సాక్షి, హైదరాబాద్ : ప్రతిపక్ష మహాకూటమికి సంబంధించి సీట్ల పంపకాల వ్యవహారం ఎట్టకేలకు కొలిక్కివచ్చినట్టు తెలుస్తోంది. కాంగ్రెస్, టీడీపీ, టీజేఎస్, సీపీఐ కలిసి ప్రజాకూటమిగా ఏర్పడి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దిగుతున్న సంగతి తెలిసిందే. కూటమిలోని పార్టీలకు సీట్ల పంపకాల వ్యవహారం కాంగ్రెస్ పార్టీకి పెద్ద తలనొప్పిగా మారింది. ఈ క్రమంలో మిత్రపక్షాలకు ఇవ్వాల్సిన సీట్లపై ఎట్టకేలకు కాంగ్రెస్ పార్టీ ఓ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. తెలంగాణలో మొత్తం 119 స్థానాలు ఉండగా.. 95 అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్ పోటీ చేయనుంది. మిగతా 24 స్థానాలను మిత్రపక్షాలకు ఇవ్వనుంది. కూటమిలో భాగంగా టీడీపీ, సీపీఐ, టీజేఎస్‌కు కాంగ్రెస్ పార్టీ ఆఫర్ చేసిన టికెట్లు ఇవేనని విశ్వసనీయంగా తెలిసింది.
కూటమిలో భాగంగా టీడీపీకి ఈ కింది సీట్లు ఇవ్వనుంది..
1) ఖమ్మం
2) సత్తుపల్లి
3) అశ్వరావుపేట
4) మక్తల్
5) దేవరకద్ర
6) కోదాడ/సికింద్రాబాద్
7) నిజామాబాద్ రూరల్
8) కూకట్ పల్లి
9) శేరిలింగంపల్లి
10) ఉప్పల్
11) పటాన్ చెరువు
12) రాజేంద్రనగర్
13) మలక్ పేట్
14) చార్మినార్
ఇక టీజేఎస్ ఆరు సీట్లలో పోటీ చేయనుంది. అవి
1) సిద్దిపేట్
2) రామగుండం
3) అంబర్ పేట్/ ముషీరాబాద్
4) చెన్నూరు
5) ఓల్డ్ సిటీ(1)
6) ఓల్డ్ సిటీ(2)
ఇక బెల్లంపల్లి, దేవరకొండ, కొత్తగూడెం, మునుగోడు లేదా హుస్నాబాద్ నియోజకవర్గాల టికెట్లను సీపీఐకి కాంగ్రెస్ పార్టీ ఇవ్వనుంది.
Comments
Please login to add a commentAdd a comment