
సాక్షి, కాకినాడ : దళిత కులాల మధ్య చంద్రబాబు నాయుడు పెట్టిన చిచ్చు ఇప్పటికీ రగులుతూనే ఉందని అమలాపురం మాజీ ఎంపీ పండుల రవీంద్ర బాబు అన్నారు. కుల రాజకీయంలో చంద్రబాబు దిట్ట ఎద్దేవా చేశారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీ స్వార్థ రాజకీయాలకు కోసం దళిత ఉద్యోగులను బలి చేస్తోందని మండిపడ్డారు. డాక్టర్ సుధాకర్ మద్యానికి బానిసై మానసిక రోగంతో బాధపడుతున్నాడని, అందుకే రహదారులపై బట్టలు విప్పుకుని పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారని ఆరోపించారు. (చదవండి : అనస్థీషియా వైద్యుడి వీరంగం)
అటువంటి వ్యక్తి రహదారిపై తిరుగుతూ తన ప్రాణాలకు ముప్పు తెచ్చుకోవడం కాకుండా ప్రజలకు కూడా ఇబ్బంది కలిగిస్తున్న నేపథ్యంలో భద్రత కోసం పోలీసులు పట్టుకొని అదుపులోకి తీసుకున్నారని చెప్పారు. దయచేసి అతన్ని వెంటనే మానసిక ఆస్పత్రిలో చెర్పించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. డాక్టర్ సుధాకర్ చాలా కాలంగా టీడీపీ టికెట్ కోసం ప్రయత్నం చేశాడని, చంద్రబాబు మోసం చేడయంతో మతి భ్రమించి చివరకు పిచ్చివాడిలా మిగిలిపోయాడని అన్నారు. ఇకనైనా టీడీపీ నేతలు స్వార్థం కోసం దళిత నేతలను బలి చేయొద్దని కోరారు. సీఎం జగన్ ప్రభుత్వంపై మీద దళితులకు పూర్తి నమ్మకం ఉందని రవీంద్రబాబు అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment