
అసెంబ్లీ ఆవరణలో టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు రసమయి, వేముల వీరేశం, బాలరాజు టీటీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యల మధ్య బుధవారం ఆసక్తికర చర్చ జరిగింది. టీఆర్‌ఎస్‌లోకి రావాలంటూ సండ్రను ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఆహ్వానించారు. ‘మీరే టీడీపీలోకి రండి.. దొరల పాలన మనకొద్దు’అని సండ్ర చమత్కరించారు. బడుగులకు ఎన్టీఆర్ అండగా నిలిచారని సండ్ర అనగా.. ఎన్టీఆర్ కూడా దొరే అని బాలరాజు సమాధానం ఇచ్చారు. ‘ఆయన దొరనే కానీ ఆలోచనలు బడుగులవి..’అని సండ్ర చెప్పుకొచ్చారు. ఎన్టీఆర్ కన్నా కేసీఆర్ బడుగుల గురించి బాగా ఆలోచిస్తున్నారని టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు మూకుమ్మడిగా జవాబిచ్చారు.