Mynampally Hanumantha Rao
-
కేటీఆర్ ను విమర్శించే స్థాయి మైనంపల్లికి లేదు: మర్రి రాజశేఖర్ రెడ్డి
-
తగ్గేదేలే..వామ్మో గివేం మాటలు...
-
రెండుచోట్లా మైనంపల్లికి బీఆర్ఎస్ చెక్.
సాక్షి, హైదరాబాద్: మల్కాజిగిరి అసెంబ్లీ నియోజకవర్గ టికెట్ కేటాయించినా ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు పార్టీని వీడటాన్ని బీఆర్ఎస్ తీవ్రంగా పరిగణిస్తోంది. మల్కాజ్గిరి నుంచి మైనంపల్లి, మెదక్ నుంచి ఆయన కుమారుడు రోహిత్‌రావు కాంగ్రెస్ అభ్యర్థులుగా వచ్చే ఎన్నికలలో పోటీ చేయడం దాదాపు ఖాయమైంది. ఈ నేపథ్యంలో ఈ రెండు చోట్లా మైనంపల్లిని కట్టడి చేసేందుకు బీఆర్ఎస్ పావులు కదుపుతోంది. అందులో భాగంగా మెదక్ నుంచి టికెట్ ఆశించి భంగపడిన డీసీసీ అధ్యక్షుడు కంఠారెడ్డి తిరుపతిరెడ్డి, మల్కాజ్గిరి టికెట్ ఆశించిన నందికంటి శ్రీధర్‌ను బీఆర్ఎస్లో చేర్చుకునేందుకు మంతనాలు జరుగుతున్నాయి. మెదక్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా ఉన్న తిరుపతిరెడ్డి మూడ్రోజుల క్రితం తన పదవికి, పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. తాజాగా మల్కాజ్గిరి డీసీసీ అధ్యక్షుడు నందికంటి శ్రీధర్ కూడా కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఏళ్లుగా పార్టీని అంటిపెట్టుకొని సేవలందిస్తున్న తమను కాదని కొత్తగా పార్టీలో చేరిన మైనంపల్లి కుటుంబానికి రెండు టికెట్లు కేటాయించడాన్ని అటు తిరుపతిరెడ్డి, ఇటు నందికంటి శ్రీధర్ ప్రశ్నిస్తున్నారు. కాగా, కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన ఈ ఇద్దరు నేతలను బీఆర్ఎస్లో చేర్చుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. బీఆర్ఎస్లో తిరుపతిరెడ్డి చేరికకు సంబంధించి మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి నివాసంలో చర్చలు జరిగినట్లు విశ్వసనీయ సమాచారం. చదవండి: లండన్‌లో హైదరాబాద్ వాసి దారుణ హత్య -
కాంగ్రెస్‌లో చేరిన మైనంపల్లి, వేముల వీరేశం
సాక్షి, ఢిల్లీ: తెలంగాణ కాంగ్రెస్‌లో కీలక పరిణామం చోటుచేసుకుంది. మల్కాజ్గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు, భువనగిరి మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. వీరితో పాటుగా మైనంపల్లి కుమారుడు రోహిత్, కంభం అనిల్ కూడా హస్తం గూటికి చేరారు. వీరికి కండువా కప్పి మల్లికార్జున ఖర్గే పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో టీపీసీపీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, ఏఐసీసీ ఇంఛార్జ్ మానిక్రావ్ ఠాక్రే ఉన్నారు. ఇక, కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న నేపథ్యంలో ఇటీవలే మైనంపల్లి బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. కాగా, తన కుమారుడు రోహిత్‌కు బీఆర్ఎస్లో టికెట్ దక్కకపోవడంతో మైనంపల్లికి బీఆర్ఎస్కు రాజీనామా చేశారు. ఈ సందర్బంగా బీఆర్ఎస్లో రాజకీయ పరిణామాలపై తీవ్ర ఆరోపణలు చేశారు. #WATCH | Delhi: BRS MLA Mynampally Hanumantha Rao along with his son joined the Congress Party in the presence of the Congress president Mallikarjun Kharge and party's Telangana unit chief Anumula Revanth Reddy. BRS Ex MLA Vemula Veeresham also joined the party today. pic.twitter.com/rLG2pMHcgL — ANI (@ANI) September 28, 2023 ఈ సందర్బంగా కుంభం అనిల్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీలో చేరడం సంతోషంగా ఉంది. నేను కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వెళ్లడం వల్ల కేడర్‌కు దూరం అయ్యాను. భువనగిరి ప్రజల ఆలోచనతో మళ్ళీ పార్టీలోకి వచ్చాను. భువనగిరిలో కాంగ్రెస్ గెలుపు కోసం పనిచేస్తాను. టికెట్ కేటాయింపు అంశం అధిష్టానం చూసుకుంటుంది. ఇది కూడా చదవండి: ‘రాష్ట్రంలో ఏ పార్టీకీ గెలిచే బలం లేదు. నేను బీజేపీలోనే ఉంటా’ -
ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు ఇంటికి కాంగ్రెస్ నేతలు
-
కాంగ్రెస్‌లో చేరాలని డిసైడ్ అయ్యా: మైనంపల్లి
సాక్షి, హైదరాబాద్: మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు కాంగ్రెస్‌లో చేరేందుకు రంగం సిద్ధమైంది. ఈ నెల 27వ తేదీన ఢిల్లీకి వెళ్లి.. కాంగ్రెస్ మాజీ అధినేత్రి సోనియా గాంధీ సమక్షంలోనే ఆయన కండువా కప్పుకోనున్నారు. ఇదే విషయాన్ని ఆయన స్వయంగా తెలియశారు. ‘‘ఈనెల 27న సోనియా సమక్షంలో కాంగ్రెస్‌లో చేరుతున్నా. మల్కాజిగిరి, మెదక్ టికెట్ నాకు, నా కుమారుడికి, అలాగే.. మేడ్చల్ టికెట్ నక్కా ప్రభాకర్‌గౌడ్‌కు ఇవ్వమని కాంగ్రెస్ అధిష్టానాన్ని కోరాను. సర్వేల ఆధారంగా టికెట్ ఇస్తామని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ గాలికి పెద్ద వాళ్లు కొట్టుకుపోవడం ఖాయం అని మైనంపల్లి వ్యాఖ్యానించారు. మరోవైపు మైనంపల్లిని అఫీషియల్‌గా పార్టీలోకి ఆహ్వానించేందుకు సోమవారం మైనంపల్లి నివాసానికి కాంగ్రెస్ నేతలు క్యూ కట్టారు. అంజన్ కుమార్ యాదవ్, దామోదర రాజనరసింహ తదితరులు దూలపల్లిలోని మైనంపల్లి ఇంటికి చేరుకుంటున్నారు. బ్రేక్‌ఫాస్ట్ మీట్లో పాల్గొని చర్చలు జరిపారు. ఇదిలా ఉంటే.. రెండ్రోజుల కిందట బీఆర్ఎస్కు మైనంపల్లి రాజీనామా ప్రకటించారు. తనకు మల్కాజ్గిరి, తన కొడుక్కి మెదక్ సీట్ల ఒప్పందంతోనే ఆయన కాంగ్రెస్‌లో చేరుతారనే ప్రచారం మొదటి నుంచి జరుగుతోంది. మైనంపల్లితోపాటు మరో నలుగురు బీఆర్ఎస్ కార్పొరేటర్లు కూడా కాంగ్రెస్ కండువా కప్పుకోబోతున్నట్టు సమాచారం. ఇప్పటికే మైనంపల్లితో కాంగ్రెస్ కీలక నేతలు దఫదఫాలుగా చర్చలు జరిపారు. చివరకు తండ్రీకొడుకులకు సీట్లు ఇచ్చేందుకు కాంగ్రెస్ అధిష్ఠానం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతోనే ఆయన ఆ పార్టీ తీర్థం పుచ్చుకునేందుకు రెడీ అయినట్టు తెలుస్తోంది. -
ఎమ్మెల్యే మైనంపల్లి ఇంట్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల సమావేశం
-
మా సమావేశానికి కారణం మంత్రి మల్లారెడ్డే: ఎమ్మెల్యే మైనంపల్లి
-
రహస్య భేటీ కాదు.. మంత్రి మల్లారెడ్డే కారణం: ఎమ్మెల్యే మైనంపల్లి
సాక్షి, హైదరాబాద్: మల్కాజ్గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు నివాసంలో సోమవారం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సమావేశం అయిన విషయం తెలిసిందే. మంత్రి మల్లారెడ్డిపై అసమ్మతితోనే ఈ ఎమ్మెల్యేలు భేటీ నిర్వహించినట్లు స్పష్టమవుతోంది. ఈ సమావేశానికి ఎమ్మెల్యేలు అరికపూడి గాంధీ(శేరిలింగంపల్లి), వివేక్ గౌడ్ (కుత్బుల్లాపూర్), మాధవరం కృష్ణారావు(కూకట్పల్లి), బి సుభాష్‌రెడ్డి(ఉప్పల్) హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు మాట్లాడుతూ.. తమ సమావేశానికి మంత్రి మల్లారెడ్డే కారణమని తెలిపారు. పదవులు తీసుకున్న వాళ్లే 3,4 పదవులు తీసుకున్నారని మైనంపల్లి ఆరోపించారు. కార్యకర్తల సమస్యలపై ఎమ్మెల్యేలు కలవడం తప్పా అని ప్రశ్నించారు. ప్రతి దాన్నీ రాజకీయం చేయాల్సిన అవసరం తమకు లేదని స్పష్టం చేశారు. ఇది రహస్య సమావేశం కాదని.. కార్యకర్తల కోసమే భేటి అయినట్లు తెలిపారు. ప్రతి నియోజకవర్గంలో కేడర్ ఇబ్బందులు పడుతోందని, కేడర్ గురించి మాట్లాడకపోతే డమ్మీలవుతామని అన్నారు. చదవండి: మేడ్చల్ బీఆర్ఎస్లో కోల్డ్‌వార్.. మంత్రి మల్లారెడ్డిపై కేటీఆర్ దగ్గరకు ఎమ్మెల్యే పంచాయితీ! కార్యకర్తల గురించి ఆలోచించాల్సిన బాధ్యత మంత్రికి లేదా అని మైనంపల్లి ప్రశ్నించారు. కేడర్ కష్టపడి పనిచేస్తోందని.. వారికి న్యాయం జరగాలని అన్నారు. ఎవరో చేసిన దానికి పార్టీ డ్యామేజ్ అవుతోందని ఆరోపించారు. నిజాయితీగా పనిచేసే కార్యకర్తలకు అన్యాయం జరుగుతోందన్నారు. పనిచేసే క్యాడర్‌ను కాపాడుకోవాలని, సిస్టమ్‌లో మార్పు రావాలని ఆకాక్షించారు. ‘ఎవరో ఒకరు చెప్పకపోతే సమస్యలు ఎలా తెలుస్తాయి. మా సమావేశం తప్పేమీ కాదు. మంత్రి కేటీఆర్‌ను కలవాలనుకున్నాం. ఈ సమస్య అన్ని పార్టీలో ఉంటుంది. ప్రతి నియోజకవర్గంలోనూ కేడర్‌తో ఎమ్మెల్యేలకు సమస్యలు ఉన్నాయి. కొంతమంది మంత్రులు తమ వాళ్లకు పదవులు ఇప్పించుకున్నారు. నా కొడుకు కోసం మీటింగ్ అన్న ప్రచారం నన్ను హర్ట్ చేసింది’ అని ఎమ్మెల్యే తెలిపారు. -
చిన్నారిని చదివిస్తా.. పెళ్లిచేస్తా: ఎమ్మెల్యే
సాక్షి, జగద్గిరిగుట్ట: తల్లిదండ్రులను కోల్పోయిన టీఆర్ఎస్ కార్యకర్తల పిల్లల పెళ్లిళ్లు అయ్యేంత వరకు ఆసరాగా ఉంటామని మైనంపల్లి హన్మంతరావు అన్నారు. జగద్గిరిగుట్టకు చెందిన టీఆర్ఎస్ కార్యకర్త వెంకటరమణ కుమార్తె వరకట్న వేధింపుల కారణంగా ఆత్మహత్య చేసుకుంది. ఆమెకు 6 సంవత్సరాల కుమార్తె ఉండటంతో చిన్నారి ఆలనా పాలనా చూసేందుకు మల్కాజ్గిరి ఎమ్మెల్యే మైనంపలి హన్మంతరావు ముందుకొచ్చారు. ఆర్థికంగా ఆదుకుంటానని హామీ ఇచ్చారు. అనంతరం వెంకటరమణ కరోనాతో మృతి చెందాడు. విషయం తెలుసుకున్న మైనంపల్లి హన్మంతరావు స్పందించారు. ఆదివారం జగద్గిరిగుట్టకు చేరుకున్న ఆయన మైనంపల్లి సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ తరఫున రూ.5 లక్షల చెక్కును స్థానిక ఎమ్మెల్యే వివేకానంద్‌తో కలిసి బాధిత కుటుంబానికి అందజేశారు. చిన్నారి చదువుతో పాటు పెళ్లి అయ్యేంత వరకు పూర్తి బాధ్యత తనదేనని స్పష్టం చేశారు. కార్పొరేటర్లు జగన్, మంత్రి సత్యనారాయణ, రావుల శేషగిరి, టీఆర్ఎస్ నాయకులు జైహింద్, రాజేష్, సయ్యద్ రషీద్, ఎర్ర యాకయ్య, సాజిద్, మారయ్య, రుద్ర అశోక్, ఇతర కార్పొరేటర్లు తదితరులు ఉన్నారు. -
టీఆర్ఎస్ గ్రేటర్ అధ్యక్షునిగా మైనంపల్లి
సాక్షి, సిటీబ్యూరో: తెలంగాణ రాష్ట్ర సమితి గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షునిగా మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సోమవారం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన ఎన్నికల్లో అధ్యక్ష పదవికి హన్మంతరావు తరపున మంత్రులు కేటీఆర్, మహమ్మూద్ అలీలు నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. ఈ పదవికి మిగిలిన వారెవరూ పోటీకి రాకపోవటంతో హ న్మంతరావు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి ప్రకటించారు. తెలుగుదేశం పార్టీలో రెండు మార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన హన్మంతరావు గత ఎన్నికల్లో మల్కాజిగిరి లోక్‌సభ స్థానానికి టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేశారు. జీహెచ్ఎంసీ ఎన్నికలే లక్ష్యం త్వరలో జరిగే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో విజయమే తన లక్ష్యమని హన్మంతరావు ప్రకటించారు. అధ్యక్షునిగా ఎన్నికైన అనంతరం ఆయన్ను మంత్రులు కేటీర్, నాయిని నర్సింహారెడ్డి, పద్మారావు, శ్రీనివాసయాదవ్ తదితరులు అభినందించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో మంత్రులు మాట్లాడుతూ జీహెచ్ఎంసీపై గులాబీ జెండా ఎగురవేసే దిశగా హన్మంతరావు ఆధ్వర్యంలో శ్రేణులు పనిచేయాలని పిలుపునిచ్చారు. అధ్యక్షునిగా ఎన్నికైన హన్మంతరావు మాట్లాడుతూ గ్రేటర్లో అన్ని వర్గాలను కలుపుకు పోయి అన్ని వార్డులు, డివిజన్లలో పార్టీని బలోపేతం చేసి, ఎన్నికల్లో విజయం సాధించే లక్ష్యంతో పనిచేస్తామని, తనపై కేసీఆర్ ఉంచిన నమ్మకాన్ని వమ్ముచేయనని ప్రకటించారు. ప్లీనరీ తర్వాత కార్యవర్గం: పార్టీ ప్లీనరి ముగిసిన అనంతరం గ్రేటర్ కార్యవర్గాన్ని విస్తరించనున్నారు. కార్యవర్గం మొత్తం 52 మందికి మించకుండా నియామకాలు చేయనున్నారు. అందులో ముగ్గురు ఉపాధ్యక్షులు, ఒక ప్రధాన కార్యదర్శి, ముగ్గురు చొప్పున ప్రచార, సహాయ కార్యదర్శులతో పాటు 27 మంది కార్యవర్గ సభ్యులను నియమిస్తారు. -
రేవంత్‌రెడ్డి కళ్లున్న గుడ్డివాడు: మైనంపల్లి
ముషీరాబాద్: టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి కళ్లున్న గుడ్డివాడని, ఆయన కళ్లు తెరిచి తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధిని చూడాలని టీఆర్ఎస్ గ్రేటర్ హైదరాబాద్ కన్వీనర్ మైనంపల్లి హనుమంతారావు అన్నారు. శుక్రవారం రాంనగర్ డివిజన్లో నిర్వహించిన సభ్యత్వ నమోదు కార్యక్రమానికి హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డితో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రేవంత్‌రెడ్డి మంచి వక్త అనడంలో ఎలాంటి సందేహం లేదని, ఆయన మాటలు మాని చేతల్లో చూపించాలన్నారు. తమలాంటి వారిని చూసి బుద్ధి తెచ్చుకోవాలని హితవుపలికారు. తెలంగాణ అభివృద్ధిలో పాలుపంచుకోవాలనే ఉద్దేశంతో టీఆర్ఎస్లో చేరాననన్నారు. అనవసర ఆరోపణలు చేస్తే ప్రజలు చూస్తూ ఊరుకోరని, ఆయనకు బుద్ది చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయన్నారు. సమస్యలపై ఫిర్యాదు చేయడానికి పోలీసు స్టేషన్‌కు వచ్చి వారి పట్ల మర్యాదగా వ్యవహరించాలని, ఈ విషయంలో ఆరోపణలు వస్తే కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి హెచ్చరించారు. కార్యక్రమంలో నాయకులు వి.శ్రీనివాస్‌రెడ్డి, ముఠా గోపాల్, బద్దంమోహన్రెడ్డి, ఫిరంగి నాగరాజు, పాండు రంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
స్వయంకృతం!
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి : అతివిశ్వాసం కాంగ్రెస్ పుట్టిముంచింది. మెజార్టీ సీట్లు గెలుచుకుంటామని బీరాలు పలికిన ఆ పార్టీని చావుదెబ్బతీసింది. కేవలం రెండు సీట్లకే పరిమితం కావడం... అవి కూడా అత్తెసరు ఓట్లతో గట్టెక్కడం చూస్తే ఆ పార్టీ వైఫల్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. 2009లో కాంగ్రెస్ ఎనిమిది చోట్ల విజయం సాధించింది. ఈ సారి ఆ స్థాయిలో సీట్లు దక్కకపోగా.. చాలాచోట్ల మూడో స్థానానికి దిగజారింది. మల్కాజిగిరి, ఉప్పల్, ఇబ్రహీంపట్నం, శేరిలింగంపల్లి, కుత్బుల్లాపూర్, కూకట్పల్లి, మేడ్చల్, ఎల్బీనగర్ నియోజకవర్గాల్లో ప్రత్యర్థుల చేతిలో కాంగ్రెస్ మట్టికరిచింది. ఈ స్థానాల్లో ఓటమి పాలవడమే కాకుండా టీఆర్ఎస్ / స్వతంత్ర అభ్యర్థుల కంటే వెనుకబడింది. పార్టీ గ్రాఫ్ ఈ స్థాయిలో పడిపోవడానికి ప్రధాన కారణం సమన్వయలేమి, నేతల అంతర్గత కలహాలే. టికెట్ ఆశించి భంగపడ్డ నేతలను బుజ్జగించాల్సిన అధిష్టానం... పట్టించుకోకపోవడంతో పార్టీ నడ్డివిరిగింది. కుత్బుల్లాపూర్, ఎల్బీనగర్, ఇబ్రహీంపట్నం, మల్కాజిగిరి నియోజకవర్గాల్లో సీట్లు ఆశించిన ఆశావహులు టికెట్ రాకపోవడంతో ఇతర పార్టీల్లోకి జంప్ చేయడమేగాకుండా ఆ పార్టీ తరఫున బరిలో దిగారు. దీంతో చాలా స్థానాల్లో కాంగ్రెస్ ఓటు బ్యాంకుకే చిల్లు పడింది. మరోవైపు అసంతుష్టులను దారిలో తెచ్చేందుకు కూడా పార్టీ నాయకత్వం చొరవచూపలేదు. ప్రజా వ్యతిరేకత తీవ్రంగా మూటగట్టుకోవడం, టీఆర్ఎస్, మోడీ హవా ఉందని పసిగట్టినా దాన్ని నివారించే ప్రయత్నం చేయకపోవడంతో ఘోర పరాజయాన్ని మూటగ ట్టుకుంది. ఇబ్రహీంపట్నంలో పార్టీ ఓడిపోవడానికిప్రధాన కారణం తిరుగుబాటు అభ్యర్థి. స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగిన మల్రెడ్డి రాంరెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీకి చెందిన వారే కావడం, ఆయనకు మరికొందరు పార్టీ నేతలు సహకరించడంతో పార్టీ అభ్యర్థి క్యామ మల్లేశ్ పరాజయానికి దారితీసింది. కాంగ్రెస్ ఓట్లే స్వతంత్ర అభ్యర్థి ఖాతాలోకి వెళ్లడంతో టీడీపీ ఇక్కడ సలువుగా విజయం సాధించింది. మల్కాజిగిరిలో సిట్టింగ్ ఎమ్మెల్యే ఆకుల రాజేందర్, ఎల్బీ నగర్లో ఎం.రామ్మోహన్‌గౌడ్, కుత్బుల్లాపూర్‌లో హన్మంతరెడ్డి టికెట్టు రాకపోవడంతో చివరి నిమిషంలో కారెక్కారు. ఆ పార్టీ తరఫున బరిలోకి దిగడం కాంగ్రెస్ ఓట్లలో చీలిక తెచ్చింది. ఇది ప్రత్యర్థి పార్టీని విజయతీరాలకు చేర్చింది. వికారాబాద్లోను ఒకవర్గం వ్యతిరేకంగా పనిచేయడం కూడా మాజీ మంత్రి ప్రసాద్‌కుమార్ ఓటమి కారణంగా విశ్లేషించుకోవచ్చు. ఇదే పరిస్థితి పార్లమెంటు స్థానాల్లోను స్పష్టమైంది. అటు మల్కాజిగిరి, ఇటు చేవెళ్ల లోక్‌సభ స్థానాల్లో భారీ క్రాస్ ఓటింగ్ జరిగింది. స్థానికంగా ఎంపీ అభ్యర్థులపై ఉన్న వ్యతిరేకత వారికి పోలైన ఓట్లలో స్పష్టమైంది. వైరం... గెలుపునకు దూరం! తెలుగుదేశం జిల్లాలో ప్రభంజనం సృష్టించినా.. కొన్ని నియోజకవర్గాలు చేజారేందుకు సీనియర్ల వ్యవహారశైలే కారణంగా కనిపిస్తోంది. ముఖ్యంగా మల్కాజిగిరిలో బీజేపీ, మేడ్చల్‌లో పార్టీ పరాజయం చవిచూసేందుకు దారితీసింది. తనకు టికెట్ దక్కకుండా రాజ్యసభ సభ్యుడు దేవేందర్‌గౌడ్ పావు లు కదపడాన్ని జీర్ణించుకోలేక మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు రాత్రికి రాత్రే పార్టీకి గుడ్‌బై చెప్పడమేగాక.. మల్కాజిగిరి ఎంపీ స్థానం నుంచి పోటీ చేశారు. మైనంపల్లికి అనుచరుడిగా పేరున్న నక్కా ప్రభాకర్‌గౌడ్‌కు కూడా టికెట్ ఇవ్వకుండా అడ్డుకట్ట వేశారు. దీంతో రెబల్‌గా బరిలో దిగిన న క్కా.. చివరి నిమిషంలో తన బాస్ మైనంపల్లిని అనుసరిం చారు. దీంతో అటు మల్కాజిగిరి, ఇటు మేడ్చల్‌లోని వీరి ప్రధాన అనుచరగణం పూర్తిగా గులాబీ పంచన చేరింది. ఈ పరిణామంతో నామమాత్రపు పోటీ ఇస్తుందనుకున్న టీఆర్ఎస్.. వీరి చేరికతో అనూహ్యంగా పుంజకుంది. ఈ రెండు స్థానాల్లో విజయబావుటా ఎగురవేసింది. చేవెళ్ల, పరిగి, తాండూరు, వికారాబాద్‌లలో పార్టీ కేడర్ పక్కచూపులు చూస్తోందని తెలుస్తున్నా జిల్లా నాయకత్వం నష్టనివారణ చర్యలకు దిగకపోవడంతో చేవెళ్ల ఎంపీ స్థానం చేజారింది. కమలం శల్య సారథ్యం! పొత్తులో భాగంగా జిల్లాలో నాలుగు సీట్లు దక్కించుకున్న బీజేపీ.. వీటిలో ఒకదాన్ని మాత్రమే గెలుచుకోగలిగింది. వికారాబాద్, పరిగిలలో మాజీ మంత్రులకు టికెట్లు ఇచ్చినా, వారి తరఫున జిల్లా నాయకత్వం కనీసం ప్రచారంచేసిన దాఖలాలు కూడా లేవు. సీనియర్లను కాదని, వలసనేతలకు సీట్లు కట్టబెట్టడంపై అసంతృప్తితోనే ప్రచారానికి దూరంగా వ్యవహరించారు. దీంతో ఈ రెండు స్థానాల్లో పార్టీకి ఘోర పరాభవం ఎదురైంది. వికారాబాద్‌లో ఐతే నాలుగో స్థానం తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. పరిగిలో మూడో స్థానానికే పరిమితమైనా, ఉప్పల్‌లో గెలుపొందడం, మల్కాజిగిరిలో దాదాపు గెలుపు దాకా వెళ్లడం పార్టీకి ఊరట కలిగించింది. ఏది ఏమైనా నాయకత్వ వైఫల్యం అభ్యర్థుల ఓటమిలో ప్రధానభూమిక పోషించిందనడం నిర్వివాదాంశం. దేశవ్యాప్తంగా నమో జపం న డుస్తున్నా దాన్ని సొమ్ము చేసుకోవడంలో స్థానిక నాయకత్వం నిర్లక్ష్యం ప్రదర్శించింది. -
టీఆర్ఎస్సా, కాంగ్రెస్సా!
చిన్నశంకరంపేట, న్యూస్‌లైన్: ఎన్నో ఎళ్లుగా టీడీపీలో కొనసాగుతున్న తెలుగు తమ్ముళ్లు పక్క చూపులు చూస్తున్నారు. తాము నమ్ముకున్న టీడీపీ జిల్లా అధ్యక్షుడు, మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు తనదారి తాను చూసుకోవడంతో తాము కూడా దారి చూసుకోక తప్పదని భావిస్తున్నారు. తాము టీఆర్ఎస్లో చేరాలా లేక ఎవరికి నచ్చిన పార్టీలో వారు చేరాలా అనే విషయమై చిన్నశంకరంపేట మండలం కార్యకర్తల్లో అంతర్మథనం జరుగుతోంది. ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు సొంతూరు మండలంలోని కొర్విపల్లి కావడంతో ఆయనపై గౌరవంతో ఇన్నాళ్లు టీడీపీలో కొనసాగిన తాము ఆయనే పార్టీ మారడంతో ఇన్నాళ్లు కష్టనష్టాలకు ఓర్చి టీడీపీ అభివృద్ధికి చేసిన శ్రమ బూడిదలో పోసిన పన్నీరైందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొన్ని గ్రామాల్లో టీఆర్ఎస్తో కలిసిపోలేనంత స్థాయిలో విభేధాలుండడంతో కొందరు టీడీపీ కార్యకర్తలు కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. స్థానిక ఎన్నికలు జరిగే వరకు వేచి ఉండి ఆదివారం మండలంలోని నాయకులు, కార్యకర్తల సమావేశం నిర్వహించి ఏదో ఒక నిర్ణయం తీసుకుందామని నిర్ణయించుకున్నారు. అంతా కలిసే ఒక తీసుకునేందుకే ఈ సమావేశం నిర్వహిస్తున్నట్లు పార్టీ సీనీయర్ నాయకుడొకరు తెలిపారు. ఆదివారం ముఖ్యకార్యకర్తల సమావేశంలో తీసుకునే నిర్ణయంపై ఇక్కడి టీడీపీ భవిష్యత్తు ఆధారపడి ఉంది. -
హనుమంతు... కుప్పిగంతు!
అభిప్రాయాలు మార్చుకుంటేనే ఆధునిక రాజకీయాల్లో రాణిస్తారనేది లోకరీతి. అందుకే కాబోలు మన నేతాశ్రీలు ఇట్టిట్టే ఓపీనియన్స్ చేంజ్ చేసుకుంటున్నారు. అక్కడితో ఆగకుండా పార్టీలు కూడా మారిపోతున్నారు. పూటకో పార్టీ మారుస్తూ ఊసరవెళ్లే ఉలిక్కి పడేలా చేస్తున్నారు. ఎన్నికల సీజన్ కావడంతో పార్టీ ఫిరాయింపులు తారాస్థాయికి చేరాయి. టిక్కెట్లు రాని నాయకులు అటు నుంచి అటే గోడ దూకేస్తున్నారు. ఎన్ని పార్టీ మారైనా టిక్కెట్ దక్కించుకోవాలన్న ఏకైక ఎజెండాతో ఎగిరిపోతున్నారు. ఇందుకు టీడీపీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు ఉదంతమే తాజా ఉదాహరణ. మల్కాజ్గిరి అసెంబ్లీ సీటు ఆశించి భంగపడ్డ మైనంపల్లి కుప్పిగంతులు వేసి చివరకు గులాబీ దళంతో జట్టుకట్టారు. కమలం పార్టీతో టీడీపీ పొత్తు పెట్టుకోవడంతో మల్కాజ్గిరి.. బీజేపీ ఖాతాలోకి వెళ్లింది. మైనంపల్లి ఆశలపై టీడీపీ నీళ్లు చల్లింది. దీంతో ఆగ్రహించిన హనుమంతు చందన్నకు బై చెప్పి ఆగమేఘాలపై హస్తినకు పయమయ్యారు. టిక్కెట్ కోసం హస్తం పార్టీలో చేరిపోయారు. నమ్మినోళ్లను నట్టేట ముంచే పార్టీగా ఘనకీర్తి గడించిన కాంగ్రెస్ అలవాటును కొనసాగించింది. చివరి నిమిషంలో మైనంపల్లికి టిక్కెట్ ఇవ్వకుండా షాక్ ఇచ్చింది. వెంటనే షాక్ నుంచి తేరుకున్న హనుమంతు హైదరాబాద్ చేరుకుని 'కారు' ఎక్కేశారు. ఉద్యమ పార్టీలోకి ఉరికి టిక్కెట్ వేటలో పడ్డారు. నామినేషన్లకు దాఖలకు చివరి రోజైనా ఆయనకు టిక్కెట్ దక్కుతుందో, లేదో చూడాలి. కొసమెరుపు: మల్కాజ్గిరి నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తానని, మరో పార్టీలో చేరబోనని టీడీపీకి రాజీనామా చేసిన తర్వాత ప్రకటించిన మైనంపల్లి హన్మంతరావు తర్వాత వెంట వెంటనే రెండు పార్టీలు మారారు. -
కారు ఎక్కిన మైనంపల్లి
హైదరాబాద్: మల్కాజ్గిరి అసెంబ్లీ టికెట్ ఆశించి భంగపడ్డ టీడీపీ నాయకుడు మైనంపల్లి హన్మంతరావు టీఆర్ఎస్లో చేరారు. కేసీఆర్ సమక్షంలో ఆయన గులాబి కండువా కప్పుకున్నారు. ఆయనతో పాటు నలుగురు కార్పొరేటర్లు కూడా టీఆర్ఎస్లో చేరారు. మల్కాజ్గిరి అసెంబ్లీ సీటు మైనంపల్లికి ఇస్తానని కేసీఆర్ హామీయిచ్చినట్టు మీడియాలో ప్రచారం జరుగుతోంది. అయితే ఈ స్థానానికి సిహెచ్ కనకారెడ్డి పేరును ఇప్పటికే టీఆర్ఎస్ ప్రకటించింది. కాంగ్రెస్ నుంచి ఇటీవలే టీఆర్ఎస్లో చేరిన సిట్టింగ్ ఎమ్మెల్యే ఆకుల రాజేందర్‌ను కాదని కనకారెడ్డి పేరును ప్రకటించడం గమనార్హం. అయితే ఆకుల రాజేందర్ పార్లమెంట్‌కు పోటీ చేసే అవకాశముందని పార్టీ వర్గాలు చెప్తుతున్నాయి. -
బాబుకు మైనంపల్లి.. మైనంపల్లికి కాంగ్రెస్.. షాక్
సాక్షి, న్యూఢిల్లీ: తెలుగు దేశం, బీజేపీ పొత్తుతో మల్కాజ్‌గిరీ అసెంబ్లీ సీటు ఆశించి భంగపడ్డ టీడీపీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుకు షాక్ ఇచ్చారు. ఢిల్లీకి వచ్చిన ఆయన కాంగ్రెస్‌లో చేరారు. సోమవారం ఉదయం ఆయనను వెంటపెట్టుకుని వచ్చిన టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య స్వయంగా తన కారులో తీసుకెళ్లి మరీ దిగ్విజయ్‌తో సమావేశపర్చారు. వార్‌రూంలో ఏపీ లోక్‌సభ, శాసనసభ అభ్యర్థుల జాబితాకు సంబంధించి కాంగ్రెస్ భేటీ జరుగుతుండగానే ఇద్దరు నేతలు ఒకే కారులో వార్‌రూంకి చేరుకున్నారు. దాదాపు అరగంటపాటు భేటీ అయిన అనంతరం తిరిగి వెళ్లారు. ఇంకేముంది మైనంపల్లి మల్కాజ్గిరి కాంగ్రెస్ టికెట్ కన్ఫర్మ్ అని అంతా అనుకున్నారు. తీరా సోమవారం సాయంత్రం జాబితాలో మరొకరి పేరు చూసి షాక్ తినడం మైనంపల్లి వంతైంది. కాంగ్రెస్సా... మజాకా!. -
టీడీపీకి వలసల భయం
* దేశం నేతల్లో పొత్తు చిచ్చు * బీజేపీకి కేటాయించిన స్థానాల్లో రేగుతున్న అసంతృప్తి * పార్టీని వీడేందుకూ సిద్ధమవుతున్న తమ్ముళ్లు * ఎమ్మెల్యే మైనంపల్లి రాజీనామా * కమలనాథుల సీట్లను వెల్లడించకుండా బాబు వ్యూహం * చివరి నిమిషంలోనే ప్రకటించే అవకాశం సాక్షి, హైదరాబాద్: బీజేపీతో జతకట్టి ఎన్నికల బరిలోకి దిగుతున్న తెలుగుదేశం పార్టీకి వలసల భయం పట్టుకుంది. కమలానికి కేటాయించిన నియోజకవర్గాల్లోని పార్టీ నాయకులు గడప దాటకుండా చూసేందుకు టీడీపీ అధినేత నానా తంటాలు పడుతున్నారు. నామినేషన్ల దాఖలుకు ఈ నెల 9 వరకు గడువున్నందున చివరి నిమిషం వరకూ బీజేపీకి కేటాయించిన సీట్ల గురించి వివరాలు బయటకు పొక్కకుండా చంద్రబాబు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. శనివారం రాత్రి నుంచి ఆదివారం తెల్లవారుజాము వరకు చంద్రబాబు నివాసంలో కమలనాథులతో జరిపిన పొత్తు చర్చల్లో పాల్గొన్న నాయకులకు కూడా ఈ మేరకు ఆదేశాలు అందినట్లు సమాచారం. ఆదివారం మధ్యాహ్నం బీజేపీ నేతలతో కలిసి మీడియాతో మాట్లాడినప్పుడు కూడా రెండు రోజుల్లో సీట్ల వివరాలు ప్రకటిస్తామని మాత్రమే టీడీపీ నేతలు ప్రకటించారు. పొత్తులో భాగంగా బీజేపీకి తెలంగాణలో 47 అసెంబ్లీ సీట్లను కేటాయించడంతో కష్టకాలంలో కూడా పార్టీ జెండా మోస్తున్న నాయకులు ఇప్పటికే ఆగ్రహంగా ఉన్నారు. ఇప్పటికే నామినేషన్లు దాఖలు చేసిన పలువురు టీడీపీ నేతలు అవసరమైతే ఇతర పార్టీల నుంచి బరిలో నిలుస్తామని బాహాటంగానే హెచ్చరిస్తున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకునే అవసరమైతే కొన్ని మార్పులు చేసి రెండు రోజుల్లో అభ్యర్థులను ప్రకటిస్తామని పార్టీ నాయకులు చెబుతుండటం గమనార్హం. అయితే ఇప్పటికే బీజేపీకి కేటాయించిన సీట్ల వివరాలు కొన్ని బయటకు తెలియడంతో ఆయా నియోజకవర్గాల టీడీపీ నాయకులు పార్టీ తీరుపై నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇతర పార్టీల్లో చేరేందుకు సిద్ధమవుతున్నారు. జిల్లాల వారీగా సీట్లు ఖరారైనా వలసల భయంతోనే నామినేషన్ల చివరి రోజు వరకు ప్రకటించకుండా ఆపాలని చంద్రబాబు యోచిస్తున్నారు. దేశంలో వెల్లువెత్తిన నిరసనలు హైదరాబాద్ పరిధిలోని ముషీరాబాద్, సికింద్రాబాద్, గోషామహల్, ఖైరతాబాద్ తదితర నియోజకవర్గాల నాయకులు, కార్యకర్తలు నగర టీడీపీ కార్యాలయంలో భారీ ఎత్తున సమావేశమై ‘బీజేపీ హఠావో- టీడీపీ బచావో’ నినాదాలతో హోరెత్తించారు. ఉత్తర తెలంగాణ టీడీపీ నాయకుల కోసం హైదరాబాద్‌ను బలి చేయడం భావ్యం కాదని, బీజేపీతో పొత్తు అవసరం లేదని నినదించారు. వారిని బుజ్జగించే ప్రయత్నం చేసిన మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌నే ఘెరావ్ చేశారు. అలాగే ఉప్పల్ నియోజకవర్గం సీటును ఆశించిన దేవేందర్ గౌడ్ తనయుడు వీరేందర్ గౌడ్ కూడా తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం. బీజేపీ ఒత్తిడి ఎక్కువ కావడం వల్లనే ఉప్పల్‌ను వదులుకోవాల్సి వచ్చిందని వీరేందర్ గౌడ్‌కు పార్టీ పెద్దలు నచ్చజెప్పే ప్రయత్నం చేసినట్లు తెలిసింది. మరోవైపు ఖైరతాబాద్ సీటును ఆశించిన మాజీ మంత్రి కె. విజయరామారావు కూడా అసంతృప్తికి గురయ్యారు. ఆ సీటును బీజేపీకే వదిలేయడంతో ఆయన పార్టీ మారే యోచనలో ఉన్నట్టు సమాచారం. గోషామహల్ నుంచి పోటీ చేసేందుకు అన్నీ సిద్ధం చేసుకున్న ప్రేమ్‌కుమార్ ధూత్ కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాను సోమవారం నామినేషన్ దాఖలు చేస్తున్నానని, పోటీ చేయడం ఖాయమని ఆయన ‘సాక్షి’కి తెలిపారు. ముషీరాబాద్ నాయకుడు ఎం.ఎన్. శ్రీనివాస్‌రావు కూడా అదే బాటలో ఉన్నారు. మహబూబ్‌నగర్ జిల్లా నారాయణపేట నియోజకవర్గం టీడీపీ నాయకులు ఏకంగా చంద్రబాబు నివాసం వద్ద ఆందోళన చేశారు. మహబూబ్‌నగర్‌లో బీజేపీ సిట్టింగ్ సీటు మహబూబ్‌నగర్‌తో పాటు కల్వకుర్తి, గద్వాల, షాద్‌నగర్ సీట్లను బీజేపీకి ఇచ్చినట్టు తెలియడంతో ఆ జిల్లా నాయకుల్లో నిరసన వ్యక్తమవుతోంది. కరీంనగర్ జిల్లాలో ఏకంగా ఏడు సీట్లను కూడా కేటాయించడాన్ని స్థానిక పార్టీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తా: మైనంపల్లి పొత్తులో భాగంగా మల్కాజ్గిరి సీటును బీజేపీకి కేటాయించడంతో ఆ నియోజకవర్గం టిక్కెట్ ఆశిస్తున్న మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు టీడీపీకి రాజీనామా చేశారు. ఉదయమే చంద్రబాబును కలిసి ‘మల్కాజిగిరి నుంచి టిక్కెట్టు ఇస్తామని చెప్పిన తర్వాతే మెదక్‌ను వదిలేసి స్థానికంగా కార్యక్రమాలు చేస్తున్నాను. నాకు టిక్కెట్టు రాకుండా చేయాలని రంగారెడ్డి జిల్లాకు చెందిన ఓ సీనియర్ నేత ఆరు నెలలుగా కుట్రలు పన్నుతున్నాడు. ఆయన మాటలకు తలొగ్గి మల్కాజ్గిరి స్థానాన్ని ఇప్పుడు బీజేపీకి కేటాయించడం సరికాదు’ అని తెలియజేసినట్లు సమాచారం. చంద్రబాబును కలిసి బయటకు రాగానే తాను పార్టీని వీడి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తానని, మరో పార్టీలో చేరబోనని ఆయన మీడియా ముందు ప్రకటించారు. జాహెద్ అలీఖాన్ రాజీనామా బీజేపీతో చంద్రబాబు పొత్తు కుదుర్చుకోవడాన్ని నిరసిస్తూ తెలుగుదేశం పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు జాహెద్ అలీఖాన్ తన పదవికి, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనావూ చేశారు. ఆదివారం పార్టీ అధినేతకు తన రాజీనావూ పత్రాన్ని పంపించారు. గతంలో బీజేపీలో పనిచేయుడం తప్పు అంటూ వుుస్లిం మైనార్టీలకు క్షవూపణలు చెప్పి తిరిగి పొత్తు కుదుర్చుకోవడాన్ని ఆయున తప్పుబట్టారు. మతతత్వ పార్టీతో జతకట్టడం మైనార్టీల మనోభావాలను దెబ్బతీయడమేనన్నారు. చంద్రబాబు ముస్లింలను మరోమారు మోసం చేశారన్నారు. మైనార్టీలపై అఘాయిత్యాలకు పాల్పడిన బీజే పీతో జత కట్టడంతో పార్టీలో పనిచేయడానికి మనసు అంగీకరించబోదని ఆయన స్పష్టం చేశారు. -
టీడీపీకి రాజీనామా చేసిన ఎమ్మెల్యే మైనంపల్లి
టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు వ్యవహరశైలిని నిరసిస్తూ పార్టీ రాజీనామా చేస్తున్నట్లు మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు ఆదివారం ప్రకటించారు. నాలుగేళ్ల క్రితమే మల్కాజ్గిరి సీటు ఇస్తానని బాబు తనకు హామీ ఇచ్చారని గుర్తు చేశారు. పొత్తులో భాగంగా ఇప్పుడు మల్కాజ్గిరి స్థానాన్ని బీజేపీకి కట్టబెడుతున్నారని విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో ఇండిపెండెంట్ అభ్యర్థిగా రంగంలోకి దిగనున్నట్లు మైనంపల్లి హన్మంతరావు తెలిపారు. -
ప్రజల సంక్షేమాన్ని ఏనాడూ పట్టించుకోని మైనంపల్లి
మెదక్ రూరల్, న్యూస్‌లైన్: ‘ఎమ్మెల్యేగా ఎన్నుకుంటే ప్రజలకు ఏనాడైనా అందుబాటులో ఉండి పనులు చేశారా? ఏరుదాటాక తెప్పతగిలేసిన చందంగా వ్యవహ రించారు’ అంటూ సిట్టింగ్ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావును ఉద్దేశించి మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి ఆరోపించారు. ఈనెల 6న జరుగనున్న స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా సోమవారం మండల పరిధిలోని పేరూర్, ర్యాలమడుగు గ్రామాల్లో టీఆర్ఎస్ జెడ్పీటీసీ అభ్యర్థి లావణ్యరెడ్డి, ఎంపీటీసీ అభ్యర్థి పుట్టి యాదగిరితో కలిసి ఆమె ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా పేరూర్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ 13 సంవత్సరాల పోరాట ఫలితంగానే తెలంగాణ ఏర్పాటైందన్నారు. ప్రత్యేక రాష్ట్రంకోసం వేలాది మంది విద్యార్థుల ఆత్మబలి దానాలను చూసి చలించిన టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తన ప్రాణాలను పణంగా పెట్టి 11 రోజుల పాటు ఆమరణ నిరాహరణ దీక్షచేసి రాష్ట్రాన్ని సాధించారని ఆమె పేర్కొన్నారు. తెలంగాణ పునర్నిర్మాణం కేసీఆర్‌తోనే సాధ్యమన్నారు. కాంగ్రెస్, టీడీపీలకు ఓటు వేస్తే మురికి కాలువలో వేసినట్టేనన్నారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ పద్మారావు, శ్రీనివాస్‌రెడ్డి, జె. రాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు. భర్త గెలుపు కోసం ప్రచారం... ఎన్నికల్లో పోటీచేసిన తన భర్తకోసం ఓ ఇల్లాలు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. మెదక్ మండల జెడ్పీటీసీ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీనుంచి మామిళ్ల అంజనేయులు పోటీచేసిన విషయం విదితమే. కాగా అభ్యర్థి భార్య మామిళ్ల పావని సోమవారం మండల పరిధిలోని ఔరంగాబాద్, అవుసులపల్లి గ్రామంలో ఇల్లిల్లు తిరుగుతూ మహిళలకు బొట్టుపెట్టి కాంగ్రెస్‌కు ఓటు వేసి తన భకర్తను గెలిపించాలని కోరారు. ఆమెతోపాటు కాంగ్రెస్ మహిళా నాయకులు అనురాధ, కవిత, లక్ష్మిలతో పాటు శంకర్, సుభాష్, రాజన్న తదితరులున్నారు. -
మైనంపల్లిపై బాబుకు దేవేందర్‌గౌడ్ ఫిర్యాదు
హైదరాబాద్: తెలుగుదేశం అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడుతో పొలిట్‌బ్యూరో సభ్యుడు టి. దేవేందర్‌గౌడ్ భేటీ అయ్యారు. మంగళవారం ఎన్టీఆర్భవన్లో మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు తన పీఏను దూషించటం, ఆయన అనుచరులు దాడికి పాల్పడటం గురించి ఫిర్యాదు చేశారు. పార్టీ కార్యాలయంలో ఇటువంటి ఘటనలు జరగటం ఇదే తొలిసారని, తీవ్రంగా స్పందించకపోతే ఇటువంటి ఘటనలు పునరావృతమౌతాయని చెప్పినట్లు సమాచారం. ఆ తరువాత చంద్రబాబు విలేకరులతో మాట్లాడిన సమయంలో ఒక విలేకరి ఈ ఘటనను ప్రస్తావించగా తన దృష్టికి వచ్చిందని, వారిని పిలిపించి మాట్లాడతానని చెప్పారు. ఇదిలా ఉంటే మెదక్, రంగారెడ్డి జిల్లా నేతలు పలువురు బుధవారం దేవేందర్‌గౌడ్‌ను కలిసి ఘటన వివరాలు తెలుసుకోవటంతో పాటు సంఘీభావం ప్రకటించారు.