sandra venkatra veeraiah
-
ఓటుకు కోట్లు కేసులో నిందితులకు ఈడీ కోర్టు సమన్లు
సాక్షి, హైదరాబాద్: ఓటుకు కోట్లు కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దాఖలు చేసిన అభియోగ పత్రాన్ని ఈడీ మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి (ఎంఎస్‌జే) కోర్టు శనివారం విచారణకు స్వీకరించింది. ఈ కేసులో నిందితులుగా మల్కాజిగిరి ఎంపీ, టీపీసీసీ చీఫ్ ఎ.రేవంత్‌రెడ్డి, టీడీపీ మైనారిటీ సెల్ ప్రతినిధి హ్యారీ సెబాస్టియన్, రుద్ర ఉదయసింహ, ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యతోపాటు జెరూసలెం మత్తయ్య, అప్పటి టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి వేం నరేందర్‌రెడ్డి కుమారుడు వేం క్రిష్ణకీర్తన్‌లనూ చేర్చింది. అక్టోబర్ 4న వారిని ప్రత్యక్షంగా విచారణకు హాజరు కావాలని ఆదేశిస్తూ ఎంఎస్‌జే తుకారాంజీ సమన్లు జారీ చేశారు. ఈడీ అభియోగపత్రం ప్రకారం నిందితులు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా మనీలాండరింగ్‌కు సహకరించడం లేదా ఆ కుట్రలో భాగస్వామి కావడం తదితర అభియోగాలు ఉన్నాయి. వారిపై నేరం రుజువైతే మూడేళ్ల నుంచి పదేళ్ల వరకు జైలు శిక్ష, జరిమానా విధించే అవకాశం ఉంది. మరోవైపు ఏసీబీ నమోదు చేసిన కేసుకు సంబంధించి ప్రత్యేక కోర్టులో కీలక సాక్షుల విచారణ పూర్తయ్యింది. అయితే ఈ కేసును విచారించే పరిధి ఏసీబీ కోర్టుకు లేదంటూ ఇటీవల ఎంపీ రేవంత్‌రెడ్డి తదితరులు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. వీరి పిటిషన్‌ను విచారించిన సుప్రీం కోర్టు.. ప్రత్యేక కోర్టు విచారణను నిలిపివేసింది. ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. అలాగే రేవంత్ రెడ్డి పిటిషన్‌పై కౌంటర్ దాఖలు చేయాలని అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ)ను ఆదేశిస్తూ విచారణను వచ్చే నెలకు వాయిదా వేసింది. చదవండి: తీన్మార్ మల్లన్నను అరెస్టు చేసిన పోలీసులు..! -
ఖమ్మం : రసాభాసగా మల్లవరంలో పల్లెప్రగతి కార్యక్రమం
-
టీడీపీ కథ కంచికే!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో తెలుగుదేశం పార్టీ కథ కంచికి చేరడం ఖాయమైంది. ఈ అసెంబ్లీ సమావేశాల్లోపే టీడీపీ అడ్రస్ గల్లంతు చేసేందుకు అధికార టీఆర్ఎస్ వ్యూహం రూపొందించింది. ఆపరేషన్ ఆకర్ష్‌ను మళ్లీ మొదలుపెడుతోంది. ముందుగా టీడీపీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలను చేర్చుకుని ఆ తర్వాత కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై నజర్ పెట్టాలని భావిస్తోంది. ఇప్పటికే ఇద్దరు ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలను చేర్చుకున్న టీఆర్ఎస్ మిగిలిన పార్టీల వారిని చేర్చుకునే విషయంలోనూ వేగంగానే నిర్ణయాలు తీసుకోనుంది. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికలలో టీఆర్ఎస్ 88 స్థానాల్లో విజయం సాధించింది. ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్ తరపున గెలిచిన కోరుకంటి చందర్ (రామగుండం), స్వతంత్ర అభ్యర్థిగా విజయం సాధించిన లావుడ్య రాములునాయక్ (వైరా) ఎమ్మెల్యేలు ఇప్పటికే టీఆర్ఎస్లో చేరారు. ఆకర్ష్‌లో భాగంగా మొదట టీడీపీ నుంచి గెలిచిన సండ్ర వెంకటవీరయ్య (సత్తుపల్లి), మెచ్చా నాగేశ్వర్రావు (అశ్వారావు పేట)లను ఒకేసారి పార్టీలో చేర్చుకోవాలని యోచిస్తోంది. గత అసెంబ్లీలో చేసినట్లుగా ఈసారి టీడీపీ శాసనసభా పక్షాన్ని అధికార పక్షంలో విలీనం చేసేలా వ్యూహం రచించింది. సండ్రకు మిషన్ భగీరథ వైస్ చైర్మన్, మెచ్చాకు గిరిజన ఆర్థిక సహకార సంస్థ (ట్రైకార్) చైర్మన్ పదవులు ఇచ్చేందుకు అవకాశముందని సమాచారం. ఉత్సాహం.. ఊగిసలాట వాస్తవానికి, తెలంగాణలో టీడీపీ లేకుండా చేయాలనే వ్యూహంతోనే మొదట్నుంచీ టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పావులు కదిపారు. తాజా ఎన్నికల్లో మహాకూటమితో కలిసి 13 చోట్ల పోటీ చేసి రెండు స్థానాల్లో గెలుపొందింది. ఈ నేపథ్యంలో ఆ ఇద్దరిని పార్టీలో చేర్చుకుంటే అసెంబ్లీ నిబంధనల ప్రకారం కూడా అధికారికంగా టీడీపీ పక్షం టీఆర్ఎస్లో విలీనం అవుతుంది. అందుకే ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే అధికార పార్టీ రంగంలోకి దిగి చర్చలు ప్రారంభించింది. దీంతో సండ్ర వెంకటవీరయ్య టీఆర్ఎస్లో చేరడం ఖాయమంటూ 15రోజుల క్రితమే వార్తలు వచ్చాయి. మరో ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావుతో కూడా చర్చలు జరుగుతున్నాయని, అయితే, ఆయన కొంత ఊగిసలాటలో ఉన్నారని చర్చ జరిగింది. ఆ తర్వాత కూడా టీఆర్ఎస్ నేతల సంప్రదింపులతో మెత్తబడ్డారని తెలుస్తోంది. చంద్రబాబు ఒత్తిడి తెచ్చినా! టీఆర్ఎస్లో చేరేందుకు మొదట్నుంచీ సిద్ధంగానే ఉన్న సండ్ర మంత్రి పదవి లభిస్తే బాగుంటుందని భావించారు. తనతో పాటు మెచ్చాను కూడా టీఆర్ఎస్లోకి తీసుకెళ్లడం ద్వారా కేసీఆర్ నుంచి ఆ మేరకు హామీ తీసుకోవచ్చనుకున్నారు. తన నియోజకవర్గంలో కార్యకర్తలు, నేతలతో సమావేశమై వారిని కూడా పార్టీ మారేందుకు మానసికంగా సిద్ధం చేశారు. కానీ, మెచ్చా మొదట్లో ససేమిరా అన్నారు. తాను ఎట్టి పరిస్థితుల్లో పార్టీలోనే ఉంటానంటూ అమరావతికి వెళ్లి టీడీపీ అధినేత చంద్రబాబును కలిసి వచ్చారు. పార్టీ మారొద్దంటూ మెచ్చాపై చంద్రబాబు ఒత్తిడి తీసుకువచ్చారు. సండ్ర వెళ్లినా టీడీపీలోనే ఉంటే ఆయన స్థానంలో తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) బోర్డు సభ్యునిగా అవకాశం కల్పిస్తానని హామీ ఇచ్చారు. దీంతో మెచ్చా కొంత మెత్తబడ్డట్టు కనిపించింది. అయితే, టీఆర్ఎస్ నేతల చర్చలతో పాటు నియోజకవర్గ నేతలు కూడా టీఆర్ఎస్లోకి వెళ్లాలని, అయితే, ఎవరిపై ఆధారపడకుండా స్వతంత్రంగానే పార్టీలోకి వెళ్లాలని మెచ్చాకు సూచించారు. ఈ నేపథ్యంలో స్థానిక నేతల సూచన, ఖమ్మం జిల్లా టీఆర్ఎస్ ముఖ్య నేతల ఒత్తిడి మేరకు ఆయన కూడా చివరకు ఓకే చెప్పేశారని, త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన ఉంటుందనే చర్చ రాష్ట్ర రాజకీయ వర్గాల్లో జరుగుతుండడం గమనార్హం. 8 మంది కాంగ్రెస్ సభ్యులు కూడా.. టీడీపీ శాసనసభ పక్షం విలీనం పూర్తి కాగానే.. ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్‌పై చేరిక వ్యూహాన్ని అమలు చేసేందుకు అధికార పార్టీ అంతా సిద్ధం చేసింది. తాజా ఎన్నికల్లో కాంగ్రెస్ 19 స్థానాలు గెలుచుకుంది. వీరిలో 8మంది ఎమ్మెల్యేలు ఇప్పటికే టీఆర్ఎస్ అధిష్టానంతో సంప్రదింపులు జరుగుతున్నారు. అయితే ఒక్కొక్కరు చొప్పన కాకుండా ఒకేసారి కాంగ్రెస్ శాసనసభ పక్షాన్ని విలీనం చేసే దిశగా టీఆర్ఎస్ వ్యూహం రచించింది. కాంగ్రెస్ తరుపున గెలిచిన వారిలో 13 మంది ఒకేసారి టీఆర్ఎస్లో చేరితే న్యాయపరమైన ఇబ్బందులు లేమీ ఉండవు. దీంతో ఒకేసారి ఆ మేరకు టీఆర్ఎస్లో చేర్చుకునేలా ప్రణాళిక పూర్తవుతోంది. జనవరి 17నుంచి అసెంబ్లీ సమావేశాలు మొదలవుతున్న నేపథ్యంలో ఆలోపే.. టీడీపీ ఎమ్మెల్యేల చేరిక జరగొచ్చని టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. బడ్జెట్ సమావేశాలలోపు కాంగ్రెస్ శాసనసభ పక్షం విలీనం జరగొచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఎంపీ సీట్ల గెలుపు లక్ష్యం జాతీయ రాజకీయాల్లో గుణాత్మకమార్పు లక్ష్యంగా కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్‌ను నిర్మించే పనిలో ఉన్నారు. తెలంగాణలోని 17 లోక్‌సభ సీట్లలో మజ్లిస్ ప్రాతినిథ్యం వహిస్తున్న హైదరాబాద్ మినహా మిగిలిన 16 స్థానాలను గెలుచుకోవాలని టీఆర్ఎస్ లక్ష్యంగా పెట్టుకుంది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల ప్రకారం ఖమ్మం, మహబూబాబాద్ లోక్‌సభ నియోజకవర్గాలలో మాత్రమే టీఆర్ఎస్ వెనుకబడింది. ఖమ్మం లోక్‌సభ సెగ్మెంట్ పరిధిలో ఒక్క స్థానం, మహబూబాబాద్ లోక్‌సభ స్థానం పరిధిలో మూడు స్థానాలు మాత్రమే వచ్చాయి. ఈ రెండు లోక్‌సభ సెగ్మెంట్లలో కాంగ్రెస్ ఎనిమిది, టీడీపీ రెండు అసెంబ్లీ స్థానాలను గెలచుకున్నాయి. 16 ఎంపీ సీట్లలో గెలుపు లక్ష్యంగా పెట్టుకున్న టీఆర్ఎస్కు ఈ రెండు లోక్‌సభ సెగ్మెంట్లలో ఇబ్బందులున్నాయి. ఈ నేపథ్యంలో ఖమ్మం, మహబూబాబాద్ లోక్‌సభ సెగ్మెంట్ల పరిధిలోని కాంగ్రెస్‌కు చెందిన 8మంది ఎమ్మెల్యేలతో ఇప్పటికే సంప్రదింపులు జరుపుతోంది. లోక్‌సభ ఎన్నికలకు ముందే కాంగ్రెస్ సభ్యులను చేర్చుకునేందుకు ఏర్పాట్లు చేస్తోంది. వీరితోపాటు మిగిలిన జిల్లాల్లోని 5గురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలను చేర్చుకుంటే సాంకేతికంగా ఇబ్బందులు ఉండబోవని భావిస్తోంది. లోక్‌సభ ఎన్నికలలో గెలుపు లక్ష్యంగా వీలైనంత త్వరగా కాంగ్రెస్, టీడీపీ ఎమ్మెల్యేల చేరికను పూర్తి చేసేందుకు టీఆర్ఎస్ అన్ని ఏర్పాట్లు చేసుకుంటోంది. -
తెలంగాణలో టీడీపీకి ఝలక్
-
అమరుల త్యాగాలతోనే భోగాలు : సండ్ర
సాక్షి, సత్తుపల్లి: తెలంగాణ ఉద్యమంలో ఆత్మబలిదానం చేసిన శ్రీకాంతాచారికి వేదికపై కనీసం నివాళి అర్పించలేదని, ఉద్యమకారులను గౌరవించలేదని, అమరుల త్యాగాలతో భోగాలు అనుభవిస్తున్నారని టీడీపీ అభ్యర్థి సండ్ర వెంకటవీరయ్య ఆరోపించారు. సత్తుపల్లిలోని కాకర్లపల్లిరోడ్ చంద్రాగార్డెన్స్‌లో ఏర్పాటు చేసి చంద్రబాబు బహిరంగ సభ ఏర్పాట్లను మంగళవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబునాయుడు ప్రాజెక్టులు అడ్డుకుంటున్నారంటూ అసత్య ప్రచారం చేస్తున్నారని, ఎక్కడ అడ్డుకున్నారో బయటపెట్టాలని సవాల్ చేశారు. సత్తుపల్లి అభివృద్ధి టీడీపీ హయాంలోనే జరిగిందని, వ్యక్తులు ద్వారా కాదన్నారు. మాతృభూమి బిడ్డగా తెలంగాణ రాష్ట్ర హక్కులను కాపాడటంతో ముందుంటామని, అయినా తెలంగాణ ఎగువ ప్రాంతమని, ఆంధ్రా దిగువ ప్రాంతమని వివరించారు. సత్తుపల్లి జిల్లాను అడ్డుకుంది కేసీఆర్ అని.. జిల్లా సాధన జేఏసీకి కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదని, వేదికమీద ఆ ఊసే లేదని విమర్శించారు. టీఆర్ఎస్ పార్టీ గిరిజన అభ్యర్థినే వేదికపై నుంచి నెట్టిన ఘనతను మూటగట్టుకుందన్నారు. నేడు చంద్రబాబు రాక.. సత్తుపల్లి పట్టణంలో ఉదయం 10 గంటలకు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు పర్యటిస్తారన్నారు. మాజీ మంత్రి సంభాని చంద్రశేఖర్, ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి, మాజీ కేంద్రమంత్రి రేణుకాచౌదరి, ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మంద కృష్ణ మాదిగ వస్తున్నారన్నారు. రేవంత్‌రెడ్డి అరెస్ట్‌కు ఖండన.. ప్రజాస్వామ్యంలో వ్యక్తిగత స్వేచ్ఛను హరించే విధంగా ప్రభుత్వం రెవంత్రెడ్డిని తలుపులు బద్ధలుకొట్టి మరీ అరెస్ట్ చేయటాన్ని సండ్ర వెంకటవీరయ్య తీవ్రంగా ఖండించారు. ఇది మంచిపద్ధతి కాదని.. తప్పుడు పద్ధతుల్లో వ్యవహరించటం ప్రజాస్వామ్యానికి తగదన్నారు. కార్యక్రమంలో టీడీపీ మండల, పట్టణ అధ్యక్షులు దొడ్డా శంకర్రావు, కూసంపూడి మహేష్, కూసంపూడి రామారావు, కొత్తూరు ఉమామహేశ్వరరావు, వీరపనేని బాబి, సుమంత్, రతికంటి గిరిగోవర్ధన్, మల్లూరు మోహన్, కాలినేని నర్సింహారావు, వల్లభవనేని పవన్ పాల్గొన్నారు. సండ్రను భారీ మెజార్టీతో గెలిపించాలి.. తల్లాడ: ప్రజాకూటమి బలపరిచిన టీడీపీ అభ్యర్థి సండ్ర వెంకటవీరయ్యను భారీ మెజార్టీతో గెలిపించాలని ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి కోరారు. తల్లాడలో టీడీపీ కార్యాలయంలో ఆయన ప్రజాకూటమి కార్యకర్తలను కలిసి మాట్లాడారు. వెంకటవీరయ్యకు భారీ మెజార్టీ వచ్చే విధంగా కార్యకర్తలు పని చేయాలన్నారు. రాష్ట్రంలో రానున్నది ప్రజా కూటమి ప్రభుత్వమేనని, కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసుకోవచ్చన్నారు. కార్యక్రమంలో కూటమి నాయకులు పగడాల లచ్చిరెడ్డి, దగ్గుల వెంకట్‌రెడ్డి పాల్గొన్నారు. ప్రజా కూటమిదే ప్రభుత్వం .. కల్లూరురూరల్: రాష్ట్రంలో ప్రజాకూటమి ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఖాయమని, కేసీఆర్ ఫామ్‌హౌస్‌కే పరిమితం అయ్యే పరిస్థితి ఏర్పడిందని టీడీపీ అభ్యర్థి సండ్ర వెంకటవీరయ్య పేర్కొన్నారు. మంగళవారం మండల పరిధిలోని చిన్నకోరుకొండిలో మాజీ మంత్రి సంభాని చంద్రశేఖర్‌తో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పది సీట్లు గెలుస్తామన్నారు. మాజీ మంత్రి సంభాని చంద్రశేఖర్ మాట్లాడుతూ రాష్ట్రంలో కేసీఆర్ నియంతృత్వ పాలనకు చివరి రోజులు వచ్చాయన్నారు. కేసీఆర్ మోసాలు ఎంతోకాలం సాగవని, ప్రజలు ఓటు ద్వారా తీర్పు ఇవ్వనున్నారన్నారు. కార్యక్రమంలో నాయకులు పెద్దబోయిన దుర్గాప్రసాద్, బూదాటి నారపురెడ్డి, రెడ్డి నర్సింహారావు, తోట జనార్ధన్, నామా మైసయ్య, భూక్యా శివకుమార్ నాయక్, ఉన్నం రాజ, దుర్గం కృష్ణ, ఎస్కే షమి పాల్గొన్నారు. -
టీడీపీ ఇంటింటా ప్రచారం
సాక్షి,సత్తుపల్లిటౌన్: ప్రజాకూటమి అభ్యర్థి సండ్ర వెంకటవీరయ్యను గెలిపించాలని కోరుతూ శుక్రవారం పట్టణంలోని 17వ వార్డులో కాంగ్రెస్, టీడీపీ నాయకులు ఇంటింటా ప్రచారం నిర్వహించారు. ప్రజాకూటమి అధికారంలోకి వస్తే రైతులకు రూ.2లక్షల రుణమాఫీ వస్తుందన్నారు. కార్యక్రమంలో టీపీసీసీ సభ్యుడు రామిశెట్టి సుబ్బారావు, గాదె చెన్నకేశవరావు, దేవళ్ల పెద్దిరాజు, గాదెరెడ్డి సుబ్బారెడ్డి, పింగళి సామేలు, కిరణ్, పూచి గోవర్ధన్, అశోక్‌రెడ్డి, శ్రీకాంత్, నారాయణ, గురవయ్య, రాజేష్, గోపి, రాము, శ్రీను, వెంకటేశ్వరరావు, బాపయ్య, లక్ష్మణ్, ఆదినారాయణ పాల్గొన్నారు. టీడీపీ ఇంటింటా ప్రచారం కల్లూరురూరల్: మండల పరిధిలోని వెన్నవల్లిలో కూటమి బలపరిచిన టీడీపీ అభ్యర్థి సండ్ర వెంకటవీరయ్య గెలుపునకు టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. కేసీఆర్ ప్రభుత్వం పేద ప్రజలను పట్టించుకోలేదని, పక్కా గృహాలు మంజూరు చేయలేదని నాయకులు వివరించారు. రానున్న మహాకూటమి ప్రభుత్వంలో పేదలందరికీ స్వంత స్థలాల్లోనే ఇండ్లు కట్టిస్తుందని, దీంతోపాటు అన్ని సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తుందన్నారు. టీడీపీ నాయకులు ఇనుపనూరి మోహనరావు, మేడి సీతయ్య, అంజి, మత్తే సత్యం, మాజీ సర్పంచ్ ఖమ్మంపాటి వెంకటేశ్వర్లు, వేల్పుల రమేష్, గుమ్మా భాస్కర్‌రావు, మార్తా పెద్దిరాజు, కావేటి వెంకట శ్రీను, ఖమ్మం పాటి వెంకటేశ్వర్లు, జాని, కొత్తపల్లి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. రోడ్డుపై సేద తీరిన నాయకులు సత్తుపల్లి: ప్రజాకూటమి బలపరిచిన టీడీపీ అభ్యర్థి సండ్ర వెంకటవీరయ్య ప్రచారంలో భాగంగా షెడ్యూల్ ప్రకారం కాకర్లపల్లి గ్రామానికి వస్తున్నారని.. నాయకులు, కార్యకర్తలు ఎదురు చూశారు. శుక్రవారం సాయంత్రం 5.30 గంటలకు కాకర్లపల్లి గ్రామానికి రావాల్సి ఉండగా.. ప్రచారం ఆలస్యం కావటంతో.. రాత్రి 7.30 గంటల వరకు ఎదురు చూశారు. గ్రామ శివారులో ఆలసిపోయిన టీడీపీ మండల అధ్యక్షుడు దొడ్డా శంకర్రావు, కార్యకర్త లాల్‌కుమార్ రోడ్డుపైనే సేద తీరారు. -
రైతులను విస్మరిస్తున్న ప్రభుత్వాలు
తల్లాడ : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులను విస్మరిస్తున్నాయని మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు అన్నారు. తల్లాడలో శుక్రవారం మాజీ ఎంపీపీ వజ్రాల వెంకటసుబ్బమ్మ గృహంలో ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యతో కలిసి ఆయన విలేకర్లతో మాట్లాడారు. ఈ ఏడాది అకాల వర్షంతో పండించిన పంటలకు గిట్టుబాటు ధరలేక రైతులు సతమతమౌతున్నారని, ఎన్నికల సమయంలో రైతులకు అనేక వాగ్ధానాలు చేసి వాటిని ఆచరణలో పెట్టడంలో విఫలమౌతున్నట్లు ఆరోపించారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం పంటలకు గిట్టుబాటు ధర ఉండేలా మద్ధతు ధర ప్రకంటించాలన్నారు. తెలంగాణను వ్యవసాయంలో ఒక మోడల్ స్టేట్‌గా రూపొందిస్తామని టీఆర్ఎస్ నాయకులు చెపుతున్నారని, స్వామినాధన్ కమిషన్ అమలుకు కృషి చేయాలన్నారు. బయ్యారం గనుల లీజుకిస్తే దానిపై లోక్‌సభలో ఆందోళన చేశామన్నారు. బయ్యారంలో స్టీల్ ప్లాంట్ పెడతామని విభజన చట్టంలో పేర్కొన్నారని, ఇంతవరకు స్టీల్ ప్లాంట్ నెలకొల్పలేదన్నారు. పరిశ్రమలను అభివృద్ధి చేస్తేనే నిరుద్యోగ సమస్య తీరుతుందన్నారు. టీడీపీ రాష్ట్ర కార్యదర్శి రాయల శేషగిరావు, మండల అధ్యక్ష, కార్యదర్శులు దూపాటి భద్రరాజు, కేతినేని చలపతిరావు, దగ్గుల శ్రీనివాసరెడ్డి, కె.సత్యనారాయణ, నున్నా తిరుమలరావు, మొక్కా కృష్ణార్జున్, సురేష్, రేగళ్ల సత్యం పాల్గొన్నారు. -
కాంగ్రెస్-టీడీపీ పొత్తులాట!
సాక్షి ప్రతినిధి ఖమ్మం: కాంగ్రెస్‌తో ఎన్నికల మైత్రి ఉంటుందనే ప్రచారం టీడీపీ వర్గాల్లో కొత్త ఆశలు రేకెత్తిస్తోంది. ఇప్పటివరకు తమ రాజకీయ భవిష్యత్ కోసం ఇతర పార్టీల ముఖ్య నేతలతో సహా ద్వితీయ శ్రేణి నాయకులు ఆసక్తి ప్రదర్శించినా.. రాష్ట్రంలో మారుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో వేచి చూసే ధోరణి అవలంబిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. మూడేళ్లుగా జిల్లాలో నెలకొన్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో డీలాపడిన టీడీపీకి ఇక రాష్ట్రంలో జవసత్వాలు వచ్చే అవకాశం లేదని భావించిన జిల్లాకు చెందిన నేతలు అనేక మంది టీఆర్ఎస్ వైపు మొగ్గు చూపారు. టీడీపీలోని కీలక నేతలు పలువురు ఇతర పార్టీల వైపు మొగ్గు చూపుతున్నారని, కొద్ది రోజుల్లో నిర్ణయం తీసుకుంటారని పార్టీ వర్గాల్లో విస్తృతంగా ప్రచారం జరిగింది. ఈ క్రమంలో సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య సైతం పార్టీ మారుతారని పెద్ద ఎత్తున అప్పట్లో పుకార్లు షికార్లు చేశాయి. అయితే 2015లో సండ్రను తొలిసారిగా తెలంగాణ నుంచి ఏపీ ప్రభుత్వం టీటీడీ బోర్డు సభ్యుడిగా నియమించింది. రెండేళ్లపాటు ఆ పదవిలో కొనసాగిన వెంకటవీరయ్యకు తాజాగా ఏర్పాటు చేసిన టీటీడీ బోర్డులోనూ మరోసారి సభ్యుడిగా అవకాశం లభించింది. దీంతో ఆయన పార్టీ మారుతారన్న ఊహాగానాలకు తెరపడినట్లయింది. టీడీపీలోనే కొనసాగుతూ ఎన్నికల నాటికి పార్టీ తీసుకునే నిర్ణయానికి అనుగుణంగా వ్యవహరించాలని, కాంగ్రెస్‌తో పొత్తు ఖరారైతే టీడీపీలో సిట్టింగ్ స్థానాలను ఆ పార్టీ మళ్లీ కోరే అవకాశం ఉన్నందున తమ రాజకీయ భవిష్యత్‌కు ఎటువంటి ఇబ్బంది లేదన్న భావనతో పలువురు నేతలు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే కొందరు టీడీపీ నేతల్లో మాత్రం కాంగ్రెస్‌తో మైత్రి సాధ్యమా..? ఒకవేళ ఉన్నా తమకు అవకాశం లభిస్తుందా..? ఎన్నికలకు ముందే పార్టీ మారితే కలిగే ప్రయోజనం ఎలా ఉంటుందన్న అంశాలపై తర్జన భర్జన పడుతున్నట్లు సమాచారం. అంతరంగం వెల్లడించని ‘నామా’.. టీడీపీకి చెందిన మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు సైతం ఆ పార్టీని వీడి.. తన రాజకీయ భవిష్యత్ కోసం మరో పార్టీలో చేరుతారని, ఆయన కాంగ్రెస్ పార్టీకి చేరువయ్యేందుకు అవకాశాలున్నాయని కొద్ది నెలలుగా జిల్లాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. అయితే ఇప్పటివరకు నామా తన అంతరంగం వెల్లడించకుండా పార్టీ కార్యకలాపాల్లో యథావిథిగా పాల్గొంటూ రాజకీయ పరిణామాలను సునిశితంగా పరిశీలిస్తున్నట్లు పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. టీటీడీ బోర్డు సభ్యుడిగా నియామకమైన సండ్ర ప్రస్తుతం సత్తుపల్లి ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లోనూ ఆయన సత్తుపల్లి నుంచే పోటీ చేయాలని నిర్ణయించుకోవడంతో కాంగ్రెస్‌తో ఎన్నికల మైత్రి ఆయనకు కలిసొచ్చే అవకాశం ఉందని ఆయన వర్గీయులు భావిస్తున్నారు. 2009, 2014 ఎన్నికల్లో వెంకటవీరయ్య టీడీపీ అభ్యర్థిగా సత్తుపల్లి నుంచి గెలుపొందగా.. 2004లో కాంగ్రెస్ నుంచి జలగం వెంకట్రావు, 1999, 1994లో టీడీపీ అభ్యర్థిగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు విజయం సాధించారు. 2009లో నియోజకవర్గాల పునర్విభజన జరగడంతో అప్పటివరకు ఎస్సీ నియోజకవర్గంగా ఉన్న పాలేరు జనరల్‌గా మారడం, జనరల్‌గా ఉన్న సత్తుపల్లి ఎస్సీగా మారడంతో కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి సంభాని చంద్రశేఖర్ సత్తుపల్లి నియోజకవర్గం నుంచి 2009, 2014లో పోటీ చేసి ఓటమి చెందారు. పాలేరులో తనకు మంచి అనుచరగణం, పూర్తిస్థాయి పట్టు ఉందన్న భావనతో ఉన్న సంభాని ఈసారి సత్తుపల్లి కన్నా.. పాలేరులో పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్నారని కాంగ్రెస్ వర్గాలు భావిస్తున్నాయి. ఒకవేళ కాంగ్రెస్‌తో టీడీపీకి పొత్తు ఉంటే అక్కడ సిట్టింగ్ అభ్యర్థి అయిన వెంకటవీరయ్యకు ఆ పార్టీ మద్దతిచ్చే అవకాశం ఉంటుందని టీడీపీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. సత్తుపల్లి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ పలుమార్లు విజయం సాధించడంతో నియోజకవర్గంలో కాంగ్రెస్‌కు ఓటు బ్యాంక్ ఉండటంతో ఆ పార్టీతో మైత్రి కుదిరితే టీడీపీకి ప్రయోజనమేనని ఆ పార్టీ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఇక మాజీ ఎంపీ నామా సైతం పార్టీ మారడంకన్నా కాంగ్రెస్‌తో ఎన్నికల మైత్రి ఉంటే.. కాంగ్రెస్ పార్టీ తమకు సీటు కేటాయించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నట్లు పార్టీ వర్గాల్లో బహిరంగంగానే ప్రచారం జరుగుతోంది. ఇక ద్వితీయ శ్రేణి నేతలు పార్టీ మారినా ఇతర ప్రధాన రాజకీయ పక్షాల్లో తమకు సరైన ప్రా«ధాన్యం లభించే అవకాశం లేదని, టీఆర్ఎస్లో చేరిన అనేక మంది ద్వితీయ శ్రేణి నేతల్లో సైతం పార్టీ మారి సాధించింది ఏమీ లేదన్న భావన వ్యక్తం చేస్తున్న సమయంలో ఏ నిర్ణయం తీసుకోలేక పలువురు నేతలు మల్లగుల్లాలు పడుతున్నారు. మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో టీడీపీకి చెందిన ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి.. కాంగ్రెస్‌లోకి వెళ్లడంతో రాష్ట్రంలో టీడీపీ తరఫున గెలిచిన ఎమ్మెల్యేలు ఆర్.కృష్ణయ్య, సండ్ర వెంకటవీరయ్య మాత్రమే ఆ పార్టీలో మిగిలారు. సండ్రకు మరోసారి టీటీడీ బోర్డు సభ్యుడి పదవి అప్పగించడం ద్వారా పార్టీలో వెంకటవీరయ్యకు తగిన ప్రాధాన్యం ఇస్తున్నామన్న సంకేతాలు పంపేందుకు, తద్వారా పార్టీలో వలసలను నివారించేందుకు టీడీపీ ప్రయత్నం చేస్తుందని పార్టీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. అయితే జిల్లాలో ఒకప్పుడు ఒక వెలుగు వెలిగిన టీడీపీ ఇప్పుడు ఆ పార్టీ ప్రభ కొడిగట్టిన దీపంలా అవడంతో మండల, నియోజకవర్గ స్థాయి నేతలు ఇతర పార్టీల వైపు మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. -
టీఆర్ఎస్లోకి సండ్రకు ఆహ్వానం
అసెంబ్లీ ఆవరణలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రసమయి, వేముల వీరేశం, బాలరాజు టీటీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యల మధ్య బుధవారం ఆసక్తికర చర్చ జరిగింది. టీఆర్ఎస్లోకి రావాలంటూ సండ్రను ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఆహ్వానించారు. ‘మీరే టీడీపీలోకి రండి.. దొరల పాలన మనకొద్దు’అని సండ్ర చమత్కరించారు. బడుగులకు ఎన్టీఆర్ అండగా నిలిచారని సండ్ర అనగా.. ఎన్టీఆర్ కూడా దొరే అని బాలరాజు సమాధానం ఇచ్చారు. ‘ఆయన దొరనే కానీ ఆలోచనలు బడుగులవి..’అని సండ్ర చెప్పుకొచ్చారు. ఎన్టీఆర్ కన్నా కేసీఆర్ బడుగుల గురించి బాగా ఆలోచిస్తున్నారని టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మూకుమ్మడిగా జవాబిచ్చారు. -
జైలు నుంచి ఎమ్మెల్యే సండ్ర విడుదల
హైదరాబాద్: ఓటుకు కోట్లు కేసులో అరెస్టయిన తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య విడుదలయ్యారు. మంగళవారం సాయంత్రం చర్లపల్లి జైలు నుంచి సండ్ర బెయిల్‌పై బయటకు వచ్చారు. ఈ రోజు ఏసీబీ కోర్టు సండ్ర వెంకట వీరయ్యకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. నియోజకవర్గం దాటి వెళ్లకూడదని ఏసీబీ కోర్టు సండ్రకు షరతు విధించింది. కోర్టు ఆదేశాల మేరకు సండ్ర న్యాయవాదులు రూ. 2 లక్షలను పూచీకత్తుగా చెల్లించారు. తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల సందర్బంగా వెలుగుచూసిన ఓటుకు కోట్లు కేసులో ఖమ్మం జిల్లా సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్రను ఏసీబీ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.