టీడీపీ ఇంటింటా ప్రచారం | Election Campaign TDP In Sattupalli khammam | Sakshi
Sakshi News home page

టీడీపీ ఇంటింటా ప్రచారం

Published Sat, Nov 24 2018 1:31 PM | Last Updated on Sat, Nov 24 2018 1:44 PM

Election Campaign TDP In Sattupalli khammam - Sakshi

సత్తుపల్లిలో ప్రచారం చేస్తున్న కాంగ్రెస్, టీడీపీ నాయకులు

సాక్షి,సత్తుపల్లిటౌన్‌: ప్రజాకూటమి అభ్యర్థి సండ్ర వెంకటవీరయ్యను గెలిపించాలని కోరుతూ శుక్రవారం పట్టణంలోని 17వ వార్డులో కాంగ్రెస్, టీడీపీ నాయకులు ఇంటింటా ప్రచారం నిర్వహించారు. ప్రజాకూటమి అధికారంలోకి వస్తే రైతులకు రూ.2లక్షల రుణమాఫీ వస్తుందన్నారు. కార్యక్రమంలో టీపీసీసీ సభ్యుడు రామిశెట్టి సుబ్బారావు, గాదె చెన్నకేశవరావు, దేవళ్ల పెద్దిరాజు, గాదెరెడ్డి సుబ్బారెడ్డి,  పింగళి సామేలు, కిరణ్, పూచి గోవర్ధన్, అశోక్‌రెడ్డి, శ్రీకాంత్, నారాయణ, గురవయ్య, రాజేష్, గోపి, రాము, శ్రీను, వెంకటేశ్వరరావు, బాపయ్య, లక్ష్మణ్, ఆదినారాయణ పాల్గొన్నారు.  


టీడీపీ ఇంటింటా ప్రచారం   

కల్లూరురూరల్‌: మండల పరిధిలోని వెన్నవల్లిలో కూటమి బలపరిచిన టీడీపీ అభ్యర్థి సండ్ర వెంకటవీరయ్య గెలుపునకు టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. కేసీఆర్‌ ప్రభుత్వం పేద ప్రజలను పట్టించుకోలేదని, పక్కా గృహాలు మంజూరు చేయలేదని నాయకులు వివరించారు. రానున్న మహాకూటమి ప్రభుత్వంలో పేదలందరికీ స్వంత స్థలాల్లోనే ఇండ్లు కట్టిస్తుందని, దీంతోపాటు అన్ని సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తుందన్నారు. టీడీపీ నాయకులు ఇనుపనూరి మోహనరావు, మేడి సీతయ్య, అంజి, మత్తే సత్యం, మాజీ సర్పంచ్‌ ఖమ్మంపాటి వెంకటేశ్వర్లు, వేల్పుల రమేష్, గుమ్మా భాస్కర్‌రావు, మార్తా పెద్దిరాజు, కావేటి వెంకట శ్రీను, ఖమ్మం పాటి వెంకటేశ్వర్లు, జాని, కొత్తపల్లి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.  


రోడ్డుపై సేద తీరిన నాయకులు   
సత్తుపల్లి: ప్రజాకూటమి బలపరిచిన టీడీపీ అభ్యర్థి సండ్ర వెంకటవీరయ్య ప్రచారంలో భాగంగా షెడ్యూల్‌ ప్రకారం కాకర్లపల్లి గ్రామానికి వస్తున్నారని.. నాయకులు, కార్యకర్తలు ఎదురు చూశారు. శుక్రవారం సాయంత్రం 5.30 గంటలకు కాకర్లపల్లి గ్రామానికి రావాల్సి ఉండగా.. ప్రచారం ఆలస్యం కావటంతో.. రాత్రి 7.30 గంటల వరకు ఎదురు చూశారు. గ్రామ శివారులో ఆలసిపోయిన టీడీపీ మండల అధ్యక్షుడు దొడ్డా శంకర్‌రావు, కార్యకర్త లాల్‌కుమార్‌ రోడ్డుపైనే సేద తీరారు.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement