సాక్షి, తాడేపల్లి: ప్రశాంతంగా ఉన్న విజయవాడలో ప్రతిపక్ష నేత చంద్రబాబు.. అశాంతి సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఆదివారం మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్రానికి పట్టిన చీడపురుగుగా ఆయన చంద్రబాబును అభివర్ణించారు. దొంగల ముఠా అంతా ఏకమై ఇప్పుడు నీతిసూత్రాలు చెబుతున్నారని దుయ్యబట్టారు. చంద్రబాబు దుర్మార్గం గురించి ఆ పార్టీ నేతలే నిజాలు కక్కారని.. బోండా ఉమ, బుద్దా వెంకన్న, నాగుల్ మీరా ఆరోపణలకు సమాధానం చెప్పాలని మంత్రి డిమాండ్ చేశారు. చంద్రబాబు ఎన్ని ప్రలోభాలు పెట్టినా ఉపయోగం లేదని.. ప్రాంతానికో మాట మాట్లాడుతున్న ఆయనను ప్రజలు నమ్మరన్నారు.
‘‘దుర్గ గుడి ఫ్లైఓవర్ నిర్మించలేకపోయిన అసమర్థుడు చంద్రబాబు. అధికారంలో ఉండగా పన్నులు పెంచి.. ఇప్పడు తగ్గిస్తానంటే ప్రజలు నమ్మరు. ఒక ఎంపీని కంట్రోల్ చేయలేని చంద్రబాబు ఒక నాయకుడా?. ఏపీలో టీడీపీ జమానా ముగిసింది. పగటికలలతో సరిపెట్టుకోక తప్పదు. ఫ్యాన్ హవా ముందు పంచర్ అయిన సైకిల్ నిలువలేదని’’ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ విమర్శలు గుప్పించారు.
జగన్ పాలనలో సంక్షేమం: ఎమ్మెల్యే మేరుగ
విశాఖ: చంద్రబాబు పాలనలో దళితులపై దాడులు చూశామని.. వైఎస్ జగన్ పాలనలో సంక్షేమ పథకాలు చూస్తున్నామని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే మేరుగ నాగార్జున అన్నారు. కులం, మతం, పార్టీలకతీతంగా సంక్షేమ పథకాలు అందుతున్నాయని.. ఇచ్చిన హామీలతో పాటు ఇవ్వని హామీలను సీఎం అమలు చేస్తున్నారన్నారు. విశాఖ ప్రజలు చంద్రబాబును నమ్మే పరిస్థితి లేదన్నారు. స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్రధానికి సీఎం లేఖ రాశారని పేర్కొన్నారు. పంచాయతీ ఎన్నికల్లో 82 శాతం ప్రజలు సీఎం జగన్‌కు పట్టం కట్టారని.. ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల్లోనూ అదే రిపీట్ అవుతుందని మేరుగ నాగార్జున ధీమా వ్యక్తం చేస్తున్నారు.
పచ్చని పంట పొలాలను నాశనం చేశారు: పండుల రవీంద్రబాబు
విశాఖకు పరిపాలన రాజధాని కావాల్సిన అన్ని హంగులు ఉన్నాయని రవీంద్రబాబు అన్నారు. చంద్రబాబు తన సామాజిక వర్గం కోసం అమరావతిని రాజధానిగా ప్రకటించారన్నారు. పచ్చని పంట పొలాలను చంద్రబాబు నాశనం చేశారని ఆయన ధ్వజమెత్తారు.
చదవండి:
'రాసలీలలు చేసే లోకేష్‌కు విమర్శించే హక్కు లేదు'
ఇక టీడీపీ చాప్టర్ క్లోజ్: విజయసాయిరెడ్డి
Comments
Please login to add a commentAdd a comment