద్వారా మహిళా సాధికారతకు బాటలు వేశారు. ఈ కోవలో 2019 ఎన్నికల్లో అధిక శాతం శాసనసభ, లోక్‌సభ స్థానాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు టికెట్లు ఇచ్చి సామాజిక, రాజకీయ విప్లవానికి నాంది పలికారు. ఎన్నికల్లో అఖండ విజయం సాధించిన తర్వాత మంత్రివర్గంలోనూ 60 శాతం పదవులను ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు ఇవ్వడం ద్వారా తన చిత్తశుద్ధిని చాటుకున్నారు. ఐదుగురు ఉప ముఖ్యమంత్రుల్లో ఒక మహిళ సహా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల వారు నలుగురు ఉన్నారు. నామినేటెడ్ పనులు, పదవుల్లో 50 శాతం రిజర్వేషన్లు – నామినేటెడ్ పదవులు, పనుల్లో 50 శాతాన్ని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు, మహిళలకే అవకాశం కల్పిస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రభుత్వం ఏకంగా చట్టాన్ని తెచ్చింది. రాష్ట్రంలో ఇప్పటికే 137 నామినేటెడ్ పదవుల్లో దాదాపు 58 శాతం అంటే 79 పదవులను ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల వర్గాల వారికే ఇచ్చారు. – రాష్ట్రంలో 47 కార్పొరేషన్లలో 481 మంది డైరెక్టర్లను ప్రభుత్వం నియమించింది. ఇందులో సుమారు 52 శాతం పదవులు అంటే 248 డైరెక్టర్ల పదవుల్లో మహిళలను నియమించింది. మిగిలిన 48 శాతం అంటే 233 డైరెక్టర్ల పదవుల్లో పురుషులకు అవకాశం కల్పించారు. డైరెక్టర్ల పదవుల్లో 58 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల వారికే దక్కాయి. స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ల కంటే అధికంగా.. మున్సిపల్ చైర్ పర్సన్, మేయర్ పదవుల్లో 78 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల వారికే ఇచ్చారు. అందులో 60.46 శాతం పదవులను మహిళలకే ఇచ్చి రికార్డు సృష్టించారు. జిల్లా పరిషత్ అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నికల్లో సీఎం వైఎస్ జగన్ సామాజిక న్యాయాన్ని పాటించారు. 13 జిల్లా పరిషత్ చైర్మన్/చైర్పర్సన్ పదవుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు ఏకంగా తొమ్మిది కేటాయించారు. విజయనగరం, చిత్తూరు జెడ్పీ చైర్మన్ పదవులు జనరల్ విభాగానికి రిజర్వు అయినా ఆ రెండింటిలో బీసీ వర్గాలకు చెందిన మజ్జి శ్రీనివాసరావు, గోవిందప్ప శ్రీనివాసులుకు అవకాశం కల్పించారు. కృష్ణా జిల్లా జెడ్పీ చైర్పర్సన్ పదవిని జనరల్ (మహిళ)కు ప్రభుత్వం రిజర్వు చేసినా ఆ పదవిని బీసీ మహిళ ఉప్పాల హారికకు కేటాయించారు. ఒక్కో జిల్లా పరిషత్‌కు ఇద్దరేసి ఉపాధ్యక్షుల చొప్పున 26 ఉపాధ్యక్ష పదవుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల వారికి ఏకంగా 20 పదవులను కేటాయించారు. మిగిలిన ఆరు చోట్ల ఓసీలకు అవకాశం కల్పించారు. జిల్లా పరిషత్ చైర్పర్సన్లుగా ఏడుగురికి, వైస్ చైర్పర్సన్లుగా 15 మంది మహిళలకు అవకాశం కల్పించడం ద్వారా మహిళా సాధికారతకు సీఎం జగన్ పెద్దపీట వేశారు. రాష్ట్రంలో 620 ఎంపీపీలను వైఎస్సార్సీపీ కైవసం చేసుకోగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు 67 శాతం, ఓసీలకు 33 శాతం పదవులను కేటాయించారు. ఎంపీపీ పదవుల్లో ఏకంగా 64 శాతం (397) పదవులను మహిళలకు కేటాయించగా 36 శాతం (223) పదవులను పురుషులకు కేటాయించారు. సీఎం నాయకత్వ పటిమకు నిదర్శనం – సామాజిక న్యాయాన్ని చేతల్లో చూపారు: సజ్జల ముఖ్యమంత్రి జగన్ పార్టీ సీనియర్ నేతలతో చర్చించి సామాజిక న్యాయాన్ని చాటి చెబుతూ ఎమ్మెల్సీ అభ్యర్థులను ఖరారు చేసినట్లు వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. రాజ్యాంగపరంగా నిబంధనలు లేనప్పటికీ చట్టసభల్లోనూ, స్థానిక సంస్థల్లోనూ, నామినేటెడ్ పదవులు, పనుల్లోనూ 50 శాతం పదవులను ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకే కేటాయిస్తూ సామాజిక న్యాయాన్ని చేతల్లో చూపిస్తున్నారని చెప్పారు. ఎమ్మెల్యేల కోటాలో మూడు స్థానాలకు అభ్యర్థులుగా పాలవలస విక్రాంత్ (శ్రీకాకుళం జిల్లా, బీసీ–తూర్పు కాపు), ఇషాక్ బాష(కర్నూలు జిల్లా, మైనార్టీ), డీసీ గోవిందరెడ్డి (వైఎస్సార్ కడప జిల్లా) పేర్లను రెండు రోజుల క్రితమే ప్రకటించిన అంశాన్ని గుర్తు చేశారు. నిరాశ చెందవద్దు.. సామాజిక న్యాయాన్ని పాటిస్తున్నందున కొందరు సీనియర్ నాయకులు మరికొంత కాలం వేచి ఉండాలని, అవకాశం రాని వారు నిరాశ చెందవద్దని సజ్జల సూచించారు. దీన్ని వైఎస్సార్సీపీ నేతలు అర్థం చేసుకుంటున్నారని చెప్పారు. సీఎం జగన్ నాయకత్వ పటిమ వల్లే అందరినీ సమన్వయపరుస్తూ సామాజిక న్యాయాన్ని కచ్చితంగా అమలు చేయగలుగుతున్నారని తెలిపారు. మంగళగిరిలో చేనేత వర్గాలకు చెందిన వారికి ఎమ్మెల్సీగా అవకాశం కల్పిస్తామని ఇచ్చిన హామీ మేరకు మాజీ మంత్రి మురుగుడు హనుమంతరావుకు అవకాశం ఇచ్చినట్లు చెప్పారు. శాసనసభ, స్థానిక సంస్థల్లో ఉన్న బలాన్ని పరిశీలిస్తే ఎన్నికలు జరిగే 14 ఎమ్మెల్సీ స్థానాలను వైఎస్సార్సీపీ కైవసం చేసుకోవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. పేరు: డాక్టర్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు స్వగ్రామం: కొండుభట్లవారిపాలెం, గుంటూరు జిల్లా పుట్టినతేదీ: 1–7–1935 ; చదువు: పీహెచ్డీ రాజకీయ నేపథ్యం: ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయంలో వ్యవసాయశాస్త్ర విద్యను పూర్తిచేసిన ఆయన బెనారస్ విశ్వవిద్యాలయంలో పీహెచ్డీ చేశారు. బాపట్ల వ్యవసాయ కళాశాలలో 26 సంవత్సరాలపాటు ప్రొఫెసర్‌గా పనిచేశారు. తెలుగుదేశం తరఫున 1985లో బాపట్ల నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. తెనాలి, బాపట్ల నియోజకవర్గాల నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. కేంద్రమంత్రిగా పనిచేశారు. అనంతరం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన ఆయన 2017లో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. శాసనమండలి చీఫ్‌విప్‌గా, ఫ్లోర్‌లీడర్‌గా పనిచేశారు. పేరు: వరుదు కళ్యాణి స్వస్థలం: రామజోగిపాలెం, చోడవరం మండలం, విశాఖ జిల్లా పుట్టినతేది: 30–08–1979 ; చదువు: బీఎస్సీ అగ్రికల్చర్, ఎంబీఏ భర్త: గేదెల లక్ష్మణ్సురేశ్ ; పిల్లలు: సిద్ధార్థ, గౌతమ్ రాజకీయ నేపథ్యం: 2012 నుంచి 2014 వరకు వైఎస్సార్సీపీ సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్‌గా పనిచేశారు. పలు ఎన్నికల్లో ఇన్చార్జిగా పనిచేశారు. 2014 నుంచి పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా, పార్టీ మహిళా విభాగం ఆర్గనైజింగ్ జనరల్ సెక్రటరీగా పనిచేస్తున్నారు. పేరు: ఎల్లారెడ్డిగారి శివరామిరెడ్డి స్వగ్రామం: కొనకొండ్ల, వజ్రకరూరు మండలం, అనంతపురం జిల్లా చదువు: బీఏ, ఎల్ఎల్బీ ; భార్య: వై.ఉమాదేవి పిల్లలు: వై.భీమిరెడ్డి, వై.కీర్తిలక్ష్మి రాజకీయ ప్రస్థానం: 1999 నుంచి 2004 వరకు ఉరవకొండ ఎమ్మెల్యేగా, 2007 నుంచి ఆరేళ్ల పాటు శాసనమండలి సభ్యుడిగా పనిచేశారు. శాసనమండలి విప్‌గానూ వ్యవహరించారు. పేరు: తూమాటి మాధవరావు స్వగ్రామం: పోలినేనిపాలెం గ్రామం, వలేటివారిపాలెం మండలం, ప్రకాశం జిల్లా ; పుట్టిన తేదీ: 28–6–1977 ; చదువు: ఎంఏ తల్లిదండ్రులు: వరలక్ష్మి, మాల్యాద్రి (లేట్) భార్య: తూమాటి వెంకటశిరీష కుమారులు: తూమాటి లక్ష్మీదీపక్, పూజిత్చౌదరి రాజకీయ నేపథ్యం: హైదరాబాద్, బెంగళూరు నగరాల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్న ఆయన ఫార్మా పరిశ్రమ యజమానిగా ఉన్నారు. గతంలో రెండుసార్లు వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్తగా పనిచేశారు. ప్రస్తుతం పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా పనిచేస్తున్నారు. పేరు: కృష్ణరాఘవ జయేంద్రభరత్ పుట్టిన తేదీ: నవంబరు 13, 1988 ; భార్య: దుర్గాపద్మిని కుమార్తె: ఆరా ; తల్లిదండ్రులు: పద్మజ, చంద్రమౌళి విద్యాభ్యాసం: బీటెక్ రాజకీయ అనుభవం: 2019 నుంచి వైఎస్సార్సీపీ కుప్పం నియోజకవర్గ సమన్వయకర్తగా ఉన్నారు పేరు: అనంతసత్య ఉదయభాస్కర్ (అనంతబాబు) స్వగ్రామం: ఎల్లవరం, అడ్డతీగల మండలం, తూర్పుగోదావరి జిల్లా పుట్టిన తేదీ: 19–5–1974 ; చదువు: ఎల్ఎల్బీ తల్లిదండ్రులు: మంగారత్నం, చక్రరావు; భార్య: లక్ష్మీదుర్గ పిల్లలు: మోనిక, హర్షిత పదవులు: అనంత సత్య ఉదయభాస్కర్ అడ్డతీగల జెడ్పీటీసీ సభ్యుడిగా, ఎంపీపీగా, జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ చైర్మన్‌గా పనిచేశారు. ఆయన తండ్రి చక్రరావు ఎంపీపీగా పనిచేశారు. మావోయిస్టుల చేతిలో హత్యకు గురయ్యారు. తాత అనంత వీర్రాజు అడ్డతీగల సమితి ప్రెసిడెంట్‌గా పనిచేశారు. పేరు: డాక్టర్ మొండితోక అరుణకుమార్ స్వగ్రామం: చందర్లపాడు, చందర్లపాడు మండలం, కృష్ణాజిల్లా పుట్టినతేదీ: 04.09.1975 ; చదువు: పీహెచ్డీ తండ్రి: మొండితోక కృష్ణ ; భార్య: శశికళ పిల్లలు: శరణ్సిద్ధార్థ్, శ్రేయాన్ రాజకీయ అనుభవం: వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా, రాష్ట కార్యదర్శిగా పనిచేశారు. ప్రస్తుతం ఏపీఎఫ్డీసీ చైర్మన్‌గా పనిచేస్తున్నారు. పేరు: చెన్నుబోయిన వంశీకృష్ణశ్రీనివాస్ పుట్టినతేదీ: 5–2–1974 ; చదువు: ఎంఏ భార్య: పద్మజ ;పిల్లలు: సాయిసందీప్, లహరిప్రవల్లిక రాజకీయ నేపథ్యం: 2009లో ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టిన ఆయన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీలో కీలక స్థానాల్లో కొనసాగారు. 2014లో వైఎస్సార్సీపీ తరఫున విశాఖ తూర్పు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీచేశారు. పార్టీ విశాఖ నగర అధ్యక్షుడిగా పనిచేస్తున్నారు. పేరు: ఇందుకూరి రఘురాజు స్వగ్రామం: బొడ్డవర, ఎస్.కోట మండలం, విజయనగరం జిల్లా పుట్టినతేదీ: 18–07–1973; చదువు: బీఏ; తల్లిదండ్రులు: రాణి, రామరాజు భార్య: సుధారాజు (మండల ఉపాధ్యక్షురాలు) పిల్లలు: రామరాజు, పూజిత రాజకీయ నేపథ్యం:సాధారణ రైతు కుటుంబం. ఎంపీపీగా పనిచేసిన పెదతండ్రి వారసత్వంతో రాజకీయాల్లోకి వచ్చారు. జెడ్పీటీసీ సభ్యుడిగా, మండల పరిషత్ ఉపాధ్యక్షుడిగా పనిచేశారు. 2009లో స్వతంత్ర అభ్యర్థిగా, 2014లో కాంగ్రెస్ అభ్యర్థిగా ఎస్.కోట నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీచేసి ఓడిపోయారు. జిల్లా ప్లానింగ్ కమిటీ సభ్యుడిగా, జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షుడిగా పనిచేసిన ఆయన ప్రస్తుతం జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఉన్నారు. పేరు: తలశిల రఘురాం స్వగ్రామం: గొల్లపూడి, కృష్ణాజిల్లా ; పుట్టినతేదీ: 20–6–1966 చదువు: బీకాం ; తల్లిదండ్రులు: బేబీసరోజ, చంద్రశేఖరరావు భార్య: స్వర్ణకుమారి ; కుమార్తె: ప్రణవి రాజకీయ నేపథ్యం: విద్యార్థి నాయకుడిగా రాజకీయ ఆరంగ్రేటం చేశారు. 1996 నుంచి 2002 వరకు కృష్ణాజిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా పనిచేశారు. ప్రస్తుతం సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి కార్యక్రమాల సమన్వయకర్తగా ఉన్నారు. పేరు: మురుగుడు హనుమంతరావు స్వగ్రామం: మంగళగిరి, గుంటూరు జిల్లా పుట్టినతేదీ: 15–3–1947 ; తల్లిదండ్రులు: మాణిక్యం, చినవీరరాఘవులు భార్య: సామ్రాజ్యం ; పిల్లలు: అరుణకుమారి, మధుసూదనరావు, సత్యం రాజకీయ నేపథ్యం: డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి అనుచరుడిగా కాంగ్రెస్ పార్టీలో చేరిన హనుమంతరావు 1987లో మంగళగిరి మున్సిపల్ చైర్మన్‌గా ఎన్నికయ్యారు. మంగళగిరి ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆయన వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు. ఆప్కో చైర్మన్‌గా పనిచేశారు. 2014లో టీడీపీలో చేరిన ఆయన ఇటీవల ఆ పార్టీకి రాజీనామా చేసి వైఎస్సార్సీపీలో చేరారు. -
ఎమ్మెల్సీ అభ్యర్థులను ప్రకటించిన వైఎస్సార్సీపీ
సాక్షి, అమరావతి: స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన 11 మంది వైఎస్సార్సీపీ అభ్యర్థుల పేర్లను పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి శుక్రవారం ప్రకటించారు. ప్రస్తుతం మండలిలో 18 మంది వైఎస్సార్సీపీ సభ్యులు ఉన్నారని, వారిలో 11 మంది బీసీ, ఎస్సీ, మైనార్టీ వర్గాలకు చెందినవారేనని చెప్పారు. ఇప్పుడిస్తున్న 14 స్థానాలతో కలిపి మొత్తం 32 స్థానాల్లో 18 మంది సభ్యులు బీసీ, ఎస్సీ, మైనార్టీలు ఉన్నారన్నారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో సజ్జల విలేకరుల సమావేశం నిర్వహించారు. శాసనమండలి పదవుల్లోనూ సామాజిక న్యాయం పాటిస్తున్న ఘనత పార్టీ అధ్యక్షులు, సీఎం జగన్‌కే దక్కిందని ఈ సందర్భంగా సజ్జల పేర్కొన్నారు. సీనియర్ నాయకులతో చర్చించి ఎమ్మెల్సీ అభ్యర్థుల పేర్లను సీఎం ఖరారు చేశారని అన్నారు. ఎమ్మెల్యే కోటా కింద వచ్చే మూడు స్థానాలకు పార్టీ అభ్యర్థుల ఎంపికలోనూ సామాజిక న్యాయం పాటించామని, పాలవలస విక్రాంత్, ఇసాక్ బాషా, డీసీ గోవిందరెడ్డిల పేర్లను ప్రకటించామని గుర్తు చేశారు. 14 ఎమ్మెల్సీ స్థానాలకు గానూ ఇందులో 7 స్థానాలు బీసీ, ఎస్సీ, మైనార్టీలకు కేటాయించగా.. మిగిలిన 7 స్థానాలను ఓసీలకు కేటాయించారన్నారు. 50 శాతం బీసీ, ఎస్సీ, మైనార్టీలకు సీట్లు కేటాయించారన్నారు. కౌన్సిల్ చరిత్రలో తొలిసారి నలుగురు మైనార్టీ ఎమ్మెల్సీలు ఉన్నారని తెలిపారు. ఎమ్మెల్సీ అభ్యర్థుల వివరాలు.. ►వరుదు కళ్యాణి (విశాఖపట్నం) ►ఇందుకూరు రఘురాజు (విజయనగరం) ►వంశీకృష్ణ యాదవ్ (విశాఖపట్నం) ►అనంత ఉదయ్‌భాస్కర్ (తూర్పుగోదావరి) ►మొండితోక అరుణ్‌కుమార్ (కృష్ణా) ►తలశిల రఘురాం (కృష్ణా) ►ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు (గుంటూరు) ►తూమాటి మాధవరావు (ప్రకాశం) ►మూరుగుడు హన్మంతరావు (గుంటూరు) ►కృష్ణ రాఘవ జయేంద్ర భరత్ (చిత్తూరు) ►వై.శివరామిరెడ్డి (అనంతపురం) -
AP: ముగ్గురు ఎమ్మెల్సీల ఖరారు
సాక్షి, అమరావతి: మూడు ఎమ్మెల్సీ పదవులకు అభ్యర్థులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఖరారు చేశారని వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి వెల్లడించారు. ఖాళీ అయిన మొత్తం 14 ఎమ్మెల్సీ స్థానాలలో మిగిలిన 11 ఎమ్మెల్సీ స్థానాలకు రెండు, మూడు రోజుల్లోనే అభ్యర్థులను సీఎం ఖరారు చేస్తారని చెప్పారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో బుధవారం ఆయన మాట్లాడుతూ.. ఎమ్మెల్యేల కోటాలో మూడు ఎమ్మెల్సీ స్థానాలకు శ్రీకాకుళం డీసీసీబీ మాజీ చైర్మన్ పాలవలస విక్రాంత్, కర్నూలు జిల్లా నంద్యాల మార్కెట్ కమిటీ చైర్మన్ ఇసాక్ బాషా, వైఎస్సార్ జిల్లా బద్వేలు మాజీ ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డిలను సీఎం జగన్ ఎంపిక చేశారన్నారు. మిగిలిన అభ్యర్థుల పేర్లను రెండు, మూడు రోజుల్లో ప్రకటిస్తామన్నారు. సామాజిక న్యాయాన్ని సీఎం వైఎస్ జగన్ మాటల్లో కాకుండా చేతల్లో చూపుతున్నారని స్పష్టం చేశారు. ప్రసుత్తం శాసనమండలిలో వైఎస్సార్సీపీ తరఫున ఉన్న 18 మంది ఎమ్మెల్సీల్లో 11 మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన వారేనని తెలిపారు. ఎమ్మెల్యేల కోటాలో ఎన్నికలు జరగుతున్న 3 ఎమ్మెల్సీ స్థానాల్లో ఒక సీటును బీసీ (తూర్పు కాపు)కి, మరో సీటు మైనార్టీకి కేటాయించారని వివరించారు. మీడియాతో మాట్లాడుతున్న వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి పాలవలస కుటుంబంలో మూడో తరం నేత ఎమ్మెల్యే కోటాలో వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎంపికైన పాలవసల విక్రాంత్.. పాలవలస కుటుంబం నుంచి రాజకీయాల్లోకి వచ్చిన మూడో తరం నాయకుడు. ఈయన తాత పాలవలస సంఘం నాయుడు, నాయనమ్మ రుక్ముణమ్మ ఉణుకూరు ఎమ్మెల్యేలుగా సేవలందించారు. తండ్రి రాజశేఖరం ఎమ్మెల్యేగా, రాజ్యసభ సభ్యుడిగా, జెడ్పీ చైర్మన్‌గా సేవలందించారు. విక్రాంత్ డీసీసీబీ చైర్మన్‌గా పనిచేశారు. పేరు: పాలవలస విక్రాంత్ పుట్టిన తేదీ: 23–12–1971 చదువు: బీఈ తండ్రి: పాలవలస రాజశేఖరం, మాజీ ఎమ్మెల్యే, మాజీ ఎంపీ, మాజీ జెడ్పీ చైర్మన్ తల్లి: ఇందుమతి, రేగిడి జెడ్పీటీసీ భార్య: గౌరీ పార్వతి, పాలకొండ జెడ్పీటీసీ పిల్లలు: సాయి గణేష్, మణికంఠ కార్తికేయ పదవులు: వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి, డీసీసీబీ మాజీ చైర్మన్ రవాణా శాఖ అధికారిగా సేవలందించి.. ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ వైఎస్సార్సీపీ అభ్యర్థిగా ఎంపికైన దేవసాని చిన్న గోవిందరెడ్డి 1988లో గ్రూపు–1లో ఎంపికై రీజినల్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్‌గా పనిచేశారు. డిప్యూటీ కమిషనర్ ట్రాన్స్‌పోర్ట్‌గా పదోన్నతి పొంది 2001లో రాజీనామా చేసి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రోద్బలంతో రాజకీయాల్లోకి ప్రవేశించారు. 2004లో బద్వేలు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరఫున ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. వైఎస్సార్ మరణానంతరం ఆయన కుమారుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి నెలకొల్పిన వైఎస్సార్సీపీలో చేరారు. ఆ పార్టీ తరఫున 2014లో జయరాములు, 2019లో డాక్టర్ వెంకట సుబ్బయ్యలను ఎమ్మెల్యేలుగా గెలిపించారు. వెంకటసుబ్బయ్య హఠాన్మరణంతో జరిగిన ఉప ఎన్నికల్లో ఆయన భార్య డాక్టర్ సుధను 90వేలకు పైగా మెజారిటీతో గెలిపించడంలో కీలకపాత్ర పోషించారు. ఆయన పార్టీకి చేసిన సేవలను గుర్తించిన వైఎస్ జగన్మోహన్రెడ్డి 2015లో ఎమ్మెల్సీగా అవకాశం కల్పించారు. ఆ పదవీ కాలం 2021 మే నెలలో ముగిసింది. పేరు: దేవసాని చిన్న గోవిందరెడ్డి పుట్టినతేదీ: 23.02.1956 విద్యార్హత: ఎంటెక్, ఐఐటీ మద్రాస్ భార్య పేరు: తులసమ్మ కుమారులు: గోపీనాథ్‌రెడ్డి, ఆదిత్యానాథ్‌రెడ్డి కుమార్తె: డాక్టర్ సుష్మ, అల్లుడు రమేష్‌రెడ్డి, ఐపీఎస్ అధికారి మైనార్టీ నేతగా.. కర్నూలు జిల్లా నంద్యాలకు చెందిన ఇసాక్‌బాషా మైనార్టీ వర్గ నేతగా రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషిస్తున్నారు. 2018లో వైఎస్సార్సీపీ నంద్యాల పట్టణ శాఖ అధ్యక్షుడిగా పని చేసిన ఆయన ప్రస్తుతం వైఎస్సార్సీపీ మైనార్టీ విభాగం రాష్ట్ర కార్యదర్శిగా, నంద్యాల మార్కెట్ కమిటీ చైర్మన్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. పేరు: ఇసాక్‌బాషా పుట్టిన తేదీ: 4–6–1962 చదువు: బీకాం తల్లిదండ్రులు: జాఫర్ హుస్సేన్, జహ్నాబీ భార్య: రహ్మద్ బీ (గృహిణి) పిల్లలు: ఫిరోజ్ బాషా, హర్షద్ పదవులు: గతంలో వైఎస్సార్సీపీ నంద్యాల పట్టణ అధ్యక్షుడిగా పనిచేశారు. ప్రస్తుతం వైఎస్సార్సీపీ మైనార్టీ విభాగం రాష్ట్ర కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. అలాగే నంద్యాల మార్కెట్ యార్డ్ చైర్మన్‌గా పనిచేస్తున్నారు. -
ఎమ్మెల్సీల్లో సీఎం వైఎస్ జగన్ సామాజిక న్యాయం
సాక్షి, అమరావతి: సామాజిక న్యాయంలో పలు విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్న ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ తాజా నామినేటెడ్ ఎమ్మెల్సీల్లోనూ తన వినూత్నతను చాటుకున్నారు. సహజంగా ఇలాంటి ఎన్నికల్లో లాబీయింగ్, ఆర్థికస్థోమత, రాజకీయ ప్రాబల్యం లాంటి అంశాలు తీవ్ర ప్రభావాన్ని చూపుతాయి. కాని, వీటన్నింటినీ వైఎస్ జగన్ పూర్తిగా పక్కనపెట్టారు. సమాజంలో దిగువనున్న కులాలకు మరోసారి ప్రాధాన్యత కల్పించారు. గవర్నర్ నామినేటెడ్ ఎమ్మెల్సీల్లో తన బీసీ యాదవ కులానికి సీఎం సముచిత ప్రాధాన్యం కల్పించడంద్వారా తన సొంత జిల్లా కడపలో సామాజిక న్యాయానికి వైఎస్ జగన్ పెద్దపీట వేశారు. సీఎం నిర్ణయం వల్ల కడపజిల్లాలో ఆరున్నర దశాబ్దాల తర్వాత ఎమ్మెల్సీగా బీసీ యాదవ కులానికి చెందిన వ్యక్తి రమేష్‌యాదవ్ గవర్నర్‌కోటాలో నామినేట్ అయ్యారు. రమేష్‌యాదవ్‌కు విద్యావేత్తగా పేరుంది. సామాజిక సేవా కార్యక్రమాల్లో ఆయన చురుగ్గా పాల్గొన్నారు. 1958లో ఏపీలో శాసనమండలి ఏర్పాటైంది. అప్పటినుంచి కడప జిల్లానుంచి 30 మంది ఎమ్మెల్సీలగా ఎన్నికయ్యారు. వైఎస్ జగన్ నిర్ణయం కారణంగా తొలిసారిగా యాదవులకు ఎమ్మెల్సీగా స్థానం లభించింది. గవర్నర్ కోటా కింద నాలుగు ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అయితే... ప్రభుత్వం పంపిన నాలుగు పేర్లకు గవర్నర్ ఈనెల 10వ తేదీన ఆమోదం తెలిపారు. ఈ నాలుగు సీట్లలో 2 ఎస్సీ, బీసీలకు వైఎస్ జగన్ కేటాయించారు. ఒక సీటును పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన ఎస్సీకులానికి చెందిన మోషేన్‌రాజుకు ఇవ్వగా, కడపజిల్లాకు చెందిన రమేష్ యాదవ్‌కు రెండో సీటు ఇచ్చారు. మిగిలిన రెండింటిలో తూర్పుగోదావరిజిల్లాకు చెందిన తోట త్రిమూర్తులకు, గుంటూరుకు చెందిన లేళ్ల అప్పిరెడ్డిలను నామినేట్‌చేశారు. 2019లో అధికారంలోకి వచ్చాక ఎమ్మెల్యేల కోటాకు గానూ 5 స్థానాల్లో పూర్తి కాలానికి, మరో 4 స్థానాల్లో ఎమ్మెల్సీ ఉప ఎన్నికలు జరిగాయి. గవర్నర్ నామినేటెడ్ కోటాలో 2 స్థానాలకు గత ఏడాది ఆగస్టులో ఎన్నికలు జరిగాయి. తాజా 4 ఎమ్మెల్సీలను గవర్నర్ నామినేట్ చేశారు. అంటే మొత్తంగా 15 ఎమ్మెల్సీలకు నామినేటెడ్, ఎమ్మెల్యే కోటాల కింద ఎన్నికల లెక్కన భర్తీచేస్తే ఇందులో 4 ఎస్సీలకు, 4 బీసీలకు, 3 మైనార్టీలకు ఇచ్చారు. 2018 తర్వాత భర్తీచేసి ఎమ్మెల్సీలో 12 ఎస్సీ, బీసీ, మైనార్టీలకే దక్కాయి. 3 ఓసీలకు ఇచ్చారు. సామాజిక న్యాయానికి, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు వైయస్.జగన్ ఇస్తున్న సముచిత ప్రాధాన్యతం ఇందులో స్పష్టంగా కనిపిస్తోంది. అధికారంలోకి రాకముందు బీసీకి చెందిన జంగాకృష్ణమూర్తికి ఎమ్మెల్సీగా అవకాశంకల్పించింది. 2019లో వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన వివిధ ఎమ్మెల్సీ స్థానాల్లో పార్టీ తరఫున ఎన్నికైన, నామినేట్ అయిన సభ్యులు: పండువుల రవీంద్ర బాబు (ఎస్సీ) బల్లికళ్యాణ చక్రవర్తి (ఎస్సీ) డొక్కా మాణిక్య వరప్రసాద్ ( ఎస్సీ) కొయ్య మోషేన్‌రాజు (ఎస్సీ) మోపిదేవి వెంకట రమణ (బీసీ) ( తర్వాత ఈయన రాజ్యసభకు ఎన్నికయ్యారు. మిగిలిన కాలానికి ఈయన స్థానంలో పీవీవీ సూర్యనారాయణ రాజుకు పార్టీ అవకాశం కల్పించింది) దువ్వాడ శ్రీనివాస్ ( బీసీ) పోతుల సునీత (బీసీ) రమేష్‌యాదవ్ (బీసీ) సి.రామచంద్రయ్య ( బీసీ) జకియా ఖానుం ( మైనార్టీ) మహ్మద్ ఇక్బాల్ (మైనార్టీ) మహ్మద్ కరీమున్నీసా ( మైనార్టీ) చల్లా భగీరథరెడ్డి ( ఓసీ) లేళ్ల అప్పిరెడ్డి (ఓసీ) తోట త్రిమూర్తులు (ఓసీ) -
ముఖ్యమంత్రి జగన్‌కు రుణపడి ఉంటాం
కాకినాడ రూరల్/రాయచోటి: గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా తమ పేర్లను నామినేట్ చేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి తాము రుణపడి ఉంటామని అమలాపురం మాజీ ఎంపీ డాక్టర్ పండుల రవీంద్రబాబు, మైనార్టీ మహిళా నేత ఎం.జకియా ఖానమ్‌లు పేర్కొన్నారు. మంగళవారం వారు వేర్వేరుగా మీడియాతో మాట్లాడుతూ సీఎం వైఎస్ జగన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. èఅధికారంలోకి రాగానే నేతలు తమ హామీలను మరిచిపోతుంటారు కానీ, సీఎం వైఎస్ జగన్ తనను ఎమ్మెల్సీగా నామినేట్ చేసి ఎన్నికల ప్రచారమప్పుడు తనకిచ్చిన హామీని నెరవేర్చడం సంతోషం కలిగించిందని రవీంద్రబాబు పేర్కొన్నారు. దళిత, గిరిజన, బలహీన వర్గాలకు ఒక అన్నగా నిలబడి ముందుకు తీసుకువెళుతున్న వైఎస్ జగన్ వెంటే తానెన్నటికీ నడుస్తానన్నారు. ► ముస్లిం మైనారిటీ మహిళగా ఉన్న తనకు గురుతర బాధ్యతగా అప్పగిస్తున్న పదవిని మహిళా సమస్యల పరిష్కారానికి ఉపయోగిస్తానని, చట్ట సభలో ముస్లిం మైనార్టీ మహిళల తరఫున తన వాణిని వినిపిస్తానని జకియా ఖానమ్ చెప్పారు. తమ ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి వెంట నడుస్తూ రాయచోటి నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. -
గవర్నర్ కోటా ఎమ్మెల్సీ స్థానాలకు ఇద్దరి పేర్ల సిఫారసు
సాక్షి, అమరావతి: గవర్నర్ నామినేటెడ్ కోటాలో ఖాళీగా ఉన్న రెండు ఎమ్మెల్సీ స్థానాలకు ఇద్దరి పేర్లను రాష్ట్ర ప్రభుత్వం సిఫారసు చేసింది. తూర్పు గోదావరి జిల్లా అమలాపురం మాజీ ఎంపీ పండుల రవీంద్రబాబు, వైఎస్సార్ జిల్లా రాయచోటికి చెందిన జకియా ఖానమ్ పేర్లను ఖరారు చేయగా.. అవే పేర్లను రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్‌కు సమర్పించింది. పండుల రవీంద్రబాబు ఎస్సీ వర్గానికి చెందిన వారు కాగా, జకియా ఖానమ్ ముస్లిం మైనారిటీ మహిళా నేత కావడం విశేషం. -
నేడు ఎమ్మెల్సీగా ‘కర్నె’ ప్రమాణ స్వీకారం
సంస్థాన్ నారాయణపురం :టీఆర్ఎస్ పొలిట్‌బ్యూరో సభ్యుడు కర్నె ప్రభాకర్ ఎమ్మెల్సీగా రాజ్‌భవన్‌లో గురువారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కర్నె ప్రభాకర్‌ను గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా నామినేట్ చేస్తున్నట్లు సీఎం కె.చంద్రశేఖర్‌రావు గత నెలలో జరిగిన కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. కర్నె ప్రభాకర్ సొంతూరు సంస్థాన్ నారాయణపురం. ప్రభాకర్ తల్లిదండ్రులు జంగప్ప, శివలీల. వీరిది మధ్య తరగతి కుటుంబం. వీరికి ఐదుగురు సంతానం. వీరిలో చిన్న కుమారుడు కర్నె ప్రభాకర్. ఈయన పదో తరగతి వరకు స్వగ్రామంలోనే చదువుకున్నారు. భువనగిరిలోని ప్రభుత్వ జూని యర్ కళాశాలలో ఇంటర్, ఎస్ఎల్ఎన్ ఎస్ కళాశాలలో డిగ్రీ పూర్తి చేశారు. అనంతరం జర్నలిజం కూడా చేశారు. సంస్థాన్‌నారాయణపురానికి చెందిన స్వాతిని వివాహమాడారు. ఈయనకు ముగ్గురు పిల్లలు. వీరిలో కూతుళ్లిద్దరూ కవలలు ఇందుశ్రీ, సింధుశ్రీ, కుమారుడు రవిచరణ్. కర్నె.. రాజకీయాల్లోకి రాకముందు పలుచోట్ల సూపర్వైజ ర్గా పనిచేశారు. టీఆర్ఎస్ పార్టీ ఆవి ర్భావంతో ఆ పార్టీలో చేరారు. యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశారు. ప్రస్తుతం పొలిట్ బ్యూరో సభ్యుడిగా, పార్టీ కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్‌గా పనిచేస్తున్నారు. 2004లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో మునుగోడు నియోజకవర్గం నుంచి టీఆర్ఎస్ తరఫున పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన కర్నెకు తగిన న్యాయం చేస్తానని కేసీఆర్ ముందునుంచీ చెబుతూ వస్తున్నారు. అం దులో భాగంగా గవర్నర్ కోటాలో భర్తీ చేసే మూడో ఎమ్మెల్సీని కర్నె ప్రభాకర్‌కు కట్టబెడుతున్నట్టు స్వయంగా కేసీఆరే ప్రకటించారు. ఇదిలా ఉండగా ప్రమాణస్వీకారోత్సవానికి సంస్థాన్ నారాయణపురం నుంచి పెద్ద ఎత్తున కార్యకర్తలు తరలనున్నారు. ‘సంస్థాన్’కు దక్కిన ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ పదవులు మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గం ఏర్పడిన ఇన్నేళ్లలో మొట్టమొదటి సారి సంస్థాన్‌నారాయణపురం మండలానికి ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ పదవులు దక్కాయి. 2014లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో మునుగోడు ఎమ్మెల్యేగా మండలంలోని సర్వేల్ గ్రామపంచాయతీ పరిధిలోని లింగవారిగూడానికి చెందిన కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి టీఆర్ఎస్ పార్టీ తరఫున గెలిచారు. అలాగే సంస్థాన్‌నారాయణపురానికి చెందిన టీఆర్ఎస్ పొలిట్‌బ్యూరో సభ్యుడు కర్నె ప్రభాకర్‌ను గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా ప్రభుత్వం నామినేట్ చేసింది. మండలా చెందిన ఇద్దరు వ్యక్తులు ఉన్నత స్థానాలలో ఉండటంతో సంస్థాన్ నారాయణపురం అన్ని రంగాలలో అభివృద్ధి చెందుతుందని ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.