
సాక్షి, అమరావతి : వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి ట్విటర్ వేదికగా ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడుపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. మంగళవారం ఆయన స్పందిస్తూ.. ‘‘ సగం రాష్ట్రానికి తాగు, సాగు నీరందించే పోతిరెడ్డిపాడు గురించి నోరు మెదపడు. ఎవరో సస్పెండైన డాక్టరు తాగి రోడ్డుమీద చిందులేస్తే ఒకటే ట్వీట్లు పెడుతున్నాడు. ప్యాకేజీ తీసుకుని పనిచేసే జీతగాళ్లను కూడా ఎగదోస్తున్నాడు. వ్యక్తుల ప్రయోజనాలు తప్ప రాష్ట్రం గురించి పట్టదా చంద్రబాబూ?’’
‘‘కరోనా మనతోటే ఉంటుంది కాబట్టి 65 ఏళ్లు దాటినోళ్లు బయటకు రావద్దని కేసీఆర్ గారు కూడా చెప్పారు. జాగ్రత్త బాబూ! నీకు 71 ఏళ్లు అని వైరస్ ఇట్టే పసిగడ్తుంది. 40 ఇయర్స్ ఇండస్ట్రీ, 14 సంవత్సరాలు సీఎం, ప్రతిపక్ష నేతగా పదకొండేళ్లు లాంటివి కరోనాకు అర్థం కావు’’ అంటూ మండిపడ్డారు. (‘కుటుంబానికో గుడ్డు కూడా రాదు కదా బాబూ’)
అంతకు క్రితం డాక్టర్ సుధాకర్ విషయంలో కొందరు నాయకులు, కొన్ని టీవీ ఛానళ్లు వ్యవహరిస్తున్న తీరును ఆయన తప్పుబట్టారు. “ఎస్సీ కులాల్లో పుట్టాలని ఎవరన్నా అనుకుంటారా.. “అని బాబు మాట్లాడిన రోజున నోరెత్తని నాయకులు, టీవీ ఛానళ్ళు ఇప్పుడు చేస్తున్న యాగి చూస్తున్నారు కదా..! బాబు, లోకేష్ నాయుడు, రాధాకృష్ణ, నారాయణ... వీరా దళితుల గురించి మాట్లాడేది?’’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment