సాక్షి,తాడేపల్లి: వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తన హాయంలో విద్యారంగంలో ఎన్నో సంస్కరణలు తెచ్చారని, మధ్యాహ్న భోజనం దగ్గర్నుంచి స్కూళ్ల బాగు వరకు అన్నిటినీ అభివృద్ధి చేశారని మాజీ మంత్రి మేరుగ నాగార్జున గుర్తుచేశారు.తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యాలయంలో శనివారం(డిసెంబర్7) మేరుగ నాగార్జున మీడియాతో మాట్లాడారు.
‘45 వేలకు పైగా స్కూళ్లను నాడునేడు కింద వైఎస్ జగన్ బాగు చేశారు. చంద్రబాబు వచ్చాక ఇంగ్లీషు మీడియం,ట్యాబులు,మంచి మధ్యాహ్న భోజనం ఇలా అన్నిటినీ దూరం చేశారు.ఇవన్నీ బాగుచేయడం వదిలేసి ఇప్పుడు విద్యా మీట్ పెడతారంట.అది విద్యా మీట్ కాదు.దగా మీట్. విద్యారంగంలో వైఎస్ జగన్ తెచ్చిన సంస్కరణలను నిలిపేసి ఏం చేయదలచుకున్నారు?
రూ.3,900 కోట్ల బకాయిల గురించి మాట్లాడకుండా ఈ విద్యామీట్‌లు ఎందుకు పెడుతున్నారు?జగన్ ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లీషు మీడియం పెడితే చంద్రబాబు కోర్టుకు వెళ్లి అడ్డుకున్నారు.చంద్రబాబు ప్రభుత్వపు కుట్రలకు విద్యారంగం పూర్తిగా నాశనం అయింది.ఉన్నత విద్యామండలిలో కూడా దారుణాలు జరుగుతున్నాయి.
ఇరవై మంది వైస్ ఛాన్సిలర్లను బెదిరించి రాజీనామాలు చేయించారు.ఇప్పటికీ కొత్తగా ఎవరినీ నియమించలేదు.దీన్నిబట్టే విద్యారంగంపై ఈ ప్రభుత్వానికి ఎంత వ్యతిరేకత ఉందో అర్థం చేసుకోవచ్చు.విద్యారంగాన్ని కూటమి ప్రభుత్వం సర్వనాశనం చేసింది.రూ.72వేల కోట్లు కేటాయించి విద్యారంగంలో వైఎస్ జగన్ పెద్దఎత్తున సంస్కరణలు తీసుకొచ్చారు.అంతకుమించి చేయాలనుకుంటే చంద్రబాబు కూడా అభివృద్ధి చేయాలి. అంతేకానీ విద్యా రంగాన్ని నాశనం చేయొద్దు’అని మేరుగ నాగార్జున అన్నారు.
ఇదీ చదవండి: బాబూ ఒక్కో రైతుకు రూ.20 వేల ఆర్థిక సాయం ఏమైంది..?
Comments
Please login to add a commentAdd a comment