కాంగ్రెస్‌లో చేరిన మైనంపల్లి, వేముల వీరేశం | Mynampally Hanumantha Rao And Vemula Veeresham Joined In Congress | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌లో చేరిన మైనంపల్లి, వేముల వీరేశం

Published Thu, Sep 28 2023 8:24 PM | Last Updated on Thu, Sep 28 2023 9:00 PM

Mynampally Hanumantha Rao And Vemula Veeresham Joined In Congress - Sakshi

సాక్షి, ఢిల్లీ: తెలంగాణ కాంగ్రెస్‌లో కీలక పరిణామం చోటుచేసుకుంది. మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు, భువనగిరి మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం కాంగ్రెస్‌ పార్టీలో చేరిపోయారు. వీరితో పాటుగా మైనంపల్లి కుమారుడు రోహిత్‌, కంభం అనిల్‌ కూడా హస్తం గూటికి చేరారు. వీరికి కండువా కప్పి మల్లికార్జున ఖర్గే పార్టీలోకి ఆ‍హ్వానించారు. 

ఈ కార్యక్రమంలో టీపీసీపీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి, ఏఐసీసీ ఇంఛార్జ్‌ మానిక్‌రావ్‌ ఠాక్రే ఉన్నారు. ఇక, కాంగ్రెస్‌ పార్టీలో చేరుతున్న నేపథ్యంలో ఇటీవలే మైనంపల్లి బీఆర్‌ఎస్‌ పార్టీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. కాగా, తన కుమారుడు రోహిత్‌కు బీఆర్‌ఎస్‌లో టికెట్‌ దక్కకపోవడంతో మైనంపల్లికి బీఆర్‌ఎస్‌కు రాజీనామా చేశారు. ఈ సందర్బంగా బీఆర్‌ఎస్‌లో రాజకీయ పరిణామాలపై తీవ్ర ఆరోపణలు చేశారు. 

ఈ సందర్బంగా కుంభం అనిల్‌ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీలో చేరడం సంతోషంగా ఉంది. నేను కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వెళ్లడం వల్ల కేడర్‌కు దూరం అయ్యాను. భువనగిరి ప్రజల ఆలోచనతో  మళ్ళీ పార్టీలోకి వచ్చాను. భువనగిరిలో కాంగ్రెస్‌ గెలుపు కోసం పనిచేస్తాను. టికెట్‌ కేటాయింపు అంశం అధిష్టానం చూసుకుంటుంది. 

ఇది కూడా చదవండి: ‘రాష్ట్రంలో ఏ పార్టీకీ గెలిచే బలం లేదు. నేను బీజేపీలోనే ఉంటా’

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement