డాక్యుమెంట్లను అందించిన హోంగార్డు
సాక్షి, హైదరాబాద్: నల్లగొండ పార్లమెంట్‌కు పోటీ చేస్తోన్న టీఆర్‌ఎస్ అభ్యర్థి వేమిరెడ్డి నరసింహారెడ్డికి చెందిన బీఫారం, ఇతర సర్టిఫికెట్లు పోవడం కలకలం రేపింది. సోమవారం ఉదయం 7 గంటల ప్రాంతం లో వేమిరెడ్డి మేనేజర్ వెంకటేశ్వర్‌రావు కాచిగూడ నుంచి బైకుపై బయల్దేరాడు. కాచిగూడ చౌరస్తా వద్దకు రాగానే బైకు వెనకవైపు తగిలించిన సంచి జారిపడిపోయింది. వెనుకనే మరో బైకుపై వస్తున్న హోంగార్డు ముని వెంకటరమణ ఇది గమనించాడు. ఆ సంచిని వెంకటేశ్వర్‌రావుకు ఇచ్చేందుకు యత్నించినా వీలు కాలేదు.
డీజీపీ ఆఫీసులో పనిచేసే ముని వెంకటరమణ కార్యాలయానికి వెళ్లాక ఆ సంచీని తెరి చి చూడగా.. అందులో వేమిరెడ్డి నరసింహారెడ్డికి సంబంధించిన బీఫారం (నకలు), నామినేషన్లకు సంబంధించిన పత్రాలు, విద్యార్హతల సర్టిఫికెట్లు ఉన్నాయి. అందులో ఆధార్ కార్డులో ఉన్న నంబర్‌కు ఫోన్ చేసి చెప్పాడు. కాల్ రిసీవ్ చేసుకున్న ఆయన కుటుంబ సభ్యులు మేనేజర్‌కి డీజీపీ ఆఫీసుకు వెళ్లా లని చెప్పారు. అక్కడికి వెళ్లిన మేనేజర్ వివరాలు ధ్రువీకరించుకున్నాక మునివెంకటరమణ ఆ ఫైల్‌ను అడ్మిన్ ఆర్‌ఐ జంగయ్య సమక్షంలో అతనికి అందజేశాడు. నిజాయితీగా డాక్యుమెంట్లను ఇచ్చిన హోంగార్డును ఉన్నతాధికారులు అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment