![Sajjala Ramakrishna Reddy Comments On TDP - Sakshi](/styles/webp/s3/article_images/2021/11/16/sajjala_0.jpg.webp?itok=nxr9KzZi)
సాక్షి, అమరావతి: టీడీపీ శాసన మండలిలో సైందవ పాత్ర పోషించిందని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ఎమ్మెల్యే కోటాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థులు మంగళవారం నామినేషన్ దాఖలు చేశారు.
ఈ సందర్భంగా సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. 'శాసనసభలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. మా పార్టీ అభ్యర్థుల ఎన్నిక లాంఛనమే అవుతుంది. స్థానిక సంస్థల కోటాలో కూడా 11 మంది పేర్లు ప్రకటించాం. దీంతో శాసనమండలిలో వైఎస్సార్‌సీపీ బలం 32 మందికి పెరుగుతుంది. 18 మంది బలహీన వర్గాలకు చెందిన వ్యక్తులకు కేటాయించామని సగర్వంగా ప్రకటిస్తున్నాం. అందులో నలుగురు మైనార్టీలు. టీడీపీలో బలహీన వర్గాలకు అన్యాయం జరిగింది. ఆ పార్టీని ప్రజా కోర్టులో ప్రజలు తిరస్కరించారు. నామినేటెడ్ పోస్టుల భర్తీలో బలహీన వర్గాలకు 50 శాతం కేటాయించాం. సోషల్ ఇంజనీరింగ్‌లో సామాజిక న్యాయానికి పెద్దపీట వేశాం' అని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు.
చదవండి: (రైతుల కోసం మరో అడుగు ముందుకు వేస్తున్నాం: సీఎం జగన్)
Comments
Please login to add a commentAdd a comment