టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి కళ్లున్న గుడ్డివాడని, ఆయన కళ్లు తెరిచి తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధిని చూడాలని .....
ముషీరాబాద్: టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి కళ్లున్న గుడ్డివాడని, ఆయన కళ్లు తెరిచి తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధిని చూడాలని టీఆర్‌ఎస్ గ్రేటర్ హైదరాబాద్ కన్వీనర్ మైనంపల్లి హనుమంతారావు అన్నారు. శుక్రవారం రాంనగర్ డివిజన్‌లో నిర్వహించిన సభ్యత్వ నమోదు కార్యక్రమానికి హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డితో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రేవంత్‌రెడ్డి మంచి వక్త అనడంలో ఎలాంటి సందేహం లేదని, ఆయన మాటలు మాని చేతల్లో చూపించాలన్నారు. తమలాంటి వారిని చూసి బుద్ధి తెచ్చుకోవాలని హితవుపలికారు.
తెలంగాణ అభివృద్ధిలో పాలుపంచుకోవాలనే ఉద్దేశంతో టీఆర్‌ఎస్‌లో చేరాననన్నారు. అనవసర ఆరోపణలు చేస్తే ప్రజలు చూస్తూ ఊరుకోరని, ఆయనకు బుద్ది చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయన్నారు. సమస్యలపై ఫిర్యాదు చేయడానికి పోలీసు స్టేషన్‌కు వచ్చి వారి పట్ల మర్యాదగా వ్యవహరించాలని, ఈ విషయంలో ఆరోపణలు వస్తే కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి హెచ్చరించారు. కార్యక్రమంలో నాయకులు వి.శ్రీనివాస్‌రెడ్డి, ముఠా గోపాల్, బద్దంమోహన్‌రెడ్డి, ఫిరంగి నాగరాజు, పాండు రంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.