
విశాఖపట్నంలో విలేకరులతో మాట్లాడుతున్న రవీంద్రబాబు
సాక్షి, విశాఖపట్నం: హైదరాబాద్ శివారు శంకరాపల్లిలో ఎకరం రూ.2 కోట్ల విలువైన భూమిని రూ.4 లక్షలకే ఎలా కొన్నారో విశాఖ జనసేన ఎంపీ అభ్యర్థి జేడీ లక్ష్మీనారాయణ ప్రజలకు చెప్పాలని వైఎస్సార్‌సీపీ నేత, అమలాపురం ఎంపీ రవీంద్రబాబు డిమాండ్ చేశారు. విశాఖలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. పేద వ్యవసాయ కుటుంబంలో జన్మించానని చెప్పే లక్ష్మీనారాయణ ఆరున్నర కోట్లు మొబిలెసెట్స్‌గా చూపిస్తున్నారని, ముంబైలో రూ.5 కోట్లకు ఫ్లాట్ అమ్మినట్లుగా అఫిడవిట్‌లో సమర్పించారని తెలిపారు.
ఉద్యోగం తప్ప ఏ ఆధారం లేదని చెప్పుకునే ఆయనకు ఏడాదికి రూ.20 లక్షలకు మించి ఆదాయం రాదని, కేవలం క్వీడ్‌ప్రోకోలో జరిగిన అగ్రిమెంట్‌తోనే రూ.ఆరున్నర కోట్లు మొబిలెసెట్స్‌గా తీసుకొచ్చి దాన్ని తెల్లధనంగా మార్పుచేసి హైదరాబాద్ శివారులో శంకరాపల్లిలో భూమి కొన్నారని ఆరోపించారు. కులాలకతీతంగా పనిచేస్తానని నీతులు చెబుతున్న లక్ష్మీనారాయణ మహారాష్ట్రలో పనిచేస్తూ అంబేడ్కర్‌ను ఏనాడైనా కొలిచారా అని ప్రశ్నించారు. పేద ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచి ప్రజల కోసం పాటుపడి, సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిన ఘనత ఒక్క వైఎస్సార్‌కే సాధ్యమైందని చెప్పారు. సమావేశంలో పార్టీ అదనపు కార్యదర్శి రవిరెడ్డి, పార్టీ అనుబంధ సంఘాల అధ్యక్షులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment