సాక్షి, కాకినాడ(తూర్పు గోదావరి): పరీక్షలు రద్దయ్యాయని ఆనంద పడటం తప్ప టీడీపీ నేత లోకేశ్‌కు మరొకటి తెలియదని ఎమ్మెల్సీ పండుల రవీంద్రబాబు విమర్శించారు. పెద్ద పెద్ద పదజాలలు వాడి పరీక్షలకే మీరు పరీక్ష కాకండి అంటూ ఎద్దేవా చేశారు. కోవిడ్ వంకతో విద్యార్థుల పరీక్షలపై రాజకీయాలు మాట్లాడటం లోకేశ్‌కు తగదని హితవు పలికారు. శుక్రవారం పండుల రవీంద్ర బాబు మాట్లాడుతూ.. ‘‘పరీక్షలంటే లోకేశ్‌కు అర్థం తెలుసా? మీరు పరీక్షలు కరెక్టుగా రాసి పాసయ్యారా? చదువుకున్న వారికే పరీక్షల నిర్వహణ వెనుక అర్థం తెలుస్తుంది. పరీక్షలు రద్దయ్యాయని సంతోషించడం తప్ప ఇంకేమైనా తెలుసా మీకు.
కరోనా పేరిట పరీక్షల గురించి రాజకీయాలు చేయడం సరికాదు. పరీక్షల నిర్వహణ అనేది విద్యార్ధుల చదువుకు ఒక అర్థాన్నిస్తుంది. చదువుకున్న విద్యార్ధులకు పరీక్షలంటే ఒక కిక్కు. ఒక బాధ్యత గల ముఖ్యమంత్రిగా, చదువుకున్న వ్యక్తిగా.. పరీక్షలు నిర్వహించాలన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆలోచన గొప్పది. కానీ కోవిడ్ వల్ల పరీక్షలు రద్దు చేయాల్సిరావడం చాలా దురదృష్టకరం’’ అని పేర్కొన్నారు. కాగా సుప్రీంకోర్టు నిర్దేశించిన జూలై 31 లోగా టెన్త్, ఇంటర్ పరీక్షల నిర్వహణ, ఫలితాల వెల్లడి సాధ్యం కాదని, అందుకని పరీక్షలను రద్దుచేస్తున్నామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ ప్రకటించిన విషయం తెలిసిందే.
చదవండి: ఏపీ ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రశంసించిన సుప్రీంకోర్టు
ఏపీలో టెన్త్, ఇంటర్ పరీక్షలు రద్దు
Comments
Please login to add a commentAdd a comment