
కాకినాడ రూరల్/రాయచోటి: గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా తమ పేర్లను నామినేట్ చేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి తాము రుణపడి ఉంటామని అమలాపురం మాజీ ఎంపీ డాక్టర్ పండుల రవీంద్రబాబు, మైనార్టీ మహిళా నేత ఎం.జకియా ఖానమ్‌లు పేర్కొన్నారు. మంగళవారం వారు వేర్వేరుగా మీడియాతో మాట్లాడుతూ సీఎం వైఎస్ జగన్‌కు కృతజ్ఞతలు తెలిపారు.
èఅధికారంలోకి రాగానే నేతలు తమ హామీలను మరిచిపోతుంటారు కానీ, సీఎం వైఎస్ జగన్ తనను ఎమ్మెల్సీగా నామినేట్ చేసి ఎన్నికల ప్రచారమప్పుడు తనకిచ్చిన హామీని నెరవేర్చడం సంతోషం కలిగించిందని రవీంద్రబాబు పేర్కొన్నారు. దళిత, గిరిజన, బలహీన వర్గాలకు ఒక అన్నగా నిలబడి ముందుకు తీసుకువెళుతున్న వైఎస్ జగన్ వెంటే తానెన్నటికీ నడుస్తానన్నారు.
► ముస్లిం మైనారిటీ మహిళగా ఉన్న తనకు గురుతర బాధ్యతగా అప్పగిస్తున్న పదవిని మహిళా సమస్యల పరిష్కారానికి ఉపయోగిస్తానని, చట్ట సభలో ముస్లిం మైనార్టీ మహిళల తరఫున తన వాణిని వినిపిస్తానని జకియా ఖానమ్ చెప్పారు. తమ ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి వెంట నడుస్తూ రాయచోటి నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానన్నారు.