ఢిల్లీ బయల్దేరిన సీఎం రేవంత్‌రెడ్డి | Telangana CM Revanth Reddy Delhi Visit Over Congress LS Plans | Sakshi
Sakshi News home page

తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి ఢిల్లీ పర్యటన.. అప్‌డేట్స్‌

Published Tue, Dec 19 2023 9:01 AM | Last Updated on Tue, Dec 19 2023 12:28 PM

Telangana CM Revanth Reddy Delhi Visit Over Congress LS Plans - Sakshi

సాక్షి,హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నేడు(మంగళవారం) ఢిల్లీకి బయల్దేరారు. సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొదటిసారి ఢిల్లీ వెళ్లుతున్నారు సీఎం రేవంత్‌. నేడు సీఎం రేవంత్‌.. కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో పాటు సోనియా, రాహుల్, ప్రియాంక గాంధీలను మర్యాద పూర్వకంగా కలవనున్నారు.

వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణ నుంచి సోనియా గాంధీని పోటీ చేయాలని స్వయంగా సీఎం రేవంత్‌ కోరనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు నిన్న (సోమవారం) రాజకీయ వ్యవహార కమిటీ (పీఏసీ) చేసిన తీర్మానం కాపీని మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీలకు సీఎం రేవంత్‌ అందిస్తారు. అనంతరం ఏఐసీసీ సంస్థాగత వ్యవహారాల కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌తో భేటీ కానున్నారు. పార్టీ వ్యవహారాలపై కేసీ వేణుగోపాల్‌తో చర్చించనున్నారు. మంగళవారం రాత్రికి సీఎం రేవంత్‌ హైదరాబాద్‌కు తిరిగి పయనం కానున్నారు.

చదవండి: హైదరాబాద్‌ ప్రజలకు అలర్ట్‌.. ఈ రూట్‌లో ఇవాళ ఉదయం ట్రాఫిక్‌ ఆంక్షలు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement