
టీడీపీకి రాజీనామా చేసిన ఎమ్మెల్యే మైనంపల్లి
టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు వ్యవహరశైలిని నిరసిస్తూ పార్టీ రాజీనామా చేస్తున్నట్లు మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు ఆదివారం ప్రకటించారు. నాలుగేళ్ల క్రితమే మల్కాజ్గిరి సీటు ఇస్తానని బాబు తనకు హామీ ఇచ్చారని గుర్తు చేశారు. పొత్తులో భాగంగా ఇప్పుడు మల్కాజ్గిరి స్థానాన్ని బీజేపీకి కట్టబెడుతున్నారని విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో ఇండిపెండెంట్ అభ్యర్థిగా రంగంలోకి దిగనున్నట్లు మైనంపల్లి హన్మంతరావు తెలిపారు.