
సాక్షి, అంబాజీపేట : ఎంపీ పదవికి రాజీనామా చేసి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన పండుల రవీంద్రబాబుకు న్యాయం చేస్తామని వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి హామీ ఇచ్చారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన ఆదివారం రాత్రి అంబాజీపేట బహిరంగ సభలో మాట్లాడారు. పార్టీ అధికారంలోకి రాగానే రవీంద్ర బాబును గుండెల్లో పెట్టుకుంటామని, తూర్పు గోదావరి జిల్లా నుంచి తొలి ఎమ‍్మెల్సీగా అవకాశం కల్పిస్తామని వైఎస్ జగన్ ప్రకటించారు. అమలాపురం లోక్‌సభ అభ్యర్థి అనురాధ, పి.గన్నవరం ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న కొండేటి చిట్టిబాబుని ఆశీర్వదించి, వైఎస్సార్ సీపీని గెలిపించాలని వైఎస్ జగన్ ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు.
వైఎస్సార్ సీపీలో చేరిన వరుపుల సుబ్బారావు
ప్రత్తిపాడు ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావు ఆదివారం పి.గన్నవరంలో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో పార్టీలో చేరారు. వరుపులతో పాటు ఆయన తనయుడు సూరిబాబు, అంబాజీపేట మార్కెట్ కమిటీ ఛైర్మన్ రామకృష్ణనాయుడు కూడా పార్టీ కండువా కప్పుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment