మెదక్ రూరల్, న్యూస్‌లైన్: ‘ఎమ్మెల్యేగా ఎన్నుకుంటే ప్రజలకు ఏనాడైనా అందుబాటులో ఉండి పనులు చేశారా? ఏరుదాటాక తెప్పతగిలేసిన చందంగా వ్యవహ రించారు’ అంటూ సిట్టింగ్ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావును ఉద్దేశించి మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి ఆరోపించారు. ఈనెల 6న జరుగనున్న స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా సోమవారం మండల పరిధిలోని పేరూర్, ర్యాలమడుగు గ్రామాల్లో టీఆర్‌ఎస్ జెడ్పీటీసీ అభ్యర్థి లావణ్యరెడ్డి, ఎంపీటీసీ అభ్యర్థి పుట్టి యాదగిరితో కలిసి ఆమె ప్రచారం నిర్వహించారు.
ఈ సందర్భంగా పేరూర్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ 13 సంవత్సరాల పోరాట ఫలితంగానే తెలంగాణ ఏర్పాటైందన్నారు. ప్రత్యేక రాష్ట్రంకోసం వేలాది మంది విద్యార్థుల ఆత్మబలి దానాలను చూసి చలించిన టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ తన ప్రాణాలను పణంగా పెట్టి 11 రోజుల పాటు ఆమరణ నిరాహరణ దీక్షచేసి రాష్ట్రాన్ని సాధించారని ఆమె పేర్కొన్నారు. తెలంగాణ పునర్నిర్మాణం కేసీఆర్‌తోనే సాధ్యమన్నారు. కాంగ్రెస్, టీడీపీలకు ఓటు వేస్తే మురికి కాలువలో వేసినట్టేనన్నారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ పద్మారావు, శ్రీనివాస్‌రెడ్డి, జె. రాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
భర్త గెలుపు కోసం ప్రచారం...
ఎన్నికల్లో పోటీచేసిన తన భర్తకోసం ఓ ఇల్లాలు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. మెదక్ మండల జెడ్పీటీసీ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీనుంచి మామిళ్ల అంజనేయులు పోటీచేసిన విషయం విదితమే. కాగా అభ్యర్థి భార్య మామిళ్ల పావని సోమవారం మండల పరిధిలోని ఔరంగాబాద్, అవుసులపల్లి గ్రామంలో ఇల్లిల్లు తిరుగుతూ మహిళలకు బొట్టుపెట్టి కాంగ్రెస్‌కు ఓటు వేసి తన భకర్తను గెలిపించాలని కోరారు. ఆమెతోపాటు కాంగ్రెస్ మహిళా నాయకులు అనురాధ, కవిత, లక్ష్మిలతో పాటు శంకర్, సుభాష్, రాజన్న తదితరులున్నారు.
ప్రజల సంక్షేమాన్ని ఏనాడూ పట్టించుకోని మైనంపల్లి
Published Mon, Mar 31 2014 10:54 PM | Last Updated on Sat, Sep 2 2017 5:24 AM
Advertisement
Advertisement