
సాక్షి, పశ్చిమగోదావరి : ఎస్సీలపై దాడులు చేసిన ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ని చూసి నేర్చుకోమని చంద్రబాబు నాయుడు చెప్పడం హస్యాస్పదంగా ఉందన్నారు ఎంపీ పందుల రవీంద్ర బాబు. శనివారమిక్కడ ఎన్నికల ప్రచారంలో ప్రసంగిస్తూ.. చింతమనేని ప్రభాకర్ ఎస్సీలపై దాడి చేసిన వ్యవహారం పార్లమెంట్‌లోనూ చర్చకు వచ్చిందని తెలిపారు. ప్రశాంత దెందులూరు నియోజకవర్గాన్ని కులాలు, కుమ్ములాటలతో వివాదాస్పదంగా మార్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
భూకబ్జాలు, దోపిడీ, అవినీతి ఆరాచకాల్లో దెందులూరు నియోజకవర్గం రాష్ట్రంలోనే మొదటి స్థానంలో ఉందని తెలిపారు. నియోజకవర్గాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజలపైనే ఉందని స్పష్టం చేశారు. జగనన్నను ముఖ్యమంత్రిగా.. అబ్బయ్య చౌదరిని ఎమ్మెల్యేగా గెలిపిస్తే మంచి పాలన అందిస్తారని హామీ ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment