meka venkata pratap apparao
-
ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప్ అప్పారావు మాటలకి సీఎం జగన్ ఫిదా
-
లోఫర్ లోకేశ్.. అని నేననగలను..
నూజివీడు: లోఫర్ లోకేశ్ అని తానూ అనగలనని, అయితే అలా మాట్లాడే వ్యక్తిత్వం తనది కాదని, ఎందుకంటే తనకు సంస్కారం ఉందని స్థానిక వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప్ అప్పారావు నారా లోకేశ్‌పై మండిపడ్డారు. ఏలూరు జిల్లా ముసునూరులో నిర్వహించిన రచ్చబండ కార్యక్రమంలో తన కుమారుడిని కేటుగాడని అనడంపై ఆదివారం ఎమ్మెల్యే విలేకర్ల సమావేశం నిర్వహించి లోకేశ్ తీరుపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తంచేశారు. దమ్ముంటే నూజివీడు సెంటర్‌కొచ్చి కేటుగాడని మాట్లాడతావా అని సవాల్ చేశారు. తాను మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచానని, నిన్ను ఎన్నికల్లో పోటీచేసిన తొలిసారే ప్రజలు తన్ని తరిమేశారన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని చెప్పారు. నిజానిజాలు తెలుసుకోకుండా నోటికొచ్చినట్లు మాట్లాడితే ప్రజలే బుద్ధిచెబుతారన్నారు. నూజివీడు వచ్చి రౌడీయిజం చేయాలని ప్రయత్నించినా, ప్రోత్సహించినా ఉక్కుపాదంతో అణిచివేస్తామని ఎమ్మెల్యే హెచ్చరించారు. లోకేశ్ పాదయాత్ర అట్టర్ ఫ్లాప్ లోకేశ్ యువగళం పేరుతో నిర్వహించిన పాదయాత్ర నూజివీడు నియోజకవర్గంలో అట్టర్‌ఫ్లాప్ అయిందని ఎమ్మెల్యే మేకా ప్రతాప్ చెప్పారు. కనీసం వెయ్యి మంది కూడా లోకేశ్ వెంట నడవలేదని ఎద్దేవా చేశారు. ఇక నియోజకవర్గంలో ఇసుకను దోచుకున్నది, నీరు–మట్టి పథకంలో మట్టిని దోచుకున్నదీ ఎవరో కూడా నియోజకవర్గ ప్రజలకు తెలుసన్నారు. భూకబ్జాలంటూ చెబుతున్నారని, ఎక్కడ భూకబ్జా చేస్తున్నానో చూపిస్తే అదే భూమిని చంద్రబాబుకు, లోకేశ్‌కు, ముద్దరబోయిన వెంకటేశ్వరరావుకు రాసిస్తానన్నారు. ఇక మాగంటి బాబు సినిమాల్లో నటిస్తే బెటరని, బాగా రాణిస్తారని ఎమ్మెల్యే ప్రతాప్ ఎద్దేవా చేశారు. శనివారపుపేట నుంచి బ్లేడ్ బ్యాచ్‌ను తీసుకొచ్చారని అంటున్నారని, రాష్ట్రంలో బ్లేడ్‌బ్యాచ్‌ల అడ్రస్‌లు, పేకాట క్లబ్‌లు, లిక్కర్ మాఫియా అడ్రస్‌లు మాగంటి బాబుకు తెలిసినంతగా మరెవరికీ తెలియవన్నారు. లోకేశ్ రాజకీయాలకు పనికిరాడని, టీడీపీ ఇక అధికారంలోకి రాదని మేకా ప్రతాప్ చెప్పారు. -
‘నూజివీడు సీఐ, ఎస్ఐలపై చర్యలు తీసుకోవాలి’
సాక్షి, నూజివీడు: పట్టణంలో పోలీసులు టీడీపీ కార్యకర్తల్లా వ్యవహరిస్తున్నారని వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి జోగి రమేశ్ ఆరోపించారు. శనివారం పురపాలక సంఘం చేపట్టిన సిమెంట్ రోడ్డు ప్రారంభోవత్సవానికి వెళ్లిన ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప్ అప్పారావ్‌కు టీడీపీ నేతలు అడ్డుతగిలి, వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నా పోలీసులు పట్టించుకోకపోవడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం నూజివీడులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో శాంతి భద్రతలను కాపాడాల్సిన పోలీసులు.. టీడీపీ కార్యకర్తల్లా పనిచేస్తున్నారని తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఒక ప్రజా ప్రతినిధికి రక్షణ కల్పించకపోగా.. ప్రత్యర్థులను రెచ్చగొట్టే విధంగా మాట్లాడిన సీఐ, ఎస్ఐలపై చర్యలు తీసుకోవాల్సిందిగా వైఎస్సార్ సీపీ తరఫున డీజీపీకి ఫిర్యాదు చేస్తామని తెలిపారు. నూజివీడు సీఐ, ఎస్ఐలను వెంటనే సస్పెండ్ చెయ్యాలని డిమాండ్ చేశారు. వెంకట ప్రతాప్ అప్పారావు మాట్లాడుతూ.. 18వ వార్డులో పోలీసులు వ్యవహరించిన తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 10 మంది ఆందోళన కారులను అడ్డుకోలేక.. అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవానికి వెళ్లిన తనను పర్మిషన్ పేరుతో పోలీసులు గంటకు పైగా రోడ్డుపై నిలబెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదంతా నూజివీడు సీఐ పథకం ప్రకారమే చేశారని మండిపడ్డారు. భవిష్యత్‌లో తనకేదయినా ప్రాణహాని జరిగితే ఇప్పుడున్న సీఐ బాధ్యత వహించాలన్నారు. ఉన్నతాధికారులు నూజివీడు సీఐ, ఎస్ఐలను బదిలీ చెయ్యాలని కోరారు. చదవండి: నూజివీడులో ‘టీడీపీ’ హైడ్రామా -
ఈ అన్నం, పులిహోర ఎవరైనా తింటారా!
కృష్ణా, నూజివీడు:‘‘పులిహోర...అన్నం తినలేకపోతున్నాం.. సుద్దలాగా అవుతోంది.. ఐదు రోజులుగా భోజనం సరిగా తినడం లేదు...’’అంటూ పట్టణంలోని సాంఘికసంక్షేమశాఖ ఆధ్వర్యంలోని కళాశాల బాలికల వసతిగృహం విద్యార్థినిలు ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప్ అప్పారావు వద్ద ఆవేదన వ్యక్తంచేశారు. ప్రత్యేక హోదా కోరుతూ వైఎస్సార్ సీపీ చేపట్టిన బంద్‌లో భాగంగా మంగళవారం పట్టణంలోని మడుపల్లి తాతయ్య ప్రభుత్వ జూనియర్ కళాశాల వద్దకు ఎమ్మెల్యే ప్రతాప్తోపాటు వైఎస్సార్సీపీ నాయకులు వెళ్లారు. విద్యార్థినులు బయటకు వచ్చి తమ బాక్స్‌లను తెరిచి అన్నం, పులిహోర ఎమ్మెల్యేకి చూపించారు. బంద్ నిర్వహిస్తున్నామని, ఒక గంటలో నేను హాస్టల్‌కు వస్తానని చెప్పి ఎమ్మెల్యే వెళ్లారు. ఆ తర్వాత హాస్టల్‌కు వెళ్లి ఆహారం పరిశీలించారు. ఈ అన్నం, పులిహోర మనుషులు ఎవరైనా తింటారా అంటూ మ్యాట్రిన్ నిర్మలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్ఎఫ్ఐ నాయకులు అక్కడి చేరుకుని విద్యార్థినులతో హాస్టల్ బయట ధర్నాకు దిగారు. తహసీల్దార్ గుడిశే విక్టర్‌బాబు, ఏఎస్‌డబ్ల్యూవో వినుకొండమ్మ, సాంఘిక సంక్షేమశాఖ జిల్లా జేడీ ప్రసాద్‌లు హాస్టల్ వద్దకు చేరుకున్నారు. హాస్టల్లోని పరిస్థితులను ఎమ్మెల్యే ప్రతా ప్ వారి దృష్టికి తీసుకువచ్చారు. మరుగుదొడ్ల విషయం ఈనెలలో జరిగిన జెడ్పీ సమావేశంలో ప్రస్తావించామని, వాటిని వెంటనే పూర్తిచేయమని కలెక్టర్ చెప్పినా ఇంతవరకు పూర్తిచేయలేదన్నారు. మెనూ అమలుచేయకపోతే ఫోన్ చేయండి వసతిగృహంలో మెనూ అమలుచేయకపోతే వెంటనే తనకు ఫోన్ చేసి చెప్పాలని ఎమ్మెల్యే ప్రతాప్ అప్పారావు బాలికలకు సూచించారు. దాదాపు 300మంది ఉన్నందున రెండో హాస్టల్ ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపుతానన్నారు. హాస్టల్లో ఈరోజు సాయంత్రం నుంచే టీవీని ఏర్పాటు చేయిస్తానని ఎమ్మెల్యే చెప్పారు. పర్మినెంట్ కుక్‌లు లేనందున పట్టణంలోని ఇంటిగ్రేటెడ్ హాస్టల్లో ఉన్న వారిలో ఇద్దరిని పంపుతున్నట్లు జేడీ తెలిపారు. తహసీల్దారు గుడిశే విక్టర్‌బాబు, వైఎస్సార్ సీపీ పట్టణ అధ్యక్షుడు పగడాల సత్యనారాయణలు చెరొక బియ్యం బస్తాలను, కూరగాయలు తెప్పించి విద్యార్థినులకు భోజనం వండించి పెట్టారు. వైఎస్సార్సీపీ నాయకులు బసవా భాస్కరరావు, రామిశెట్టి మురళీకృష్ణ, కౌన్సిలర్లు కంచర్ల లవకుమార్, శీలం రాము, వైఎస్సార్సీపీ నూజివీడు మండల అధ్యక్షులు మందాడ నాగేశ్వరరావు, సీపీఎం నాయకులు జీ రాజు, ఎస్ఎఫ్ఐ నాయకులు లెనిన్, రాజేష్ తదితరులు పాల్గొన్నారు. -
ప్రలోభాలకు లొంగే వ్యక్తిని కాను
సాక్షి, మల్లిబోయినపల్లి(ఆగిరిపల్లి): తాను అధికార తెలుగుదేశం పార్టీ ప్రలోభాలకు లొంగి వైఎస్సార్సీపీని వీడే వ్యక్తిని కాదని కృష్ణా జిల్లా నూజివీడు ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప్ అప్పారావు స్పష్టం చేశారు. ఆయన బుధవారం ఆగిరిపల్లి మండలంలో రచ్చబండ కార్యక్రమానికి హాజరయ్యారు. తాను పార్టీ మారుతున్నట్లు సోషల్ మీడియాలో సాగుతున్న ఊహాగానాలకు తెరదించారు. తాను వైఎస్ రాజశేఖరరెడ్డి శిష్యుడినని, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నియోజకవర్గంలో ఎన్నో అభివృద్ధి పనులు చేశామని చెప్పారు. వైఎస్సార్ తనయుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి స్థాపించిన వైఎస్సార్సీపీలో జిల్లాలో తానే మొదట చేరారని గుర్తు చేశారు. తాను ప్రలోభాలకు లొంగి వేరే పార్టీలోకి వెళ్తున్నట్లు ఎవరో అనామకులు సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారని, వారు తన వద్దకు వస్తే వివరణ ఇస్తానని పేర్కొన్నారు. ప్రలోభాలకు లొంగాల్సిన అవసరం తనకు లేదన్నారు. తాను వైఎస్ జగన్‌ని కలుసుకునేందుకు ఏనాడు గంటల తరబడి వేచి చూడాల్సిన అవసరం ఏర్పడలేదన్నారు. తాను పార్టీ మారుతున్నట్లు జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని ఉద్ఘాటించారు. ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి పదవులకు ఆశపడి పార్టీ మారడం దారుణమని విమర్శించారు. -
మేకా ప్రతాప్ సతీమణికి వైఎస్ జగన్ ఘననివాళి
నూజివీడు(కృష్ణాజిల్లా): నూజివీడు ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప్ అప్పారావు సతీమణి సుజాతాదేవి పార్థివదేహానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఘనంగా నివాళులు అర్పించారు. ఆమె మృతదేహంపై పుష్పగుచ్చం ఉంచి అంజలి ఘటించారు. మేకా ప్రతాప్‌తో పాటు ఆయన కుటుంబ సభ్యులను వైఎస్ జగన్ ఓదార్చారు. ఉదయం గన్నవరం విమానాశ్రాయానికి చేరుకున్న వైఎస్ జగన్ అక్కడ నుంచి నూజివీడుకు బయలుదేరారు. మార్గం మధ్యలో రామవరప్పాడు బాధితులతో వైఎస్ జగన్ మాట్లాడారు. పేదలకు వైఎస్సార్ సీపీ అండగా ఉంటుందని ఆయన బాధితులకు హామీ ఇచ్చారు. వైఎస్ జగన్ వెంట జిల్లా ఎమ్మెల్యేలు, వైఎస్సార్ సీపీ నాయకులు ఉన్నారు. గన్నవరం విమానాశ్రయంలో వైఎస్ జగన్‌కు పార్టీ కార్యకర్తలు, నాయకులు ఘన స్వాగతం పలికారు.