మైనంపల్లిపై బాబుకు దేవేందర్‌గౌడ్ ఫిర్యాదు | Devender Goud Complaint to Chandrababu Naidu Against Mynampally Hanumantha Rao | Sakshi

మైనంపల్లిపై బాబుకు దేవేందర్‌గౌడ్ ఫిర్యాదు

Nov 13 2013 8:45 PM | Updated on Aug 10 2018 7:58 PM

మైనంపల్లిపై బాబుకు దేవేందర్‌గౌడ్ ఫిర్యాదు - Sakshi

మైనంపల్లిపై బాబుకు దేవేందర్‌గౌడ్ ఫిర్యాదు

మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావుపై చంద్రబాబుకు టి. దేవేందర్‌గౌడ్ ఫిర్యాదు చేశారు.

హైదరాబాద్: తెలుగుదేశం అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడుతో పొలిట్‌బ్యూరో సభ్యుడు టి. దేవేందర్‌గౌడ్ భేటీ అయ్యారు. మంగళవారం ఎన్‌టీఆర్‌భవన్‌లో మెదక్ ఎమ్మెల్యే  మైనంపల్లి హనుమంతరావు తన పీఏను దూషించటం, ఆయన అనుచరులు దాడికి పాల్పడటం గురించి ఫిర్యాదు చేశారు. పార్టీ కార్యాలయంలో ఇటువంటి ఘటనలు జరగటం ఇదే తొలిసారని, తీవ్రంగా స్పందించకపోతే ఇటువంటి ఘటనలు పునరావృతమౌతాయని చెప్పినట్లు సమాచారం.

ఆ తరువాత చంద్రబాబు విలేకరులతో మాట్లాడిన సమయంలో ఒక విలేకరి ఈ ఘటనను ప్రస్తావించగా తన దృష్టికి వచ్చిందని, వారిని పిలిపించి మాట్లాడతానని చెప్పారు. ఇదిలా ఉంటే మెదక్, రంగారెడ్డి జిల్లా నేతలు పలువురు బుధవారం దేవేందర్‌గౌడ్‌ను కలిసి ఘటన వివరాలు తెలుసుకోవటంతో పాటు సంఘీభావం ప్రకటించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement