
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. బీఆర్‌ఎస్ ఎంపీ, సీనియర్ నేత కేశవరావు కాంగ్రెస్‌లో చేరనున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి బయలుదేరారు.
కాగా, సీనియర్ నేత కే. కేశవరావు నేడు హస్తం గూటికి చేరనున్నారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సమక్షంలో కేశవరావు కాంగ్రెస్‌లో చేరనున్నారు. నేడు ఎంపీ పదవి(రాజ్యసభ సభ్యత్వం)కి కేశవరావు రాజీనామా చేసి కాంగ్రెస్‌లో చేరే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ కాసేపటి క్రితమే ఢిల్లీకి బయలుదేరారు. ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు.
ఇదిలా ఉండగా.. రేపు(గురువారం) తెలంగాణ మంత్రివర్గ విస్తరణ ఉన్న విషయం తెలిసిందే. అయితే, సీఎం రేవంత్ హస్తిన పర్యటన నేపథ్యంలో కేబినెట్ విస్తరణ ఉండే అవకాశంలేదని సీఎంవో వర్గాలు చెబుతున్నాయి. దీంతో, కేబినెట్ విస్తరణ వాయిదాపడే ఛాన్స్ ఉంది.
