
నూజివీడు: లోఫర్ లోకేశ్ అని తానూ అనగలనని, అయితే అలా మాట్లాడే వ్యక్తిత్వం తనది కాదని, ఎందుకంటే తనకు సంస్కారం ఉందని స్థానిక వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప్ అప్పారావు నారా లోకేశ్‌పై మండిపడ్డారు. ఏలూరు జిల్లా ముసునూరులో నిర్వహించిన రచ్చబండ కార్యక్రమంలో తన కుమారుడిని కేటుగాడని అనడంపై ఆదివారం ఎమ్మెల్యే విలేకర్ల సమావేశం నిర్వహించి లోకేశ్ తీరుపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తంచేశారు.
దమ్ముంటే నూజివీడు సెంటర్‌కొచ్చి కేటుగాడని మాట్లాడతావా అని సవాల్ చేశారు. తాను మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచానని, నిన్ను ఎన్నికల్లో పోటీచేసిన తొలిసారే ప్రజలు తన్ని తరిమేశారన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని చెప్పారు. నిజానిజాలు తెలుసుకోకుండా నోటికొచ్చినట్లు మాట్లాడితే ప్రజలే బుద్ధిచెబుతారన్నారు. నూజివీడు వచ్చి రౌడీయిజం చేయాలని ప్రయత్నించినా, ప్రోత్సహించినా ఉక్కుపాదంతో అణిచివేస్తామని ఎమ్మెల్యే హెచ్చరించారు.
లోకేశ్ పాదయాత్ర అట్టర్ ఫ్లాప్
లోకేశ్ యువగళం పేరుతో నిర్వహించిన పాదయాత్ర నూజివీడు నియోజకవర్గంలో అట్టర్‌ఫ్లాప్ అయిందని ఎమ్మెల్యే మేకా ప్రతాప్ చెప్పారు. కనీసం వెయ్యి మంది కూడా లోకేశ్ వెంట నడవలేదని ఎద్దేవా చేశారు. ఇక నియోజకవర్గంలో ఇసుకను దోచుకున్నది, నీరు–మట్టి పథకంలో మట్టిని దోచుకున్నదీ ఎవరో కూడా నియోజకవర్గ ప్రజలకు తెలుసన్నారు. భూకబ్జాలంటూ చెబుతున్నారని, ఎక్కడ భూకబ్జా చేస్తున్నానో చూపిస్తే అదే భూమిని చంద్రబాబుకు, లోకేశ్‌కు, ముద్దరబోయిన వెంకటేశ్వరరావుకు రాసిస్తానన్నారు.
ఇక మాగంటి బాబు సినిమాల్లో నటిస్తే బెటరని, బాగా రాణిస్తారని ఎమ్మెల్యే ప్రతాప్ ఎద్దేవా చేశారు. శనివారపుపేట నుంచి బ్లేడ్ బ్యాచ్‌ను తీసుకొచ్చారని అంటున్నారని, రాష్ట్రంలో బ్లేడ్‌బ్యాచ్‌ల అడ్రస్‌లు, పేకాట క్లబ్‌లు, లిక్కర్ మాఫియా అడ్రస్‌లు మాగంటి బాబుకు తెలిసినంతగా మరెవరికీ తెలియవన్నారు. లోకేశ్ రాజకీయాలకు పనికిరాడని, టీడీపీ ఇక అధికారంలోకి రాదని మేకా ప్రతాప్ చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment