కారు ఎక్కిన మైనంపల్లి | Mynampally Hanumantha Rao join in TRS Party | Sakshi
Sakshi News home page

కారు ఎక్కిన మైనంపల్లి

Published Tue, Apr 8 2014 8:24 PM | Last Updated on Mon, Oct 8 2018 8:52 PM

కారు ఎక్కిన మైనంపల్లి - Sakshi

కారు ఎక్కిన మైనంపల్లి

హైదరాబాద్: మల్కాజ్గిరి అసెంబ్లీ టికెట్ ఆశించి భంగపడ్డ టీడీపీ నాయకుడు మైనంపల్లి హన్మంతరావు టీఆర్ఎస్లో చేరారు. కేసీఆర్ సమక్షంలో ఆయన గులాబి కండువా కప్పుకున్నారు. ఆయనతో పాటు నలుగురు కార్పొరేటర్లు కూడా టీఆర్ఎస్లో చేరారు. మల్కాజ్గిరి అసెంబ్లీ సీటు మైనంపల్లికి ఇస్తానని కేసీఆర్ హామీయిచ్చినట్టు మీడియాలో ప్రచారం జరుగుతోంది.

అయితే ఈ స్థానానికి సిహెచ్ కనకారెడ్డి పేరును ఇప్పటికే టీఆర్ఎస్ ప్రకటించింది. కాంగ్రెస్ నుంచి ఇటీవలే టీఆర్ఎస్లో చేరిన సిట్టింగ్ ఎమ్మెల్యే ఆకుల రాజేందర్ను కాదని కనకారెడ్డి పేరును ప్రకటించడం గమనార్హం. అయితే ఆకుల రాజేందర్ పార్లమెంట్కు  పోటీ చేసే అవకాశముందని పార్టీ వర్గాలు చెప్తుతున్నాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement