చిన్నశంకరంపేట, న్యూస్‌లైన్: ఎన్నో ఎళ్లుగా టీడీపీలో కొనసాగుతున్న తెలుగు తమ్ముళ్లు పక్క చూపులు చూస్తున్నారు. తాము నమ్ముకున్న టీడీపీ జిల్లా అధ్యక్షుడు, మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు తనదారి తాను చూసుకోవడంతో తాము కూడా దారి చూసుకోక తప్పదని భావిస్తున్నారు. తాము టీఆర్‌ఎస్‌లో చేరాలా లేక ఎవరికి నచ్చిన పార్టీలో వారు చేరాలా అనే విషయమై చిన్నశంకరంపేట మండలం కార్యకర్తల్లో అంతర్మథనం జరుగుతోంది.
ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు సొంతూరు మండలంలోని కొర్విపల్లి కావడంతో ఆయనపై గౌరవంతో ఇన్నాళ్లు టీడీపీలో కొనసాగిన తాము ఆయనే పార్టీ మారడంతో ఇన్నాళ్లు కష్టనష్టాలకు ఓర్చి టీడీపీ అభివృద్ధికి చేసిన శ్రమ బూడిదలో పోసిన పన్నీరైందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొన్ని గ్రామాల్లో టీఆర్‌ఎస్‌తో కలిసిపోలేనంత స్థాయిలో విభేధాలుండడంతో కొందరు టీడీపీ కార్యకర్తలు కాంగ్రెస్ వైపు చూస్తున్నారు.
స్థానిక ఎన్నికలు జరిగే వరకు వేచి ఉండి ఆదివారం మండలంలోని నాయకులు, కార్యకర్తల సమావేశం నిర్వహించి ఏదో ఒక నిర్ణయం తీసుకుందామని నిర్ణయించుకున్నారు. అంతా కలిసే ఒక తీసుకునేందుకే ఈ సమావేశం నిర్వహిస్తున్నట్లు పార్టీ సీనీయర్ నాయకుడొకరు తెలిపారు. ఆదివారం ముఖ్యకార్యకర్తల సమావేశంలో తీసుకునే నిర్ణయంపై ఇక్కడి టీడీపీ భవిష్యత్తు ఆధారపడి ఉంది.
టీఆర్‌ఎస్సా, కాంగ్రెస్సా!
Published Sun, Apr 13 2014 1:14 AM | Last Updated on Wed, Aug 29 2018 8:56 PM
Advertisement
Advertisement