తెలుగువారి గౌరవాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దేశ స్థాయిలో పరువు తీస్తున్నారని వైఎస్సార్‌సీపీ నేత, అమలాపురం ఎంపీ పండుల రవీంద్రబాబు విమర్శించారు. ఓడిపోతామని భయంతో చంద్రబాబు రకరకాల వేషాలు వేస్తూ ఢిల్లీ చుట్టూ తిరుగుతున్నారని ఆరోపించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎగ్జిట్ పోల్స్ అంచనాలు టీడీపీని రాజకీయాల నుంచి ఎగ్జిట్ అయ్యేలా చేశాయని ఎద్దేవా చేశారు. 2024 కల్లా టీడీపీ ముక్కలైపోతుందని తెలిసి చంద్రబాబు నాయుడు జాతీయ నేతలను డిస్ట్రబ్ చేస్తున్నారని ఆరోపించారు.