సాక్షి, రామాయంపేట(మెదక్): మండలంలోని పర్వతాపూర్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో సర్వం కోల్పోయిన బాధితులను బుధవారం మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి పరామర్శించి నేనున్నానంటూ వారికి భరోసా కల్పించారు. అగ్నిప్రమాదంలో గ్రామానికి చెందిన నాలుగు పురిళ్లు దగ్ధంకాగా, నిత్యావసర సరుకులు, బియ్యం, దుస్తులు, ఇతర వస్తువులు మంటలకు ఆహుతై బాధితులు కట్టుబట్టలతో మిగిలారు. విషయం తెలుసుకొని గ్రామానికి చేరుకున్న ఎమ్మెల్యే పూర్తివివరాలు తెలుసుకున్నారు. ఎట్టి పరిస్థితుల్లో బాధితులను ఆదుకుంటామని, పూర్తిస్థాయిలో సహకారం అందజేస్తానని ఈ సందర్భంగా ఆమె హామీ ఇచ్చారు.
ఈ మేరకు ఆమె నాలుగు కుటుంబాలకు సరిపడే దుప్పట్లు, వంట సామగ్రి, దుస్తులు, కూరగాయాలు, ఇతర నిత్యావసర సరుకులు, బకెట్లు, ఇతర సామగ్రిని ప్రత్యేకంగా ఆటోలో తెప్పించి వారికి అందజేసి తమ ఔదార్యాన్ని చాటుకున్నారు. ప్రభుత్వ పరంగా వారిని ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా సర్పంచ్ బోయిని దయాలక్ష్మి స్వామి బాధిత కుటుంబాలకు తక్షణ ఆర్థిక సహాయం అందజేశారు. కార్యక్రమంలో మెదక్ ఆత్మకమిటీ చైర్మన్ రమేశ్‌రెడ్డి, స్థానిక మున్సిపల్ చైర్మన్ జితేందర్‌గౌడ్, ఎంపీపీ భిక్షపతి, జెడ్పీటీసీ సంధ్య, సహకార సంఘం చైర్మన్ బాజ చంద్రం, కౌన్సిలర్ నాగరాజు, ఎంపీటీసీ బుజ్జి దేవేందర్, మెదక్ ఆర్డీవో సాయిరాం, తహసీల్దార్ శేఖర్‌రెడ్డి, సర్పంచులు సుభాశ్‌రాథోడ్, మైలారం శ్యాములు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment