Pandula Ravindra Babu
-
‘రాజమండ్రిలో పవన్ కల్యాణ్ ప్రవర్తన చూసి సభ్య సమాజం సిగ్గుతో తలదించుకుంది’
సాక్షి, తూర్పు గోదావరి: రాజమండ్రిలో పవన్ కల్యాణ్ ప్రవర్తన చూసి సభ్య సమాజం సిగ్గుతో తలదించుకుందని వైఎస్సార్సీపీ నేత పండుల రవీంద్రబాబు ధ్వజమెత్తారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కులాల పై మాట్లాడే వారిని సభ్య సమాజంలో తిరగనీయకూడదన్నారు. దళితులపై ఆశలు మానుకోండని, కులాలపై రాజకీయాలు చేయడం ఆపండంటూ ఫైర్ అయ్యారు. ముఖ్యమంత్రి జగన్మమోహన్‌రెడ్డిని దళితులు నమ్మారు. అందుకే ఆయన వారికి పెద్ద పీఠ వేశారని తెలిపారు. రాష్ట్రంలో రోడ్డు సమస్యే మీకు కనిపించిందా? అంతకు ముందు రెండు సార్లు వచ్చిన కోవిడ్ సమస్య కనిపించలేదా? రోడ్ల గురించి ఇంతగా తపించిపోతున్న నువ్వు కోవిడ్‌తో చనిపోయినా ఏ ఒక్క కుటుంబాన్నైనా కనీసం పరామర్శించావా? అంటూ ప్రశ్నించారు. తల.. గెడ్డం పెంచుకోవడం వల్ల కార్ల్ మార్క్ అవ్వరని పవన్‌పై ఆయన వ్యంగ్యాస్త్రాలు సంధించారు. చదవండి: పవన్‌కు చిత్తశుద్ధి ఉంటే ఒంటరిగా పోటీ చేయాలి: బాలినేని -
పరీక్షలంటే లోకేశ్ కు అర్థం తెలుసా : పండుల రవీంద్రబాబు
-
‘లోకేశ్.. మీరు పరీక్షలు కరెక్టుగా రాసి పాసయ్యారా?’
సాక్షి, కాకినాడ(తూర్పు గోదావరి): పరీక్షలు రద్దయ్యాయని ఆనంద పడటం తప్ప టీడీపీ నేత లోకేశ్‌కు మరొకటి తెలియదని ఎమ్మెల్సీ పండుల రవీంద్రబాబు విమర్శించారు. పెద్ద పెద్ద పదజాలలు వాడి పరీక్షలకే మీరు పరీక్ష కాకండి అంటూ ఎద్దేవా చేశారు. కోవిడ్ వంకతో విద్యార్థుల పరీక్షలపై రాజకీయాలు మాట్లాడటం లోకేశ్‌కు తగదని హితవు పలికారు. శుక్రవారం పండుల రవీంద్ర బాబు మాట్లాడుతూ.. ‘‘పరీక్షలంటే లోకేశ్‌కు అర్థం తెలుసా? మీరు పరీక్షలు కరెక్టుగా రాసి పాసయ్యారా? చదువుకున్న వారికే పరీక్షల నిర్వహణ వెనుక అర్థం తెలుస్తుంది. పరీక్షలు రద్దయ్యాయని సంతోషించడం తప్ప ఇంకేమైనా తెలుసా మీకు. కరోనా పేరిట పరీక్షల గురించి రాజకీయాలు చేయడం సరికాదు. పరీక్షల నిర్వహణ అనేది విద్యార్ధుల చదువుకు ఒక అర్థాన్నిస్తుంది. చదువుకున్న విద్యార్ధులకు పరీక్షలంటే ఒక కిక్కు. ఒక బాధ్యత గల ముఖ్యమంత్రిగా, చదువుకున్న వ్యక్తిగా.. పరీక్షలు నిర్వహించాలన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆలోచన గొప్పది. కానీ కోవిడ్ వల్ల పరీక్షలు రద్దు చేయాల్సిరావడం చాలా దురదృష్టకరం’’ అని పేర్కొన్నారు. కాగా సుప్రీంకోర్టు నిర్దేశించిన జూలై 31 లోగా టెన్త్, ఇంటర్ పరీక్షల నిర్వహణ, ఫలితాల వెల్లడి సాధ్యం కాదని, అందుకని పరీక్షలను రద్దుచేస్తున్నామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ ప్రకటించిన విషయం తెలిసిందే. చదవండి: ఏపీ ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రశంసించిన సుప్రీంకోర్టు ఏపీలో టెన్త్, ఇంటర్ పరీక్షలు రద్దు -
‘బాబు దుర్మార్గం.. టీడీపీ నేతలే నిజాలు కక్కారు’
-
‘బాబు దుర్మార్గం.. టీడీపీ నేతలే నిజాలు కక్కారు’
సాక్షి, తాడేపల్లి: ప్రశాంతంగా ఉన్న విజయవాడలో ప్రతిపక్ష నేత చంద్రబాబు.. అశాంతి సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఆదివారం మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్రానికి పట్టిన చీడపురుగుగా ఆయన చంద్రబాబును అభివర్ణించారు. దొంగల ముఠా అంతా ఏకమై ఇప్పుడు నీతిసూత్రాలు చెబుతున్నారని దుయ్యబట్టారు. చంద్రబాబు దుర్మార్గం గురించి ఆ పార్టీ నేతలే నిజాలు కక్కారని.. బోండా ఉమ, బుద్దా వెంకన్న, నాగుల్ మీరా ఆరోపణలకు సమాధానం చెప్పాలని మంత్రి డిమాండ్ చేశారు. చంద్రబాబు ఎన్ని ప్రలోభాలు పెట్టినా ఉపయోగం లేదని.. ప్రాంతానికో మాట మాట్లాడుతున్న ఆయనను ప్రజలు నమ్మరన్నారు. ‘‘దుర్గ గుడి ఫ్లైఓవర్ నిర్మించలేకపోయిన అసమర్థుడు చంద్రబాబు. అధికారంలో ఉండగా పన్నులు పెంచి.. ఇప్పడు తగ్గిస్తానంటే ప్రజలు నమ్మరు. ఒక ఎంపీని కంట్రోల్ చేయలేని చంద్రబాబు ఒక నాయకుడా?. ఏపీలో టీడీపీ జమానా ముగిసింది. పగటికలలతో సరిపెట్టుకోక తప్పదు. ఫ్యాన్ హవా ముందు పంచర్ అయిన సైకిల్ నిలువలేదని’’ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ విమర్శలు గుప్పించారు. జగన్ పాలనలో సంక్షేమం: ఎమ్మెల్యే మేరుగ విశాఖ: చంద్రబాబు పాలనలో దళితులపై దాడులు చూశామని.. వైఎస్ జగన్ పాలనలో సంక్షేమ పథకాలు చూస్తున్నామని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే మేరుగ నాగార్జున అన్నారు. కులం, మతం, పార్టీలకతీతంగా సంక్షేమ పథకాలు అందుతున్నాయని.. ఇచ్చిన హామీలతో పాటు ఇవ్వని హామీలను సీఎం అమలు చేస్తున్నారన్నారు. విశాఖ ప్రజలు చంద్రబాబును నమ్మే పరిస్థితి లేదన్నారు. స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్రధానికి సీఎం లేఖ రాశారని పేర్కొన్నారు. పంచాయతీ ఎన్నికల్లో 82 శాతం ప్రజలు సీఎం జగన్‌కు పట్టం కట్టారని.. ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల్లోనూ అదే రిపీట్ అవుతుందని మేరుగ నాగార్జున ధీమా వ్యక్తం చేస్తున్నారు. పచ్చని పంట పొలాలను నాశనం చేశారు: పండుల రవీంద్రబాబు విశాఖకు పరిపాలన రాజధాని కావాల్సిన అన్ని హంగులు ఉన్నాయని రవీంద్రబాబు అన్నారు. చంద్రబాబు తన సామాజిక వర్గం కోసం అమరావతిని రాజధానిగా ప్రకటించారన్నారు. పచ్చని పంట పొలాలను చంద్రబాబు నాశనం చేశారని ఆయన ధ్వజమెత్తారు. చదవండి: 'రాసలీలలు చేసే లోకేష్‌కు విమర్శించే హక్కు లేదు' ఇక టీడీపీ చాప్టర్ క్లోజ్: విజయసాయిరెడ్డి -
‘సీఎం జగన్ వ్యక్తిత్వానికి ఇది పెద్ద విజయం’
సాక్షి, తూర్పు గోదావరి: అధికార వికేంద్రీకరణ బిల్లుకు గవర్నర్ ఆమోదం తెలిపడం శుభ సూచికమని ఎమ్మెల్సీ పండుల రవీంద్ర బాబు అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర పునర్విభజన చట్టం సమయంలో ఏపీలో అధికార వికేంద్రీకరణ జరగాలని శివరామకృష్ణన్ కమిటీ సూచించింది. దాన్ని చంద్రబాబు పక్కన పడేసి.. పాఠశాలలను ఎలా నడపాలో తెలియని నారాయణను రాజధాని కమిటీ ఛైర్మన్‌గా పెట్టారన్నారు. నారాయణ ద్వారా రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసేందుకు గుంటూరు-విజయవాడ మధ్య అమరావతిని రాజధానిగా పెట్టారని తెలిపారు. అమరావతి ప్రాంతంలో భూములు తవ్వుతుంటే నల్లటి సారవంతైన మట్టిని చూశానని, అటువంటి మట్టిని చూస్తే భూదేవిని చూసినట్లుగా రైతు పులకించిపోతాడని పేర్కొన్నారు. అలాంటి భూదేవి గర్భాన్ని తవ్వి రాజధాని నిర్మిస్తే చంద్రబాబుకు శాపం తగులుతుందని తనతో చాలా మంది చెప్పారని ఆయన అన్నారు. రాజధాని భవనాల పేరుతో చంద్రబాబు గ్రాఫిక్స్ తయారు చేసి దాన్ని సినిమా దర్శకుడితో అప్రూవ్ చేయించారని పేర్కొన్నారు. అందుకే ప్రజలు చంద్రబాబుకు తగిన తీర్పు ఇచ్చారని అన్నారు. వైఎస్ జగన్ ముఖ్యమంత్రి కాగానే అధికార వికేంద్రీకరణపై చారిత్మక నిర్ణయం తీసుకున్నారని, అధికార వికేంద్రీకరణ బిల్లును అడ్డుకోవడం కోసం చంద్రబాబు ఒక డ్రామా కంపెనీనే నడిపారని విమర్శించారు. న్యాయానికి ఎప్పుడు మంచే జరుగుతుందని, సీఎం వైఎస్ జగన్ వెనుక దేవుడు ఉన్నాడన్నారు. మంచికి ఎప్పుడు దేవుడు సాయంగా ఉంటాడని చెప్పడానికి మూడు రాజధానుల బిల్లుకు గవర్నర్ ఆమోదమే ఒక ఉదాహరణ అన్నారు. సీఎం జగన్ వ్యక్తిగతానికి ఇది ఒక పెద్ద విజయమని ఆయన వ్యాఖ్యానించారు. -
గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా జకియా ఖానమ్, రవీంద్రబాబు
సాక్షి, అమరావతి/రాయచోటి: రాష్ట్ర గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా ఎం.జకియా ఖానమ్, పండుల రవీంద్రబాబు నియమితులయ్యారు. వారిద్దరినీ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ఎమ్మెల్సీలుగా నామినేట్ చేశారు. ఈ మేరకు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కె.విజయానంద్ మంగళవారం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. కాగా, ఎం.జకియా ఖానమ్ వైఎస్సార్ జిల్లా రాయచోటికి చెందిన ముస్లిం మైనారిటీ మహిళ. డాక్టర్ పండుల రవీంద్రబాబు తూర్పుగోదావరి జిల్లా అమలాపురం మాజీ ఎంపీ. ఎస్సీ వర్గానికి చెందిన వారు. ఖాళీగా ఉన్న ఈ రెండు స్థానాలకు మైనారిటీ, బలహీన వర్గాల నుంచి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం ఎంపిక చేయటంపై సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది. వీరిద్దరి పేర్లను సిఫార్సు చేస్తూ ఇటీవల గవర్నర్‌కు పంపిన విషయం తెలిసిందే. సీఎం ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తా సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆశయాలకు అనుగుణంగా, పార్టీ అభివృద్ధికి పాటుపడతానని ఎమ్మెల్సీ మయాన జకియా ఖానమ్ తెలిపారు. గవర్నర్ నుంచి అధికారిక ప్రకటన రావడంతో జకియా ఖానమ్ స్పందించారు. వైఎస్సార్ కుటుంబానికి తన భర్త సన్నిహితంగా ఉండి పార్టీ కోసం పని చేశారన్నారు. నియోజకవర్గ అభివృద్ధికి సహకారాలను అందిస్తానన్నారు. తనకు ఈ అవకాశం కల్పించిన సీఎం వైఎస్ జగన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి, ఎంపీ మిథున్‌రెడ్డిలకు ధన్యవాదాలు తెలిపారు. ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం చూసి ఆశ్చర్యపోయా : ఎమ్మెల్సీ రవీంద్రబాబు ► రాజకీయాల్లోకి రాగానే అనేక మంది హామీలు ఇస్తారు.. కానీ అధికారంలోకి రాగానే అన్నీ మరిచిపోతారు. సీఎం వైఎస్ జగన్ మాత్రం ఇచ్చిన అన్ని హామీలను అమలు చేసి గ్రేట్ అనిపించుకున్నారు. ► నాకిచ్చిన మాటను నిలబెట్టుకుంటూ ఎమ్మెల్సీని చేయడం నన్ను ఆశ్చర్యానికి గురిచేసింది. రాజకీయాల్లో ఇచ్చిన మాటను ఈ విధంగా నిలబెట్టుకుంటారా? ఇది నిజమా అని నేను, నా కుటుంబం, స్నేహితులు షాకయ్యాం. ► దళిత, గిరిజన, బలహీన వర్గాలకు ఒక అన్నగా నిలబడి సీఎం రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళుతున్నారు. ► గత పదేళ్లు మేము అనాథలుగా ఉన్నాం. వైఎస్ జగన్ వచ్చాక దళిత, గిరిజన, బలహీన వర్గాలకు ఒక దిక్కు దొరికింది. ► పేద ప్రజలకు ఆయన ఎంతో అవసరం. జీవితాంతం ఆయనను గెలిపించుకుని అండగా నిలబడతాం. జకియా ఖానమ్ ప్రొఫైల్ పుట్టిన తేదీ: 01–09–1973 భర్త పేరు: దివంగత మయాన అఫ్జల్ అలీఖాన్ (మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్, వైఎస్సార్సీపీ సీనియర్ నేత) పెళ్లి : 01–09–1989 తల్లిదండ్రులు: ఎం.హజీజ్ ఖానమ్, ఎం.దిలావర్ఖాన్ (రిటైర్డ్ హెచ్.ఎం) విద్యాభ్యాసం: ఇంటర్ (డిస్కంటిన్యూ) పిల్లలు: నలుగురు పండుల రవీంద్రబాబు ప్రొఫైల్ పుట్టినతేదీ: 8–11–1955 తల్లిదండ్రులు: బుల్లియ్య, అన్నపూర్ణాదేవి విద్యార్హత: ఎంబీబీఎస్, ఐఆర్ఎస్ భార్య: సునీత ఉద్యోగం: ఊ వైద్యుడిగా ఢిల్లీలో సేవలు ► ఇండియన్ రెవెన్యూ సర్వీస్‌కు ఎంపికై ముంబై, కోల్‌కతా, విశాఖపట్నం వంటి ప్రాంతాల్లో సెంట్రల్ ఎక్సైజ్ అండ్ కస్టమ్స్ కమిషనర్‌గా పనిచేశారు. రాజకీయ రంగ ప్రవేశం: 2014లో టీడీపీ నుంచి అమలాపురం ఎంపీగా గెలుపొందారు. ► 2019 మార్చిలో వైఎస్సార్సీపీలో చేరిక -
గవర్నర్ కోటా ఎమ్మెల్సీల నామినేట్.. ఉత్తర్వులు
సాక్షి, అమరావతి: గవర్నర్ కోటాలో ఖాళీగా ఉన్న రెండు ఎమ్మెల్సీ స్థానాలను భర్తీ చేశారు. ప్రభుత్వ సిఫారసుల మేరకు జకియాఖానం, పండుల రవీంద్రబాబులను ఎమ్మెల్సీలుగా గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ నామినేట్ చేశారు. ఈ మేరకు మంగళవారం అధికారిక ఉత్తర్వులు వెలువరించారు. ►ఎమ్మెల్సీగా నామినేట్ అయిన పండుల రవీంద్రబాబు స్పందిస్తూ.. ‘2011లో వైఎస్సార్సీపీని స్థాపించిన నాటి నుంచి సీఎం వైఎస్ జగన్ అంటే చాలా ఇష్టం. నేను జగన్ వీరాభిమానిని. 2014లో వైఎస్సార్సీపీ నుంచి పోటీ చేయాలని ప్రయత్నించి విఫలమయ్యాను. మొట్టమొదట సారిగా ఇన్ని రోజులకు వైఎస్ జగన్‌తో కలిసి పనిచేసే అవకాశం నాకు లభించింది. నా అనుభవం అంతా ఉపయోగించి శాయశక్తులా పార్టీ అభివృద్దికి కృషి చేస్తాను. వైఎస్సార్సీపీ అనగానే దళిత, బలహీన, మైనార్టీల పార్టీ అని ఇవాళ మరోసారి రుజువైంది’ అని రవీంద్రబాబు పేర్కొన్నారు. ►జకియా ఖానం స్పందిస్తూ.. ‘యావత్ మైనార్టీల తరపున సీఎం జగన్‌కు ధన్యవాదాలు. మమ్మల్ని నామినేటెడ్ ఎమ్మెల్సీలుగా ఆమోదించినందుకు గవర్నర్‌కు ధన్యవాదాలు. రాష్ట్రాభివృద్ధి, ప్రజల సంక్షేమం కోసం పరితపిస్తున్న వైఎస్ జగన్ నాయకత్వంలో పనిచేయడం ఆనందంగా ఉంది. ప్రజలకు అన్నివిధాలుగా అండగా ఉంటూ పార్టీ కోసం శక్తి వంచన లేకుండా కృషిచేస్తాను' అని జకియా ఖానం తెలిపారు. -
పండుల రవీంద్రబాబుకు ఎమ్మెల్సీ
హామీ అంటేనే హాస్యాస్పదంగా మారిపోయిన రోజులివి...ఎన్నికల ముందు ఇతర పార్టీల నేతలను ఆకర్షించడానికి ఎన్నోచెబుతారు..అధికారంలోకి వస్తే అవన్నీ నీటిమీద రాతలేనంటూపెదవి విరిచేవారే అధికం. అది వారి తప్పుకాదు... గత పార్టీలన్నీ ఇచ్చిన మాటకు తిలోదకాలిస్తూ నమ్మినవారిని నట్టేట ముంచడంతోమాటపై నమ్మకం పోయింది. ఆ సమయంలో వైఎస్సార్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలు... అధికారంలోకి వచ్చిన తరువాత ఆచరణలో పెట్టిన తీరును చూసి ప్రతిపక్షాలకు కూడా ముచ్చెమటలు పడుతున్నాయి. మాటకు పట్టం కడుతున్న ఆయన తీరు పలువురి ప్రశంసలు అందుకుంటోంది. సాక్షి ప్రతినిధి, రాజమహేంద్రవరం: మాట ఇవ్వడమే కాదు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం అంటే మాటలు కాదు. అందునా ప్రస్తుత రాజకీయాల్లో మరీ కష్టం. ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాన్ని అమలు చేయడం ఆషామాషీ వ్యవహారం కానే కాదు. ఎన్నికల ముందున్న పరిస్థితులు వేరు, ఎన్నికలై అధికారంలోకి వచ్చాక పరిణామాలు అనేక మలుపులు తిరుగుతుంటాయి. రాజకీయాల్లో ఇవన్నీ సహజమనే ధోరణిలో ఇచ్చిన మాట గాలిలో కలిపేసే పార్టీలు, నాయకులే ఎక్కువగా ఉంటారు. మాట నిలుపుకోవడం ఏ రాజకీయ పార్టీలో అయినా చాలా అరుదనే చెప్పొచ్చు. ఇందుకు పూర్తి భిన్నమైన నాయకుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. నాడు ప్రతిపక్ష నాయకుడిగా, నేడు ముఖ్యమంత్రిగా ఉన్నా ఒకే మాట ఒకే బాట అని మరోసారి కార్యాచరణ ద్వారా చూపించారు. గవర్నర్ కోటాలో శాసనమండలికి భర్తీ చేయనున్న రెండు స్థానాల్లో ఒక స్థానానికి జిల్లా నుంచి ప్రాతినిధ్యం కల్పించారు. గవర్నర్‌కు సీఎం పంపించిన జాబితాలో మాజీ ఎంపీ పండుల రవీంద్రబాబుకు అవకాశం కల్పించారు. కేవలం మాట కోసం తన తండ్రి మహానేత వైఎస్ çహఠాన్మరణం తరువాత పదవులను సైతం త్యాగం చేసి విశ్వసనీయ నేతగా నిలిచిన పిల్లి సుభాష్‌చంద్ర బోస్‌ను సీఎం జగన్ ఉన్నత శిఖరాలకు తీసుకువెళ్లిన విషయం తెలిసిందే. నమ్మి వచ్చిన నాయకుడి గెలుపు, ఓటముల ప్రమేయం లేకుండా వరుసగా పదవులు కట్టబెట్టి మాట నిలబెట్టుకున్నారు. గత సార్వత్రిక ఎన్నికలలో మండపేట నుంచి పోటీచేసిన బోస్‌కు ఎమ్మెల్సీ ఇచ్చి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రితోపాటు రెవెన్యూశాఖను కూడా ఇచ్చారు. మండలి రద్దుయ్యే నేపథ్యంలో పదవులకు రాజీనామా చేసిన బోస్‌కు అత్యున్నతమైన రాజ్యసభ (పెద్దల సభ)కు పంపించారు. ఆనాటి సభలో హామీ ఇలా నెరవేర్చి ఇప్పుడు ఎమ్మెల్సీ కోటా భర్తీలో కూడా అదే ఒరవడిని కొనసాగించారు. ప్రతిపక్షనేతగా జగన్మోహన్రెడ్డి ప్రజా సమస్యలు, ప్రధానంగా దళిత, బడుగు, బలహీనవర్గాలపై ఉన్న చిత్తశుద్ధి ఆకర్షితుడై గత సార్వత్రిక ఎన్నికల ముందు అమలాపురం మాజీ ఎంపీ పండుల రవీంద్రబాబు వైఎస్సార్సీపీలో చేరారు. పార్టీని, తనను నమ్మి వచ్చి అంబాజీపేట మండల కేంద్రంలో జరిగిన ఎన్నికల సభలో వేలాదిమంది సమక్షంలో ఇచ్చిన మాటకు కట్టుబడి రవీంద్రబాబుకు మండలిలో ప్రాతినిధ్యాన్ని ఖాయం చేశారు. వైద్య వృత్తి నుంచి... దళిత సామాజికి వర్గానికి చెందిన రవీంద్రబాబు వైద్యుడిగా ఢిల్లీలో ఏడేళ్లు పనిచేశారు. అనంతరం ఐఆర్ఎస్ అధికారిగా ముంబై, కోలకతా, విశాఖపట్నం వంటి ప్రాంతాల్లో కస్ట్‌మ్స్, సెంట్రల్ ఎక్సైజ్ సర్వీసు టాక్సు కమిషనర్‌గా పనిచేసి 2014 సార్వత్రిక ఎన్నికల్లో అమలాపురం పార్లమెంటు స్థానం నుంచి గెలుపొందారు. ఆ తరువాత వైఎస్సార్సీపీలో చేరారు. రవీంద్రబాబు ఉన్నత విద్యావంతుడు కావడం, దళిత వర్గానికి చెందడం, అంబాజీపేట ఎన్నికల సభలో మాట ఇవ్వడంతో ఎమ్మెల్సీగా ఖరారు చేశారు. జిల్లా రాజకీయ చరిత్రలో తొలి సారి దళిత సామాజికవర్గానికి శాసన మండలి సభ్యత్వం ఇచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డికి దక్కింది. ఈ ఎమ్మెల్సీ ద్వారా తమ సామాజికవర్గంపై సీఎంకు ఉన్న ఆదరణను చెప్పకనే చెబుతోందని ఆ సామాజివర్గం సంతోషం వ్యక్తం చేస్తోంది. కాగా రాష్ట్రంలో మాల కార్పొరేషన్ చైర్మన్‌ను మహిళా విభాగం ప్రతినిధి పెదపాటి అమ్మాజీకి కల్పించడం ద్వారా సీఎం జిల్లాపై ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు. -
ముఖ్యమంత్రి జగన్‌కు రుణపడి ఉంటాం
కాకినాడ రూరల్/రాయచోటి: గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా తమ పేర్లను నామినేట్ చేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి తాము రుణపడి ఉంటామని అమలాపురం మాజీ ఎంపీ డాక్టర్ పండుల రవీంద్రబాబు, మైనార్టీ మహిళా నేత ఎం.జకియా ఖానమ్‌లు పేర్కొన్నారు. మంగళవారం వారు వేర్వేరుగా మీడియాతో మాట్లాడుతూ సీఎం వైఎస్ జగన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. èఅధికారంలోకి రాగానే నేతలు తమ హామీలను మరిచిపోతుంటారు కానీ, సీఎం వైఎస్ జగన్ తనను ఎమ్మెల్సీగా నామినేట్ చేసి ఎన్నికల ప్రచారమప్పుడు తనకిచ్చిన హామీని నెరవేర్చడం సంతోషం కలిగించిందని రవీంద్రబాబు పేర్కొన్నారు. దళిత, గిరిజన, బలహీన వర్గాలకు ఒక అన్నగా నిలబడి ముందుకు తీసుకువెళుతున్న వైఎస్ జగన్ వెంటే తానెన్నటికీ నడుస్తానన్నారు. ► ముస్లిం మైనారిటీ మహిళగా ఉన్న తనకు గురుతర బాధ్యతగా అప్పగిస్తున్న పదవిని మహిళా సమస్యల పరిష్కారానికి ఉపయోగిస్తానని, చట్ట సభలో ముస్లిం మైనార్టీ మహిళల తరఫున తన వాణిని వినిపిస్తానని జకియా ఖానమ్ చెప్పారు. తమ ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి వెంట నడుస్తూ రాయచోటి నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. -
సీఎం జగన్‌కు కృతజ్ఞతలు : రవీంద్రబాబు
సాక్షి, తూర్పు గోదావరి : పేద ప్రజలకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎంతో అవసరమని వైఎస్సార్సీపీ నాయకుడు పండుల రవీంద్రబాబు అన్నారు. తనను ఎమ్మెల్సీగా నామినేట్ చేసిన సీఎం వైఎస్ జగన్‌కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. సోమవారం ఆయన మాట్లాడుతూ.. ‘రాజకీయాల్లో అనేక మంది హామీలిస్తారు.. అధికారంలోకి రాగానే మర్చిపోతారు. కానీ సీఎం వైఎస్ జగన్ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను ఏడాదిలోపే అమలు చేశారు. రాజకీయాల్లో ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటారా అని సీఎం జగన్‌ను చూసి షాక్ అయ్యాం. ఏడాదిలోగా నవరత్నాలను అమలు చేసి సీఎం జగన్ గ్రేట్ అనిపించుకున్నారు. గత పదేళ్లుగా బడుగు, బలహీన వర్గాలు అనాథలుగా ఉన్నారు. వారికి సీఎం వైఎస్ జగన్ అండగా నిలబడ్డారు’ అని తెలిపారు. -
‘అతన్ని మానసిక ఆస్పత్రిలో చేర్పించండి’
సాక్షి, కాకినాడ : దళిత కులాల మధ్య చంద్రబాబు నాయుడు పెట్టిన చిచ్చు ఇప్పటికీ రగులుతూనే ఉందని అమలాపురం మాజీ ఎంపీ పండుల రవీంద్ర బాబు అన్నారు. కుల రాజకీయంలో చంద్రబాబు దిట్ట ఎద్దేవా చేశారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీ స్వార్థ రాజకీయాలకు కోసం దళిత ఉద్యోగులను బలి చేస్తోందని మండిపడ్డారు. డాక్టర్ సుధాకర్ మద్యానికి బానిసై మానసిక రోగంతో బాధపడుతున్నాడని, అందుకే రహదారులపై బట్టలు విప్పుకుని పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారని ఆరోపించారు. (చదవండి : అనస్థీషియా వైద్యుడి వీరంగం) అటువంటి వ్యక్తి రహదారిపై తిరుగుతూ తన ప్రాణాలకు ముప్పు తెచ్చుకోవడం కాకుండా ప్రజలకు కూడా ఇబ్బంది కలిగిస్తున్న నేపథ్యంలో భద్రత కోసం పోలీసులు పట్టుకొని అదుపులోకి తీసుకున్నారని చెప్పారు. దయచేసి అతన్ని వెంటనే మానసిక ఆస్పత్రిలో చెర్పించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. డాక్టర్ సుధాకర్ చాలా కాలంగా టీడీపీ టికెట్ కోసం ప్రయత్నం చేశాడని, చంద్రబాబు మోసం చేడయంతో మతి భ్రమించి చివరకు పిచ్చివాడిలా మిగిలిపోయాడని అన్నారు. ఇకనైనా టీడీపీ నేతలు స్వార్థం కోసం దళిత నేతలను బలి చేయొద్దని కోరారు. సీఎం జగన్ ప్రభుత్వంపై మీద దళితులకు పూర్తి నమ్మకం ఉందని రవీంద్రబాబు అన్నారు. -
‘మన అదృష్టవశాత్తు అమరావతి నిర్మాణం జరగలేదు!’
సాక్షి, తూర్పు గోదావరి: 2019 ఎన్నికల్లో ఒకవేళ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గెలవకపోయింటే భవిష్యత్తులో మనల్ని మనం క్షమించుకోలేని నేరం చేసినవాళ్లమని మాజీ ఎంపీ పండుల రవీంద్రబాబు పేర్కొన్నారు. శనివారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. అవినీతి సొమ్ముతో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమరావతి కట్టుంటే అక్కడ మనం ఉండకుండా ఈడీ సీజ్ చేసి ఉండేదని విమర్శించారు. ప్రపంచ మొత్తంలో అమరావతి అవినీతి సొమ్ముతో కట్టిన రాజధాని నగరమై ఉండేదన్నారు. అదృష్టవశాత్తు అమరావతి నిర్మాణం జరగలేదని, ఇప్పటికైనా అమరావతి రైతులను, ప్రజలను ధర్నాలు మానుకోవాలని కోరారు. చంద్రబాబు మోసాన్ని.. భూటకపు నాటకాన్ని ఇప్పటికైనా ప్రజలు అర్థం చేసుకోవాలన్నారు. మీ దగ్గర తీసుకున్న భూములతో చంద్రబాబు అండ్ కో వ్యాపారాలు చేసి ఆ అవినీతి సొమ్మును విదేశాలకు పంపి.. మళ్లీ వాటిని ఇక్కడకు రప్పించి అమరావతి కట్టేవారని పేర్కొన్నారు. ఇక ఇప్పటికైనా సీఎం జగన్‌ను నమ్మండని, మీకు ఆయన న్యాయం చేస్తారని పండుల రవీంద్రబాబు తెలిపారు. చంద్రబాబు దగ్గర పీఏగా చేసిన వ్యక్తి దగ్గరే రూ. 2వేల కోట్లు దొరికాయాంటే.. ఒకవేళ చంద్రబాబు, లోకేష్‌పై నేరుగా ఐటీ దాడులు చేసుంటే ఎన్న లక్షల కోట్లు బయటపడేవో అన్నారు. అమరావతిని ఈడీ సీజ్‌చేయకుండా మనం బయట పడగలిగామన్నారు. ఇటువంటి అవినీతి ముందు ముందు జరగకుండా సీబీఐ, ఈడీ, ఎస్ఎఫ్ఐజో ద్వారా విచారణ జరిపించి దోషులను కఠినంగా శిక్షించాలన్నారు. కొత్తగా పుట్టిన రాష్ట్రాన్ని ఈ విధంగా దోచుకోవడం దేశ ద్రోహమే అవుతుందని, ఇలాంటి దోషులను దేశ ద్రోహులుగా పరిగణించి శిక్షించాలని ఆయన కేంద్రాన్ని కోరారు. ‘ఈ కుంభకోణంలో బాబు హ్యాండ్ ఉంది’ -
‘ఈ కుంభకోణంలో బాబు హ్యాండ్ ఉంది’
సాక్షి, కాకినాడ: చంద్రబాబు తమ మెదడును ఉపయోగించి రూ.2 కోట్ల టర్నోవర్ ఉన్న కాంట్రాక్టర్లను ఎంచుకుని చేసిన బ్రహ్మాండమైన మోసమని అమలాపురం మాజీ ఎంపీ పండుల రవీంద్రబాబు అన్నారు. ఆయన దగ్గర పనిచేసిన పీఎస్ శ్రీనివాస్ వద్ద ఐటీ దాడుల్లో రూ.2 వేల కోట్లు దొరకడం అందరినీ షాక్‌కు గురిచేసిందన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మొదటి నుంచి సింగపూర్ సింగపూర్ అంటున్న బాబు అక్రమార్జన అంతా సింగపూర్ వెళ్లుంటుందని విమర్శించారు. హవాల ద్వారా పంపిన బ్లాక్‌మనీ.. విదేశీ పెట్టుబడుల రూపంలో మనకు వైట్‌మనీగా వస్తుందని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఇక టీడీపీ పాలనలో అమరావతి, విశాఖపట్నంలో జరిగిన పెట్టుబడుల సదస్సుపై దృష్టి సారించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు. ఎందుకంటే సదస్సుకు వచ్చిన వారంతా బాబు మనుషులేనని పేర్కొన్నారు. అవన్నీ బాబు షెల్ కంపెనీలే ‘చంద్రబాబు సీఎం కాగానే లక్షల కోట్లు పెట్టుబడులు పెడతామని పలు కంపెనీలు, పరిశ్రమలు ఎంఓయూలు కుదుర్చుకున్నాయి. ఇవన్నీ బాబు షెల్ కంపెనీలే. ఆయన అవినీతి బాగోతం, మనీ లాండరింగ్‌పై సీబీఐ కేసు నమోదు చేసి విచారణ జరిపించాలి. చంద్రబాబు, లోకేష్ దగ్గర ఐటీ దాడుల్లో ఏమీ దొరకలేదు కధా? వారికేం సంబంధం అని చాలామంది అంటారు. కానీ దీనినే బినామీ ట్రాంజాక్షన్ అంటాము. అలాగే చంద్రబాబు సూపర్వైజింగ్ ఫెయిల్యూర్ అని కూడా అనవచ్చు. మన ఇంట్లో ఏం జరుగుతుందో చూడాల్సిన బాధ్యత యాజమానిపై ఉంటుంది. అలాగే ప్రభుత్వంలో తన వద్ద పని చేసిన వ్యక్తి వద్ద పెద్ద మొత్తం సొమ్ము పట్టుబడిందంటే చంద్రబాబు సూపర్వైజింగ్ ఫెయిల్యూరా? లేదా కుమ్మక్కుతో కూడిన కుంభకోణమా? అనేది తేలాల్సి ఉంది. ఈ కుంభకోణంలో చంద్రబాబు హ్యండ్ ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఉంటుంది. అందువల్ల ఇది పూర్తిగా బయటపడాలంటే వెంటనే ఐటీ శాఖ శ్రీనివాస్ కేసును తక్షణమే సిబిఐకి అప్పగించి విచారణ చేయించాలి’ అని డిమాండ్ చేశారు. (ఐటీ దాడుల్లో విస్మయకర విషయాలు) చదవండి: చంద్రబాబు అవినీతి బట్టబయలు రూ. 2 వేల కోట్లు: హైదరాబాద్‌కు చంద్రబాబు పయనం! ‘బాబు తేలు కుట్టిన దొంగలా వ్యవహరిస్తున్నారు’ లాగింది తీగమాత్రమే.. డొంక చాలా పెద్దది చంద్రబాబుని పట్టుకుంటే ఎన్ని వేల కోట్లో! (చంద్రబాబు మాజీ పీఎస్ ఇళ్లల్లో రెండో రోజూ సోదాలు) -
హవాల ద్వారా చంద్రబాబు అవినీతి సొమ్మును విదేశలకు పంపారు
-
‘శాసన మండలి రద్దు చేసింది టీడీపీనే’
సాక్షి, కాకినాడ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గతంలో శాసనమండలిని రద్దు చేసింది టీడీపీ ప్రభుత్వమే అని అమలాపురం మాజీ ఎంపీ పండుల రవీంద్రబాబు అన్నారు. ఆయన మంగళవారం కాకినాడలో మీడియాతో మాట్లాడుతూ.. గతంలో శాసనమండలి ఏమాత్రం అవసరంలేదని చెప్పిన వారిలో ముఖ్యుడు చంద్రబాబు నాయడు అని ఆయన మండిపడ్డారు. ప్రతి విషయాన్ని రాజకీయం చేస్తున్న శాసన మండలి ఉండటం శుద్ధ దండగ అనే భావం ప్రజల్లో కలిగిందని రవీంద్రబాబు గుర్తు చేశారు. శాసన మండలి ద్వారా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఎంతో రాజకీయ ప్రయోజనం ఉన్నప్పటికీ.. రాష్ట్ర ప్రజల శ్రేయస్సు కోసం శాసన మండలి రద్దు చేశారని అయన అన్నారు. శాసన మండలి రద్దు నిర్ణయం.. సీఎం జగన్ చిత్తశుద్ధిని తెలియజేస్తుందని ఆయన పేర్కొన్నారు. సీఎం వైఎస్ జగన్ చేసిన ఏ ప్రయత్నంలో ఆయినా ప్రజలందరూ.. అయన వెంటే ఉన్నారని రవీంద్రబాబు గుర్తు చేశారు. -
హర్షకుమార్‌పై మాజీ ఎంపీ రవీంద్ర ఫైర్
సాక్షి, కాకినాడ: తూర్పు గోదావరి జిల్లాలో జరిగిన బోటు ప్రమాదంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన మాజీ ఎంపీ హర్షకుమార్‌పై అమలాపురం మాజీ ఎంపీ పండుల రవీంద్ర బాబు ఫైర్ అయ్యారు. ఇటువంటి విషాద ఘటనలను రాజకీయ నిరుద్యోగులు ప్రచారానికి వాడుకోవడం విచారకరమని ఆయన పేర్కొన్నారు. ఆయన శనివారం మీడియాతో మాట్లాడారు. బోటు ప్రమాదం మృతుల కుటుంబాలకు పండుల రవీంద్ర తన ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. రెండుసార్లు ఎంపీ అయిన హర్షకుమార్ బాధ్యతాయుతంగా మాట్లాడాలని సూచించారు. చనిపోయిన వారు అసాంఘిక కార్యక్రమాలు చేసేందుకే లాంచీలో వెళ్లారనడం తప్పు అని పేర్కొన్నారు. ఆయన వ్యాఖ్యలతో మృతుల కుటుంబాలు మనోవేదనకు గురవుతాయన్నారు. ‘మీపై గౌరవం ఉంది. మీ మాటలు వెనక్కి తీసుకోవాలి. మృతుల కుటుంబాలకు క్షమాపణ చెప్పాలి’ అని హర్షకుమార్‌ను పండుల డిమాండ్ చేశారు. బోటు ప్రమాదం ఘటనను సంచలనాలకు, రాజకీయాలకు వాడకూడదని హితవు పలికారు. బోటు ప్రమాదంపై ప్రభుత్వం చేయాల్సిదంతా చేస్తోందని స్పష్టం చేశారు. రాజకీయ ఉద్యోగం కోసం చంద్రబాబు కాళ్ళు పట్టుకుని.. హర్షకుమార్ నైతిక విలువలు దిగజార్చుకున్నారని దుయ్యబట్టారు. మాజీ మంత్రి, టీడీపీ నేత గొల్లపల్లి సూర్యారావుపైన పండుల రవీంద్ర మండిపడ్డారు. దళితులపై దాడి చేసిన టీడీపీ నేత చింతమనేని ప్రభాకర్ ను అరెస్ట్ చేశారు.. మీకు కళ్లు పోయాయా అని ఆయనను ప్రశ్నించారు. దళితులను చింతమనేని దుర్భాషలాడినప్పుడు మీరు ఏమైపోయారని నిలదీశారు. బుద్ధుడి పేరుతో భూములు ఆక్రమించే గొల్లపల్లి సూర్యారావుకు సీఎం జగన్‌ను విమర్శించే అర్హత లేదని, ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఉప ముఖ్యమంత్రి పదవులు ఇచ్చిన ఘనత సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిదని అన్నారు. -
ఆయన ‘జూలకటక’ అన్నట్లుగా తయారయ్యాడు
కాకినాడ: మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ ‘ జూలకటక’ అన్నట్లుగా తయారయ్యాడని అమలాపురం ఎంపీ పండుల రవీంద్ర బాబు ఎద్దేవా చేశారు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో పండుల రవీంద్రబాబు విలేకరులతో మాట్లాడుతూ..తెలంగాణ ఎన్నికల ఫలితాల సర్వేతో జోకర్ అయ్యాడని అన్నారు. లగడపాటి తన వ్యాపారాల్లో కాళ్లు ఎత్తేశాడని ఆరోపించారు. బ్యాంక్ అప్పులు తీర్చుకోవడానికి బెట్టింగ్ వ్యాపారం మొదలు పెట్టారని విమర్శించారు. ఎన్నికల ఫలితాల తర్వాత లగడపాటి ఎలాగూ పారిపోతాడని జోస్యం చెప్పారు. ఎందుకంటే అతని సర్వే నమ్మి బెట్టింగ్ కాసిన వాళ్లు వెంటపడతారని అన్నారు. -
‘అందుకే బాబు జాతీయ నేతలను కలుస్తున్నారు’
-
‘వైఎస్సార్సీపీకి 150 అసెంబ్లీ, 25 ఎంపీ స్థానాలు’
సాక్షి, తూర్పుగోదావరి జిల్లా : తెలుగువారి గౌరవాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దేశ స్థాయిలో పరువు తీస్తున్నారని వైఎస్సార్సీపీ నేత, అమలాపురం ఎంపీ పండుల రవీంద్రబాబు విమర్శించారు. ఓడిపోతామని భయంతో చంద్రబాబు రకరకాల వేషాలు వేస్తూ ఢిల్లీ చుట్టూ తిరుగుతున్నారని ఆరోపించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎగ్జిట్ పోల్స్ అంచనాలు టీడీపీని రాజకీయాల నుంచి ఎగ్జిట్ అయ్యేలా చేశాయని ఎద్దేవా చేశారు. 2024 కల్లా టీడీపీ ముక్కలైపోతుందని తెలిసి చంద్రబాబు నాయుడు జాతీయ నేతలను డిస్ట్రబ్ చేస్తున్నారని ఆరోపించారు. ప్రజా తీర్పును హుందాగా గౌరవించాల్సింది పోయి చంద్రబాబు రకరకలా ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. వైఎస్సార్సీపీ 150 అసెంబ్లీ, 25 ఎంపీ స్థానాలు కైవసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తే 30-40 ఏళ్లు పాలిస్తారని తెలిసి చంద్రబాబుకు వణుకుపుట్టుకుందన్నారు. ఇప్పటికే ఎన్నికల కమిషన్, న్యాయ స్థానాలు, జాతీయ నాయకులను కలవడం అయిపోయింది కనక చివరగా చంద్రబాబు ఓ మానసిన వైద్యుడిని కలిస్తే మంచిదని ఎద్దేవా చేశారు. మే 23న వచ్చే ఫలితాలు ఎగ్జిట్ పోల్స్‌ను మించి ఉంటాయని, వైఎస్ జగన్ సీఎం కావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి చంద్రబాబుకు మతి భ్రమించింది : భరత్ లగడపాటి సర్వే చూసి యువత బెట్టింగ్‌కు పాల్పడవద్దని రాజమండ్రి నియోజకవర్గ వైఎస్సార్సీపీ అభ్యర్థి మార్గాని భరత్ కోరారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు తన తప్పులకు భయపడే అన్ని పార్టీల నాయకుల చుట్టూ తిరుగుతున్నారని ఆరోపించారు. చంద్రబాబుకు మతి భ్రమించిందని, అందుకే ప్రజా తీర్పును జీర్ణించుకోలేకపోతున్నారని విమర్శించారు. మే 23 తర్వాత వైఎస్ జగన్ ఆధ్వర్యంలో ఏపీలో రాజన్న రాజ్యం రావడం తథ్యం అన్నారు. -
‘చంద్రబాబు అప్పుడెందుకు మాట్లాడలేదు?’
సాక్షి, తూర్పుగోదావరి : ఓటు వేసిన మూడు కోట్ల మంది ప్రజలను, ఎన్నికలను సమర్ధవంతంగా నిర్వహించిన సిబ్బందిని చంద్రబాబు అవమానిస్తున్నారని అమలాపురం ఎంపీ, వైఎస్సార్సీపీ నాయకుడు పండుల రవీంద్రబాబు విమర్శించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 2014లో ఈవీఎంలు ఇంతకన్న ఎక్కువగా మొరాయించాయని చంద్రబాబు అప్పుడెందుకు మాట్లాడలేదని నిలదీశారు. ఢిల్లీలో చంద్రబాబు తీరు చూస్తుంటే.. మే23న ప్రజలకు తన ముఖం ఎలా చూపించాలని ప్రిప్రేర్ అవుతున్నట్లు ఉందంటూ ఎద్దేవా చేశారు. ఓడిపోతామన్న భయం చంద్రబాబుకి, టీడీపీకి పట్టుకుందని, అత్త మీద కోపం దుత్త మీద చూపించినట్లు చంద్రబాబు తన కోపాన్ని ఈవీఎంల మీద చూపించి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు మీద ప్రజలు చాలా కోపంగా ఉన్నారని అందుకే ఆయన మీద వ్యతిరేకతతో ఓట్లు గుద్దేశారన్న క్లారీటీ చంద్రబాబుకు వచ్చిందన్నారు. రాష్ట్ర ఎన్నికల సీఈఓగా సిసోడి వద్దని.. ద్వివేదిని నియమించమని ఈసీకి పంపింది చంద్రబాబే అని గుర్తు చేశారు. ద్వివేది రాష్ట్ర అధికారి..సొంత అధికారిని ఎవరైనా తిడతారా? అంటూ ప్రశ్నించారు. చంద్రబాబు తీరును ప్రతిఒక్కరూ గమనిస్తున్నారని అన్నారు. -
‘చింతమనేని చూసి నేర్చుకోవాలట’
సాక్షి, పశ్చిమగోదావరి : ఎస్సీలపై దాడులు చేసిన ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ని చూసి నేర్చుకోమని చంద్రబాబు నాయుడు చెప్పడం హస్యాస్పదంగా ఉందన్నారు ఎంపీ పందుల రవీంద్ర బాబు. శనివారమిక్కడ ఎన్నికల ప్రచారంలో ప్రసంగిస్తూ.. చింతమనేని ప్రభాకర్ ఎస్సీలపై దాడి చేసిన వ్యవహారం పార్లమెంట్‌లోనూ చర్చకు వచ్చిందని తెలిపారు. ప్రశాంత దెందులూరు నియోజకవర్గాన్ని కులాలు, కుమ్ములాటలతో వివాదాస్పదంగా మార్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. భూకబ్జాలు, దోపిడీ, అవినీతి ఆరాచకాల్లో దెందులూరు నియోజకవర్గం రాష్ట్రంలోనే మొదటి స్థానంలో ఉందని తెలిపారు. నియోజకవర్గాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజలపైనే ఉందని స్పష్టం చేశారు. జగనన్నను ముఖ్యమంత్రిగా.. అబ్బయ్య చౌదరిని ఎమ్మెల్యేగా గెలిపిస్తే మంచి పాలన అందిస్తారని హామీ ఇచ్చారు. -
‘జేడీ లక్ష్మీనారాయణ.. ప్రజలకు చెప్పాలి’
సాక్షి, విశాఖపట్నం: హైదరాబాద్ శివారు శంకరాపల్లిలో ఎకరం రూ.2 కోట్ల విలువైన భూమిని రూ.4 లక్షలకే ఎలా కొన్నారో విశాఖ జనసేన ఎంపీ అభ్యర్థి జేడీ లక్ష్మీనారాయణ ప్రజలకు చెప్పాలని వైఎస్సార్సీపీ నేత, అమలాపురం ఎంపీ రవీంద్రబాబు డిమాండ్ చేశారు. విశాఖలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. పేద వ్యవసాయ కుటుంబంలో జన్మించానని చెప్పే లక్ష్మీనారాయణ ఆరున్నర కోట్లు మొబిలెసెట్స్‌గా చూపిస్తున్నారని, ముంబైలో రూ.5 కోట్లకు ఫ్లాట్ అమ్మినట్లుగా అఫిడవిట్లో సమర్పించారని తెలిపారు. ఉద్యోగం తప్ప ఏ ఆధారం లేదని చెప్పుకునే ఆయనకు ఏడాదికి రూ.20 లక్షలకు మించి ఆదాయం రాదని, కేవలం క్వీడ్‌ప్రోకోలో జరిగిన అగ్రిమెంట్‌తోనే రూ.ఆరున్నర కోట్లు మొబిలెసెట్స్‌గా తీసుకొచ్చి దాన్ని తెల్లధనంగా మార్పుచేసి హైదరాబాద్ శివారులో శంకరాపల్లిలో భూమి కొన్నారని ఆరోపించారు. కులాలకతీతంగా పనిచేస్తానని నీతులు చెబుతున్న లక్ష్మీనారాయణ మహారాష్ట్రలో పనిచేస్తూ అంబేడ్కర్‌ను ఏనాడైనా కొలిచారా అని ప్రశ్నించారు. పేద ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచి ప్రజల కోసం పాటుపడి, సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిన ఘనత ఒక్క వైఎస్సార్‌కే సాధ్యమైందని చెప్పారు. సమావేశంలో పార్టీ అదనపు కార్యదర్శి రవిరెడ్డి, పార్టీ అనుబంధ సంఘాల అధ్యక్షులు పాల్గొన్నారు. -
రవీంద్ర బాబుకు న్యాయం చేస్తాం: వైఎస్ జగన్
-
రవీంద్ర బాబుకు న్యాయం చేస్తాం: వైఎస్ జగన్
సాక్షి, అంబాజీపేట : ఎంపీ పదవికి రాజీనామా చేసి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన పండుల రవీంద్రబాబుకు న్యాయం చేస్తామని వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి హామీ ఇచ్చారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన ఆదివారం రాత్రి అంబాజీపేట బహిరంగ సభలో మాట్లాడారు. పార్టీ అధికారంలోకి రాగానే రవీంద్ర బాబును గుండెల్లో పెట్టుకుంటామని, తూర్పు గోదావరి జిల్లా నుంచి తొలి ఎమ్మెల్సీగా అవకాశం కల్పిస్తామని వైఎస్ జగన్ ప్రకటించారు. అమలాపురం లోక్‌సభ అభ్యర్థి అనురాధ, పి.గన్నవరం ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న కొండేటి చిట్టిబాబుని ఆశీర్వదించి, వైఎస్సార్ సీపీని గెలిపించాలని వైఎస్ జగన్ ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. వైఎస్సార్ సీపీలో చేరిన వరుపుల సుబ్బారావు ప్రత్తిపాడు ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావు ఆదివారం పి.గన్నవరంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి సమక్షంలో పార్టీలో చేరారు. వరుపులతో పాటు ఆయన తనయుడు సూరిబాబు, అంబాజీపేట మార్కెట్ కమిటీ ఛైర్మన్ రామకృష్ణనాయుడు కూడా పార్టీ కండువా కప్పుకున్నారు. -
దళిత సంక్షేమం ఉట్టిపడేలా వైఎస్సార్ సీపీ మ్యానిఫెస్టో
సాక్షి, విజయవాడ: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మ్యానిఫెస్టోలో దళిత సంక్షేమం ఉట్టిపడేలా ఉంటుందని వైఎస్సార్ సీపీ ఎస్సీసెల్ అధ్యక్షుడు మేరుగ నాగార్జున తెలిపారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తమ పార్టీ ఎస్సీ అధ్యయన కమిటీ సమావేశంలో అన్ని అంశాలు చర్చించామన్నారు. గతంలో వైఎస్సార్ హయాంలో దళిత సంక్షేమం ఎలా జరిగింది, చంద్రబాబు వాటిని ఎలా తుంగలో తొక్కి పాలించారు అనే విషయాలు చర్చించామని తెలిపారు. తమ పార్టీ మ్యానిఫెస్టోలో దళిత సంక్షేమం కోసం ఏ ఏ అంశాలు పెట్టాలి అన్న దానిపై చర్చించినట్లు వెల్లడించారు. తమ పార్టీ దళిత నేతలు అనేక సూచనలు చేశారని చెప్పారు. టీడీపీలో ఉన్న దళిత నేతలు కళ్లులేని కబోదుల్లా ఉన్నారని మండిపడ్డారు. వైఎస్ జగన్ సీఎం అయితేనే దళితులకు న్యాయం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయితేనే దళితులకు న్యాయం జరుగుతుందని వైఎస్సార్ సీపీ నేత పండుల రవీంద్రబాబు స్పష్టం చేశారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తమ పార్టీ మ్యానిఫెస్టోలో దళితులకు సంబంధించి అన్ని విషయాలను కూలంకషంగా చర్చించామన్నారు. ఎస్సీలకు పార్టీలో పెద్దపీట వేయనున్నట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రతి విషయాన్ని రాజకీయం చేయడం దురదృష్టకరమన్నారు. -
చింతమనేనిని తీవ్రంగా హెచ్చరించిన ఎంపీ
సాక్షి, పశ్చిమ గోదావరి : దళితులపట్ల అత్యంత అవమానకర వ్యాఖ్యలు చేసిన దెందులూరు టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌పై ఎంపీ పండుల రవీంద్రబాబు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. దళితులపట్ల పిచ్చి కూతలు మానుకోకపోతే చింతమనేని రాజకీయంగా సమాధికాక తప్పదని హెచ్చరించారు. దళితులు రాజకీయాలకు పనికిరారంటూ చింతమనేని చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు. ‘నోటి దురసు, కుల గజ్జితో మాట్లాడుతున్నావ్. అంబేద్కర్ భిక్ష వల్లే నువ్ ఎమ్మెల్యేగా తిరుగుతున్నావ్. దళితులపట్ల పిచ్చి కూతలు మానుకోకపోతే రాజకీయంగా సమాధికాక తప్పదు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా నిన్ను ఓడించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడం ఖాయం’ అని రవీంద్రబాబు చెప్పారు. (చింతమనేని వీడియో సోషల్ మీడియాలో షేర్ చేశారంటూ..) -
పండుల బాటలో మరికొందరు...
సాక్షి ప్రతినిధి,తూర్పుగోదావరి, కాకినాడ: ఆట మొదలు కాకుండానే వికెట్లు పడిపోతున్నాయి. ప్రజాగ్రహాన్ని చవి చూస్తున్న టీడీపీకి దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. రోజుల వ్యవధిలో ఎమ్మెల్యేలు, ఎంపీలు వైఎస్సార్సీపీలో చేరుతుండటంతో అయోమయ పరిస్థితిని టీడీపీ ఎదుర్కొంటున్న సమయంలో అమలాపురం ఎంపీ పండుల రవీంద్రబాబు చేరిక ముచ్చెమటలనెక్కిస్తోంది. ఎస్సీ సామాజికవర్గ నేతగా, విద్యావేత్తగా పేరున్న రవీంద్రబాబు చేరడంతో వైఎస్సార్సీపీ బలం మరింత పెరిగిందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. ఆయన పార్టీ మారకుండా టీడీపీ అధిష్టానం చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. చంద్రబాబును ఇక భరించలేమని, రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే ఏకైక మగధీరుడు వైఎస్ జగన్ మోహన్‌రెడ్డేనని, చంద్రబాబుతో రాష్ట్రం బాగుపడదని బహిరంగ ప్రకటన చేసిన పండుల వైఎస్సార్సీపీలోచేరారు. ఇది ఆరంభం మాత్రమేనని, భవిష్యత్తులో టీడీపీ నుంచి మరిన్ని వలసలు ఉంటాయని రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. కేంద్ర అధికారిగా... విశాఖపట్నం సెంట్రల్ ఎక్సైజ్ కస్టమ్స్ అండ్ సర్వీసు ట్యాక్స్ ఆడిషనల్ కమిషనర్‌గా పనిచేసిన పండుల రవీంద్రబాబు గత ఎన్నికల్లో అమలాపురం ఎంపీగా పోటీ చేసి విజయం సాధించారు. పదవిలో ఉన్నంత సేపు నిబద్ధతతో పనిచేశారు. కోనసీమ రైల్వే రావడం వెనక ఎంపీ పండుల కృషి అనేది ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. అవినీతి అక్రమాలకు దూరంగా ఉండే రవీంద్రబాబుకు టీడీపీలో సరైన గుర్తింపు లభించలేదు. విజ్ఞానం, వాగ్ధాటి ఉన్నప్పటికీ ప్రత్యేక హోదా విషయంలో లోక్‌సభలో మాట్లాడేందుకు సరైన అవకాశం ఇవ్వలేదు. ప్రత్యేక హోదా విషయంలో వైఎస్సార్సీపీ ఎంపీల మాదిరిగా రాజీనామాలు చేద్దామని అధిష్టానానికి చెప్పినా ఆయన మాట వినలేదు. దీంతో విసిగి వేసారి పోయి ప్రత్యేక హోదా కోసం అహర్నిశలు పోరాడుతున్నారని, రాష్ట్రాభివృద్ధి జగన్‌తోనే సాధ్యమవుతుందని వైఎస్సార్సీపీకి ఆకర్షితుడై పార్టీలో చేరారు. పండుల బాటలో మరికొందరు... ఎంపీ పండుల రవీంద్రబాబు బాటలోనే మరికొందరు టీడీపీ నేతలు వైఎస్సార్సీపీలో చేరే అవకాశం ఉంది. ఆమేరకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అవినీతిలో కూరుకుపోయి ప్రజావ్యతిరేకతను మూటగట్టుకోవడమే కాకుండా పూటకొక మాట చెప్పి ప్రజల్ని గందరగోళానికి గురి చేస్తున్న చంద్రబాబుతో రాష్ట్రానికి మేలు జరగదని జిల్లాలో మరికొందరు వైఎస్సార్సీపీలోకి రానున్నారు. ఇప్పటికే జిల్లాలో ద్వితీయ శ్రేణి టీడీపీ నాయకులు పెద్ద ఎత్తున వైఎస్సార్సీపీలో చేరుతున్నారు. దాదాపు ప్రతి నియోజకవర్గంలోనూ టీడీపీ నుంచి వైఎస్సార్సీపీలోకి వస్తున్నారు. ప్రతి గ్రామంలోనూ వందలాదిగా టీడీపీ కార్యకర్తలు వైఎస్సార్సీపీ బాట పడుతున్నారు. ఇప్పటికే జిల్లాలో వలసలు ఊపందుకున్నాయి. ఇకముందు మరింత ముమ్మరం కానున్నాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. -
పండుల వారు అక్కడ ఉండరు!
తూర్పుగోదావరి, అమలాపురం టౌన్: ఆయన అమలాపురం నియోజకవర్గానికి అధికార పార్టీ ఎంపీ. పేరు డాక్టర్ పండుల రవీంద్రబాబు. ఆయన అమలాపురం నుంచి ఎన్నికైనా.. ఆయన కార్యాలయం మాత్రం జిల్లా కేంద్రం కాకినాడలో ఉంటుంది. సొంత నియోజకవర్గంలో ఆయనకు స్థానిక చిరునామా లేదు. తన స్థానికతను చూపించేందుకు కనీసం కార్యాలయం కూడా లేదు. జిల్లాలోని మిగిలిన ఎంపీలైన రాజమహేంద్రవరం ఎంపీ మురళీమోహన్, కాకినాడ ఎంపీ తోట నరసింహం లకు ఆయా పార్లమెంట్ నియోజకవర్గ కేంద్రాల్లో సొంత కార్యాలయాలు ఉన్నాయి. సాధారణంగా ఎంపీలు సొంత కార్యాలయాలు ఏర్పాటు చేసుకుంటారు. ఎంపీతో ప్రజలకు ఏదైనా పని పడితే వారి ఆ కార్యాలయానికి వచ్చి ఆర్జీలు ఇచ్చుకునేందుకు...ఎంపీ ఉంటే స్వయంగా కలసి తమ వినతులు చెప్పుకునేందుకు అవకాశం ఉంటుంది. 2014 ఎన్నికల్లో కేంద్ర ప్రభుత్వ సర్వీసులో ఐఆర్ఎస్ అధికారిగా ఐటీ, కస్టమ్స్ల్లో పనిచేసిన ఆయన అమలాపురం ఎంపీ టీడీపీ అభ్యర్థిగా స్థానికత లేకుండా దిగుమతి అభ్యర్థిగానే రంగంలోకి దిగారు. ఎన్నికల్లో దిగుమతి అభ్యర్థులు రావడం..పోటీ చేయడం సాధారణమే. అయితే ఎంపీగా గెలిచిన తర్వాత స్థానికత కోసం కాకపోయినా ప్రజలకు అందుబాటులో ఉండేందుకు ఓ కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకుని అందులో ఒకరిద్దరి ఉద్యోగులను అందుబాటులో ఉంచడం కూడా సాధారణమే. ఎంపీ రవీంద్రబాబు జిల్లాలోని మిగతా ఇద్దరి ఎంపీలతో పోల్చితే నియోజకవర్గంలో ఆయన పర్యటించిన సందర్భాలు తక్కువే. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసే కార్యక్రమాల్లో... ప్రారంభోత్సవాల్లో ఆయన అప్పుడప్పుడూ మాత్రమే పాల్గొంటారు. గత నాలుగున్నరేళ్లలో ఆయన అమలాపురంలో ప్రెస్మీట్లు ఏర్పాటు చేసి మాట్లాడిన సందర్భాలు కూడా వేళ్ల మీద లెక్క కట్టేలా ఉంటాయి. గతంలో అమలాపురం ఎంపీలుగా పనిచేసిన లోక్‌సభ మాజీ స్పీకర్ దివంగత జీఎంసీ బాలయోగి, మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్ సైతం వారు ఎంపీగా పనిచేసినంత కాలం అమలాపురంలో కార్యాలయాలు ఏర్పాటుచేసి ప్రజలకు అందుబాటులో ఉండేవారు. వాస్తవానికి బాలయోగి కాకినాడలో... హర్షకుమార్ రాజమహేంద్రవరంలో ఉండే వారు. అయినప్పటికీ అమలాపురం ఎంపీలైన తర్వాత వారు అమలాపురం కేంద్రంగా కార్యాలయాలను నిర్వహించడమే కాకుండా ఇక్కడకు వచ్చిన ప్రతిసారీ తమ కార్యాలయాల్లో కొంత సమయం ఉండేవారు. జిల్లాలో ప్రస్తుత మిగతా ఇద్దరు ఎంపీలు, గతంలో అమలాపురం ఎంపీలుగా పనిచేసిన వారు స్థానిక కార్యాలయాల్లో ప్రజలకు ఎలా అందుబాటులో ఉంటున్నారో...ఉండేవారో అమలాపురం పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలు గుర్తు చేసుకుని... పోల్చుకుంటూ చర్చించుకుంటున్నారు. తాజా వివాదంలో ఎంపీ తీరుపై చర్చోపచర్చలు ఇదిలా ఉండగా ఇటీవల ఎంపీ రవీంద్రబాబు కోనసీమ రైల్వేలైన్‌కు నిధుల సాధన సందర్భంగా ఇక్కడ రైల్వేలైన్ కోసం పోరాడిన కోనసీమ జేఏసీ ప్రతినిధులను పిట్టల దొరలని చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. దీనిపై జేఏసీ ప్రతినిధులు ప్రతి స్పందిస్తూ ఎంపీకి అల్టిమేటమ్ ఇచ్చిన విషయమూ విదితమే. ఇదే సమయంలో పార్లమెంట్ నియోజకర్గ ప్రజలు ఎంపీ పనితీరుపై గతంలో కంటే ఎక్కువగా చర్చించుకోవడం కనిపిస్తోంది. ఎంపీకి ఏదైనా వినతి పత్రం ఇవ్వాలంటే ఆయన ఎప్పుడు వస్తారు...ఎక్కడకు వస్తారు...? అనే సమాచారం తెలుసుకునేందుకు ఇబ్బందులు పడుతున్నామని ప్రజలు అంటున్నారు. అమలాపురంలో ఆయనకు సంబంధించిన కార్యాలయం ఉంటే అక్కడకి వెళ్లి సమాచారం తెలుసుకునేవాళ్లం. కాకినాడలో కార్యాలయం ఉండడం వల్ల ఎంపీ సమాచారం చెప్పేవారే కరవవుతున్నారని ప్రజలు చెప్పుకుంటున్నారు. ఎంపీతో మరీ అత్యవసరమైన పని పడితే కాకినాడ కార్యాలయానికి వెళ్లవలసి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
పండుల వర్సెస్ గొల్లపల్లి
సాక్షి ప్రతినిధి, కాకినాడ : అమలాపురం ఎంపీ పండుల రవీంద్రబాబు అంటేనే రాజోలు ఎమ్మెల్యే గొల్లపల్లి సూర్యారావు రంకెలు వేస్తున్నారు. ఎంపీ పేరు ఎత్తితే చాలు ఎమ్మెల్యే చిర్రెత్తిపోతున్నారు. నియోజకవర్గంలో తనదే పైచేయి అని, తన మాటే వేదవాక్కని, ఇందులో ఎవరి పెత్తనం కుదరదు అన్నట్టుగా గొల్లపల్లి వ్యవహరిస్తున్నారు. ఎంపీని వెనకేసుకొస్తున్న వారిని ఆమడదూరంలో పెడుతున్నారు. ఈ క్రమంలో మాజీ ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు ఒకరు. ఎంపీ రవీంద్రబాబు, రాపాక వరప్రసాద్‌లు ఒకే తాను ముక్కగా భావిస్తూ ఎమ్మెల్యే గొల్లపల్లి ప్రతీకార రాజకీయాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే ముందు ఎంపీ ప్రస్తావన తేడానికి టీడీపీ శ్రేణులు హడలిపోతున్నాయి. ఇక్కడ కొనసాగుతున్న ఆధిపత్య పోరులో ‘ముందుకెళితే నుయ్యి ... వెనక్కి వెళితే గొయ్యి’ అన్న చందంగా తెలుగు తమ్ముళ్లు నలిగిపోతున్నారు. తొలి నుంచీ ఎంపీ, ఎమ్మెల్యే మధ్య పోరు గత ఎన్నికల్లో ఎంపీ టిక్కెట్ కోసం గొల్లపల్లి సూర్యారావు యత్నించారన్న వాదనలున్నాయి. అయితే వేర్వేరుగా లాబీయింగ్ ద్వారా పండుల రవీంద్రబాబుకు టిక్కెట్ దక్కింది. దీంతో గొల్లపల్లి తట్టుకోలేక ఎంపీకి వ్యతిరేకంగా పావులు కదపడం మొదలు పెట్టారని సమాచారం. 2014 ఎన్నికల ఖర్చు కూడా ఎంపీ, ఎమ్మెల్యేల మధ్య విభేదాలకు దారితీసిందనే వాదనలున్నాయి. ఎన్నికల ఖర్చు విషయంలో ఎంపీ పండుల రవీంద్ర బాబు రాజోలు నియోజక వర్గాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేశారని ఎమ్మెల్యే గొల్లపల్లి సూర్యారావు వర్గీయుల వాదన. రాజోలు నియోజక వర్గంలో ఎన్నికల ఖర్చుకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని ఆయన వర్గీయులు అంటున్నారు. మిగిలిన నియోజక వర్గాలకు మాత్రం ఆయన దండిగా నిధులు పంపారని, రాజోలులో గొల్లపల్లిని ఓడించడం కోసమే పండుల అలా చేశారన్న వ్యాఖ్యలు వినిపించాయి. ఇదే ఎంపీ, ఎమ్మెల్యేల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనడాకి కారణమని చెప్పుకుంటున్నారు. ఎమ్మెల్యే తనను దూరంగా పెట్టినప్పుడు తానెందుకు వెనక్కి తగ్గాలని ఎంపీ కూడా నియోజక వర్గం ఎప్పుడువచ్చినా ఎమ్మెల్యే ఇంటికి వెళ్లరు. తన అనుయాయుల ఇళ్లకు వెళ్లి వెనుతిరగడం...ఇలా నాలుగేళ్లుగా సాగుతూనే ఉంది. ఆరోపణల దాడి... మాజీ ఎమ్మెల్యే రాపాక వర ప్రసాదరావు, ప్రస్తుతం ఎమ్మెల్యే గొల్లపల్లి సూర్యారావుల మధ్య కాంట్రాక్టుల విషయంలో కూడా విభేదాలు తలెత్తాయి. ఇరిగేషన్, రోడ్డు పనులను తన ఆనుయాయులకు కట్టబెట్టి ఎమ్మెల్యే గొల్లపల్లి లబ్ధిపొందుతున్నారని రాపాక వర్గీయులు ఆరోపణలు చేయడం మొదలు పెట్టారు. బినామీల పేరుతో రియల్ ఎస్టేట్ చేస్తున్నారని, డబ్బులిస్తేనే పని చేస్తున్నారని విమర్శలు ఎక్కుపెట్టారు. మామిడికుదురు మండలం ఆదూరులో సొంతంగా పెట్టుకున్న కళాశాలకు కాంట్రాక్టర్లు, లబ్ధిపొందిన వారిని ఉపయోగించుకుంటున్నారని గొల్లపల్లిపై పరోక్ష ఆరోపణలకు దిగారు. ఆ కళాశాలకు అవసరమైన ఇసుకను అడ్డంగా తరలించేశారని ఆరోపిస్తూ అప్పట్లో రాపాక వరప్రసాదరావు ఆ కళాశాలకు వెళ్లి పరిశీలించి హడావుడి చేశారు. తన కళాశాలకు వచ్చి హల్చల్ చేయడమేంటని గొల్లపల్లిలో మరింత ద్వేషం పెరిగింది. ఇక, గొల్లపల్లి వర్గం కూడా రాపాకపై కౌంటర్ ఆరోపణలకు దిగింది. చింతలమోరిలో జరిగిన ఇసుక అక్రమ తవ్వకాలకు వరప్రసాదరావు అండగా నిలిచారని ప్రత్యారోపణలకు దిగారు. తనకు శత్రువుగా తయారైన ఎంపీని కూడా గొల్లపల్లి వర్గం వదల్లేదు. కోటిపల్లి– నర్సాపూర్ రైల్వే లైన్ అలైన్మెంట్ మార్పులో చేతులు మారాయని పరోక్ష ఆరోపణలు చేస్తూ వస్తున్నారు. సన్మానంపైనా గ్రూపు రాజకీయాలు. కోటిపల్లి– నర్సాపూర్ రైల్వే లైన్‌కు పండుల కృషి చేశారని రాపాక వరప్రసాద్ ఆధ్వర్యంలో సన్మానం చేశారు. ఎస్సీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఈ సన్మానం చేస్తున్నట్టు కరపత్రాలు ముద్రించారు. దీన్ని టీడీపీలో ఉన్న గొల్లపల్లి వర్గం వ్యతిరేకించింది. ఎస్సీ సంక్షేమ సంఘానికి సంబంధం లేదని తమకు అనుకూల నాయకుల చేత ప్రెస్మీట్లు పెట్టి హడావుడి చేయించారు. అయినప్పటికీ రాపాక వర్గం వెనక్కి తగ్గలేదు. అనుకున్నట్టుగానే ఎంపీ రవీంద్రబాబును పిలిచి ఘనంగా సన్మానించారు. ఇది గొల్లపల్లిని మరింత రెచ్చగొట్టినట్టు చేసింది. ప్రతీకారేచ్ఛ రాజకీయాలకు మరింత ఊపు ఇచ్చినట్టు అయ్యింది. మొత్తానికి ఎంపీ, ఎమ్మెల్యే, మధ్యలో రాపాక వరప్రసాదరావు రాజకీయాలతో రాజోలు టీడీపీ హాట్ హాట్‌గా ఉంది. ఎంపీ చెంత చేరిన ఎమ్మెల్యే వ్యతిరేక వర్గీయులు ఎమ్మెల్యే వ్యతిరేక వర్గీయులందర్నీ ఎంపీ ఆదరిస్తున్నారు. తొలుత రాపాక పండుల రవీంద్ర చెంత చేరారు. రాపాకను వెంట వేసుకుని తిరుగుతుండడంతో గొల్లపల్లిలో ఆవేదన అధికమైంది. గత ఎన్నికల్లో టిక్కెట్‌కు పోటీపడ్డ బత్తుల రాము వర్గీయులను తొలుత ఎమ్మెల్యే దూరంగా పెట్టారు. తనకు ఎన్నికల్లో వ్యతిరేకంగా పనిచేశారన్న అనుమానంతో కక్ష పెట్టుకున్నారు. దీంతో ఆయన తప్పని పరిస్థితుల్లో ఎంపీ గూటికి చేరారు. ఇక, క్షత్రియ సామాజిక వర్గానికి చెందిన ముదునూరి చినబాబు (జిల్లా టీడీపీ మాజీ ఉపాధ్యక్షుడు)తో కూడా ఎమ్మెల్యేకు వైరం వచ్చింది.ఆయన కూడా ఎంపీ పక్కన చేరారు. ఇలా ఎమ్మెల్యే వ్యతిరేక వర్గీయులు, రాపాక ఒక గ్రూపుగా ఏర్పడి రాజకీయాలు చేస్తున్నారు. దీంతో గొల్లపల్లిలో మరింత ద్వేషం పెరిగింది. ఎంపీని ఎవరు కలిస్తే వారిని వ్యతిరేకులుగా చూడటం మొదలు పెట్టారు. వారిని బహిరంగంగా తిట్టడం ప్రారంభించారు. అంతేకాకుండా ఎంపీ గ్రాంటుతో పనులు చేయనివ్వకుండా అడ్డుకున్నారు. స్థానికంగా ఉన్న గ్రామ నాయకులతో తీర్మానాలు ఇవ్వకుండా, అధికారుల సహకారం లేకుండా ఎంపీకి అడ్డు తగులుతూ వస్తున్నారు. గొల్లపల్లికి కొరకరాని కొయ్యగా రాపాక ఎంపీతో విభేదాలు ఇలా ఉంటే...స్థానికంగా ఉన్న మాజీ ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావుతో కూడా ఎమ్మెల్యే గొల్లపల్లికి తీవ్ర విభేదాలున్నాయి. ఎన్నికల్లో గెలిచాక రాపాకను ఎమ్మెల్యే దూరం పెట్టడం మొదలు పెట్టారు. రాపాక నిలదొక్కుకుంటే భవిష్యత్తులో ముప్పు ఉండొచ్చనే భయంతో గొల్లపల్లి వ్యూహాత్మకంగా రాజకీయాలకు తెరదీశారు. దీన్ని గమనించిన రాపాక కూడా తనదైన శైలి రాజకీయాలకు తెరలేపారు. ఎన్నికల్లో వాడుకుని వదిలేశారన్న అక్కసుతో గొల్లపల్లికి వ్యతిరేకంగా రాజకీయాలు చేస్తున్నారు. ఇదే అదనుగా చూసుకుని ఎంపీ రవీంద్రబాబుతో కలిసి ప్రయాణం సాగించారు. ఇది గొల్లపల్లిని మరింత రెచ్చగొట్టేలా చేసింది. ఎంపీ, రాపాక లక్ష్యంగా ప్రతీకార రాజకీయాలను ఎమ్మెల్యే గొల్లపల్లి మొదలు పెట్టారు. గొల్లపల్లి, రాపాక మధ్య విభేదాలు తీవ్ర స్థాయికి చేరడానికి మరో కారణం కూడా ఉంది. రాపాక ఎమ్మెల్యేగా ఉన్న హయాంలో చింతలమోరి గ్రామానికి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ మంజూరైంది. అయితే, ఆ తర్వాత ఎమ్మెల్యే అయిన గొల్లపల్లి సూర్యారావు ప్రతీకార రాజకీయాలకు శ్రీకారం చుట్టి రాపాక సొంతూరైన చింతలమోరిలో లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టడం ఇష్టం లేక శంకరగుప్తానికి మార్చారు. తన గ్రామానికి మంజూరైన లిప్ట్ ఇరిగేషన్ స్కీమ్‌ను వేరే గ్రామానికి మార్చుతారా? అని రాపాకలో కసి పెంచింది. ఇంకేముంది గొల్లపల్లి లక్ష్యంగా అడుగులు వేయడం ప్రారంభించారు. -
ఎంపీ, ఎమ్మెల్యేల నడుమ విభేదాలు
-
ఎంపీ, ఎమ్మెల్యేల నడుమ విభేదాలు
► పండులతో ఆది నుంచీ గొల్లపల్లికి విభేదాలే.. ► ఇప్పుడు అదే బాటలో అయితాబత్తుల.. ► సయోధ్యకు రాజప్ప యత్నం విఫలం! అమలాపురం: ఒకేపార్టీకి చెందిన ప్రజాప్రతినిధులైనా వారి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గున మండేస్థాయిలో విభేదాలు రగులుతున్నాయి. వారే టీడీపీకి చెందిన అమలాపురం ఎంపీ పండుల రవీంద్రబాబు, ఆ పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలోని రాజోలు, అమలాపురంల నుంచి ఎమ్మెల్యేలుగా ప్రాతినిధ్యం వహిస్తున్న గొల్లపల్లి సూర్యారావు, అరుుతాబత్తుల ఆనందరావు. అభివృద్ధి కోసం కలిసి పని చేయూల్సిన వారు కలహించుకుంటున్నారు. ఆ పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలోని కొత్తపేట అసెంబ్లీ స్థానం నుంచి వైఎస్సార్సీపీకి చెందిన చిర్ల జగ్గిరెడ్డి ప్రాతినిధ్యం వహిస్తుండగా, మిగిలిన ఆరు స్థానాల నుంచీ టీడీపీ ఎమ్మెల్యేలే ఉన్నారు. మండపేట, రామచంద్రపురం, ముమ్మిడివరం ఎమ్మెల్యేలు వేగుళ్ల జోగేశ్వరరావు, తోట త్రిమూర్తులు, దాట్ల బుచ్చిబాబులకు, ఎంపీ పండులకూ మధ్య సఖ్యతే ఉంది. పి.గన్నవరం ఎమ్మెల్యే పులపర్తి నారాయణమూర్తికీ, పండులకూ నడుమ సఖ్యత లేకున్నా పొరపొచ్చాలూ లేవు. టిక్కెట్ నాటి నుంచే.. ఇక అమలాపురం ఎమ్మెల్యే అయితాబత్తుల, రాజోలు ఎమ్మెల్యే గొల్లపల్లిలకూ, పండులకూ మధ్య వ్యవహారం ఉప్పునిప్పుగా మారింది. పలుదఫాలు ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేసిన గొల్లపల్లికి పార్లమెంట్‌కు వెళ్లాలనేది చిరకాల కల. ఇందుకు తగ్గట్టే.. ఎన్నికలకు ఏడాది ముందే చంద్రబాబు ‘వస్తున్నా మీ కోసం’ యాత్రలో అమలాపురం పార్లమెంటరీ అభ్యర్థిగా గొల్లపల్లిని ప్రకటించారు. అరుుతే ఎన్నికలు సరిగ్గా 20 రోజులు ఉన్నాయనగా కార్పోరేట్ లాబీరుుంగ్ కారణంగా ఎంపీ టిక్కెట్ పండులకు దక్కింది. అప్పటి నుంచీ పండులపై గొల్లపల్లి వ్యతిరేకతతోనే ఉన్నారు. దానికి తోడు ఎమ్మెల్యేకు సమాచారం ఇవ్వకుండా రాజోలు నియోజకవర్గంలో ఎంపీ పండుల పెత్తనం చేస్తున్నారంటూ గత నెలలో మలికిపురంలో ఒక వివాహ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన ఆయనను సఖినేటిపల్లి మండలానికి టీడీపీ నాయకులు గొల్లపల్లి సమక్షంలోనే నిలదీశారు. దీనితో ఎంపీ అక్కడ నుంచి వెనుదిరిగారు. తాజాగా ఇలాంటి విషయంపైనే అమలాపురం ఎమ్మెల్యే అరుుతాబత్తులకు, ఎంపీ పండులకు మధ్య వివాదం చోటు చేసుకుంది. ఎంపీ తమను పట్టించుకోకుండా అమలాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో తిరుగుతున్నారని అయితాబత్తుల అనుచరుల ఆరోపణ. కాగా ఇటీవల ఓడలరేవులో ఓఎన్జీసీ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి ఎంపీని పిలవకుండా ఆనందరావు నిర్వహించడంపై ఎంపీ అనుచరులు మండిపడుతున్నారు. వీరి మధ్య విభేదాలు పెరిగిపోవడంతో ఉపముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. అమలాపురంలో ఆదివారం ఎంపీ రవీంద్రబాబు, ఎమ్మెల్యే ఆనందరావులను కూర్చోబెట్టి సఖ్యత కుదిర్చేందుకు ప్రయత్నించినా పెద్దగా ఫలితానివ్వలేదని సమాచారం. కొత్తపేట ‘దేశం’ నేతలకూ కలహమే.. పండులకు కొత్తపేట నియోజకవర్గానికి చెందిన ఎమ్మెల్సీ రెడ్డి సుబ్రహ్మణ్యం, టీడీపీ ఇన్చార్జి బండారు సత్యానందరావులతో సైతం ఇవే విషయాల్లో విభేదాలు ఉండడం గమనార్హం. ప్రోటోకాల్ విషయంలో ఎమ్మెల్యే జగ్గిరెడ్డిని అవమానించినందుకు సొంతపార్టీ నేతలను ఎంపీ బహిరంగంగా తప్పుపట్టిన నాటి నుంచీ వీరి మధ్య సంబంధాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. విభేదాల కారణంగా పార్టీ పరువు బజారున పడుతోందని, ఇప్పటికైనా పార్టీ పెద్దలు కలగజేసుకుని ఎంపీకి, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు మధ్య సయోధ్య కుదర్చాలని పార్టీ శ్రేణులు కోరుకుంటున్నాయి.