rasamayi bala kishan
-
ఎమ్మెల్యే రసమయి కాన్వాయ్ పై యువకుల దాడి
-
సీఎం కేసీఆర్‌కు ఎమ్మెల్యే రసమయి జోలపాడుతున్నారు..
సాక్షి, శంకరపట్నం(కరీంనగర్): దళిత బంధును హుజూరాబాద్‌కే పరిమితం చేసిన సీఎం కేసీఆర్‌కు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ జోలపాడుతున్నారని కాంగ్రెస్‌పార్టీ జిల్లా అధ్యక్షుడు కవ్వంపల్లి సత్యనారాయణ విమర్శించారు. శంకరపట్నం మండలం ముత్తారం, మక్త, మొలంగూర్, కొత్తగట్టు గ్రామాల్లో శనివారం దళిత, గిరిజన సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మానకొండూర్ ప్రజలు రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిపిస్తే నియోజకవర్గానికి దళిత బంధు తీసుకురాకుండా కేసీఆర్ మెప్పు కోసం పాటలు పాడుతూ కాలక్షేపం చేస్తున్నారని అన్నారు. రాష్ట్రంలోని దళిత, గిరిజనులందరికీ ఈ పథకం అమలు చేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో మాజీ జెడ్పీటీసీ బత్తిని శ్రీనివాస్‌గౌడ్, నాయకలు పద్మ, మధుకర్, శ్రీనివాస్, చంద్రమౌళి, జహంగీర్, మల్లారెడ్డి, సాంబయ్య, బుచ్చయ్య, కుమార్ తదితరులు పాల్గొన్నారు. చదవండి: ‘డబుల్’ ఇళ్ల పంపిణీ: సీఎం ఇంట్లో లిఫ్ట్ మాదిరే ఇక్కడ కూడా -
సీఎం కేసీఆర్ కరీంనగర్ పర్యటన
-
నేడు కేసీఆర్ కరీంనగర్ టూర్
సాక్షి ప్రతినిధి, కరీంనగర్/హైదరాబాద్: సీఎం కేసీఆర్ మరోసారి కరీంనగర్లో పర్యటించనున్నారు. గురువారం రాత్రి హెలికాప్టర్లో హన్మకొండకు చేరుకున్న సీఎం కేసీఆర్.. రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బి.వినోద్‌కుమార్ కుమారుడి వివాహానికి హాజరయ్యారు. తర్వాత రోడ్డు మార్గంలో కరీంనగర్‌లోని తీగలగుట్టపల్లిలో ఉన్న నివాసానికి చేరుకుని బస చేశారు.చదవండి: కృష్ణా జలాల వివాదం తెలుగు రాష్ట్రాలకే పరిమితం శుక్రవారం ఉదయం 10.30 గంటలకు అలుగునూరులో జరిగే టీఆర్ఎస్ రాష్ట్ర కార్మిక సంఘం మాజీ అధ్యక్షుడు రూప్సింగ్ కుమా ర్తె వివాహానికి కేసీఆర్ హాజరవుతారు. మధ్యాహ్నం 12.30 గంటలకు కరీంనగర్ కలెక్టరేట్‌కు చేరుకుంటారు. అక్కడ మంత్రులు హరీశ్‌రావు, కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్, కలెక్టర్, ఇతర అధికారులతో కలిసి ‘దళితబంధు’పథకంపై సమీక్షిస్తారు. మధ్యాహ్నం 3 గంటలకు కరీంనగర్ నుంచి హెలికాప్టర్లో హైదరాబాద్‌కు బయలుదేరుతారు. చదవండి: 22వ శతాబ్దంలో నివేదిక ఇస్తారా? -
రసమయి వ్యాఖ్యలు, టీఆర్ఎస్లో కలకలం
మహబూబాబాద్: ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో గజ్జెకట్టి ఆడిపాడి ఉద్యమాన్ని ఉరకలెత్తించిన రమమయి బాలకిషన్ అనంతరం రాజకీయాల్లోకి ప్రవేశించారు. రెండుసార్లు మానకొండూర్ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అయితే ఎమ్మెల్యే అయినప్పటి నుంచి తాను చాలామందికి దూరమయ్యానంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సమాజంలో కవులు, కళాకారులు మౌనంగా ఉండటం క్యాన్సర్ కంటే ప్రమాదకరమని రసమయి వ్యాఖ్యానించడం ఆసక్తికరంగా మారింది. అంటే కళాకారులు మునుపటిలా కదం తొక్కడం లేదని ఆయన పరోక్షంగా పేర్కొన్నారు. తెలంగాణ సాంస్కృతిక సారథి చైర్మన్ హోదాలో రసమయి ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. మహబూబాబాద్‌లో ప్రముఖ కవి జయరాజు తల్లి సంతాప సభలో పాల్గొన్న రసమయి ఈవ్యాఖ్యలు చేశారు. తాను అధికార పార్టీ ఎమ్మెల్యేగా ఉండటంతో తన సహజత్వాన్ని కోల్పోయానని అన్నారు. ప్రస్తుతం తానో లిమిటెడ్ కంపెనీలో పని చేస్తున్నానంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను ఏమీ మాట్లాడలేని పరిస్థితిలో ఉండటంతో చాలా మందికి దూరమయ్యానని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో ఆయన వ్యాఖ్యలు టీఆర్ఎస్లో వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి. టీఆర్ఎస్ అధిష్టానం తనను పట్టించుకోవడం లేదనే ఆవేదనతో రసమయి ఈ వ్యాఖ్యలు చేసినట్టు స్థానికంగా వినిపిస్తున్న మాట. ఇక కేటీఆర్ సీఎం అవుతారని కొందరు మంత్రులు, ఎమ్మెల్యేలు వ్యాఖ్యలు చేయడం.. మరికొందరు హిందూ వ్యతిరేక వ్యాఖ్యలు చేయడం పార్టీలో కొంత ఇబ్బందికర వాతావరణం సృష్టించింది. -
రసమయి బాలకిషన్ తిట్ల పురాణం!
సాక్షి, కరీంనగర్: అధికార టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ఓ గ్రామస్తుడిపై నోరు పారేసుకున్నారు. తనను విమర్శించాడనే కోపంతో పరుష పదజాలంతో ఆయనపై విరుచుకుపడ్డారు. అయితే సదరు గ్రామస్తుడు సైతం.. ఎమ్మెల్యే తిట్ల దండకానికి అంతే దీటుగా బదులివ్వడంతో ఇద్దరి మధ్య మాటల యుద్ధం నడిచింది. వివరాలు.. కరీంనగర్ జిల్లా మానకొండూరు నియోజకవర్గం ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ తమ గ్రామంలో పర్యటించలేదంటూ బెజ్జంకి మండలం బేగంపేటకు చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకుడు పోతిరెడ్డి రాజశేఖర్‌రెడ్డి ఆయన తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ మేరకు గ్రామ సమస్యలను ప్రస్తావిస్తూ ఎమ్మెల్యేపై ప్రశ్నల వర్షం కురిపిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినట్లు తెలుస్తోంది. (చదవండి: టీఆర్ఎస్లో రచ్చ.. తన్నుకున్న నాయకులు) ఈ విషయంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన రసమయి, నేరుగా రాజశేఖర్‌రెడ్డికి ఫోన్ చేసి అసభ్య పదజాలంతో దూషించారు. హఠాత్పరిణామంతో కంగుతిన్న రాజశేఖర్‌రెడ్డి.. తాను సైతం ఎమ్మెల్యేపై తిట్ల దండకం అందుకుని గట్టిగానే బదులిచ్చారు. వీరిద్దరి మధ్య నడిచిన తిట్ల పురాణం ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. రసమయి వ్యవహారశైలిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రజాప్రతినిధి ఈ విధంగా మాట్లాడటం సరికాదంటూ కొంతమంది అభిప్రాయపడుతుండగా.. మరికొంత మంది మాత్రం ఎదుటి వాళ్లు రెచ్చగొట్టే రీతిలో వ్యవహరించినందు వల్లే ఆయన ఇలా చేశారంటూ కామెంట్లు చేస్తున్నారు. -
సినీనటి ప్రత్యూషకు నివాళి
మియాపూర్: స్త్రీలు ఎక్కడ గౌరవించడబడుతారో అక్కడ దేవతలు కొలువుంటారని మానకొండూరు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ పేర్కొన్నారు. ఆదివారం మియాపూర్‌లోని మారుతీ గర్ల్ చైల్డ్ అనాథాశ్రమంలో సినీనటి ప్రత్యూష వర్ధంతిని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బాలకిషన్, రాష్ట్ర సాంఘిక, సంక్షేమ బోర్డు చైర్ పర్సన్ రాగం సుజాత యాదవ్‌లు హాజరై ప్రత్యూష చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహిళల భద్రత కోసం షీ టీంలు ఏర్పాటు చేసిందన్నారు. ప్రత్యూషకు జరిగిన అన్యాయం మరో ఆడపిల్లకు జరగరాదన్నారు. అనంతరం మొక్కలు నాటారు. కార్యక్రమంలో నిర్వాహకులు విజయ, ఫ్యామిలీ కౌన్సిలింగ్ సెంటర్ ఫీల్డ్ ఆఫీసర్ ప్రశాంతి, ప్రత్యూష సోదరుడు కృష్ణ చంద్ర, మారుతీ అనాథాశ్రమం చిన్నారులు తదితరులు పాల్గొన్నారు. నివాళులర్పిస్తున్న ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, రాగం సుజాత యాదవ్ తదితరులు -
టీఆర్ఎస్ గూటికి సర్పంచ్‌లు
సాక్షి శంకరపట్నం: మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడితో సహా, 9 మంది సర్పంచ్‌లు మంగళవారం కరీంనగర్ ఎంపీ వినోద్‌కుమార్ సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. మండలంలోని వంకాయగూడెం గ్రామంలోని మాదవసాయి గార్డెన్లో మండల కాంగ్రెస్ అధ్యక్షుడు చౌడమల్ల వీరస్వామి, యూత్ అధ్యక్షుడు రమణారెడ్డి, మొలంగూర్ ఎంపీటీసీ వావిలాల రాజు, మొలంగూర్ సర్పంచ్ మోరె అనూష, తాడికల్ సర్పంచ్ కీసర సుజాత, చింతగుట్ట సర్పంచ్ ఆడెపు రజిత, అర్కండ్ల సర్పంచ్ శేర్ల అనిత, రాజాపూర్ సర్పంచ్ పిన్‌రెడ్డి వసంత, కన్నాపూర్ సర్పంచ్ కాటం వెంకటరమణారెడ్డి, లింగాపూర్ సర్పంచ్ అంతం వీరారెడ్డి, కల్వల సర్పంచ్ దసారపు భద్రయ్య, ఇప్పలపల్లె సర్పంచ్ బైరీ సంపత్, ఏరడపెల్లి మాజీ ఎంపీటీసీ మొగురం శంకర్, వివిధ పార్టీలకు చెందిన 500 మంది కార్యకర్తలు టీఆర్ఎస్లో చేరారు. వీరికి ఎంపీ వినోద్‌కుమార్, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, కరీంనగర్ మేయర్ రవీందర్‌సింగ్ కండువాలు కప్పి టీఆర్ఎస్లో చేర్చుకున్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు లింగంపెల్లి శ్రీనివాస్‌రెడ్డి, ఎంపీపీ దొంగల విజయ, జెడ్పీటీసీ పొద్దుటూరి సంజీవరెడ్డి, సర్పంచ్ల సంఘం మండల అద్యక్షుడు పల్లె సంజీవరెడ్డి, యూత్ అధ్యక్షుడు గుర్రం శ్రీకాంత్, మార్కెట్ వైస్ చైర్మన్ కల్లూరి పోచయ్య, వైస్‌ఎంపీపీ పర్శరాములు, సింగిల్‌విండో చైర్మన్ హన్మంతరావు, రైతు సమితి కన్వీనర్ కొంరారెడ్డి, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, నాయకులు పాల్గొన్నారు. -
రసమయికి టికెట్ వద్దంటూ సెల్‌టవర్ ఎక్కిన యువకులు
అల్గునూర్ (మానకొండూర్): కరీంనగర్ జిల్లా మానకొండూర్ అసెంబ్లీ అభ్యర్థిగా రసమయి బాలకిషన్‌ను కాకుండా ఓరుగంటి ఆనంద్‌ను నిలబెట్టాలని డిమాండ్ చేస్తూ తిమ్మాపూర్ మండల కేంద్రంలో ముగ్గురు యువకులు ఆదివారం సెల్ టవర్ ఎక్కారు. స్థానికుడైన ఓరుగంటి ఆనంద్‌ను కాదని స్థానికేతరుడైన రసమయికి టికెట్ ఇవ్వడాన్ని తప్పుపట్టారు. రసమయి కార్యకర్తలను పట్టించుకోలేదని పేర్కొన్నారు. ఓరుగంటి ఆనంద్‌కు టికెట్ ఇస్తామని హామీ ఇచ్చేవరకూ ఆందోళన కొనసాగిస్తామని తెలిపారు. మరికొంతమంది టీఆర్ఎస్ నాయ కులు కూడా ఓరుగంటికి టికెట్ ఇవ్వాలని తిమ్మాపూర్ వద్ద ఆందోళన చేశారు. -
అక్కడ శోభకు.. ఇక్కడ అసమ్మతివాదులకు షాక్
సాక్షి, సిరిసిల్ల/ కరీంనగర్/ హైదరాబాద్: ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 13 అసెంబ్లీ స్థానాలకు 12 అసెంబ్లీ స్థానాల అభ్యర్థులను కేసీఆర్ ప్రకటించారు. చొప్పదండి మినహా సిట్టింగ్ ఎమ్మెల్యేలందరికీ టిక్కెట్లు ఇచ్చారు. జగిత్యాల అభ్యర్థిగా డాక్టర్ సంజయ్ పేరు ఖరారు చేయడం గమనార్హం. పెద్దపల్లి ఎంపీ బాల్క సుమన్‌ను చెన్నూర్ అసెంబ్లీ అభ్యర్థిగా ప్రకటించారు. కానీ చొప్పదండి ఎమ్మెల్యే బొడిగె శోభకు మాత్రం టీఆర్ఎస్ అధినాయకత్వం షాక్ ఇచ్చింది. చొప్పదండి నియోజకవర్గం అభ్యర్థిని ప్రకటించకుండా సీఎం కేసీఆర్ పెండింగ్‌లో పెట్టారు. సిట్టింగ్ ఎమ్మెల్యే బోడిగె శోభపై టీఆర్ఎస్ నాయకులు తిరుగుబాటు చేయడంతోనే ఆమె అభ్యర్థిత్వాన్ని ఖరారు చేయలేదని తెలుస్తోంది. రామగుండం నుంచి సోమారపు సత్యనారాయణకు మళ్లీ టికెట్ ఇవ్వడంతో టీఆర్ఎస్ అసమ్మతి వాదులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అసమ్మతి తీవ్రంగా ఉన్నా.. వేములవాడ నుంచి రమేష్ బాబుకు మళ్లీ టికెట్ ఇవ్వడం గమనార్హం. మాట నిలుపుకున్న కేటీఆర్.. సీఎం కేసీఆర్ తనయుడు కె.తారక రామారావు మాట నిలుపుకున్నారు. కేటీఆర్ రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో పోటీచేస్తారని, సిరిసిల్ల నుంచి పోటీ చేయరని జరిగిన ప్రచారాన్ని తిప్పికొడుతూ మొదటి జాబితాలోనే సిరిసిల్ల నుంచి కేటీఆర్ పేరు ఖరారు అయింది. సిరిసిల్ల ప్రజలు తిరస్కరించే దాకా అక్కడే పోటీ చేస్తానని పలు సందర్భాల్లో మంత్రి కేటీఆర్ వెల్లడించారు. ఇప్పుడు మరోసారి సిరిసిల్లలో పోటీచేస్తూ.. మాట నిలుపుకున్నారు. రాష్ట్ర మంత్రిగా ఏడు శాఖలను నిర్వహిస్తూనే.. సిరిసిల్ల నియోజకవర్గం సమస్యలను పరిష్కరిస్తూ.. గతంలో ఎన్నడూ జరగనంత అభివృద్ధి పనులను కేటీఆర్ చేశారు. సిరిసిల్ల పట్టణంతోపాటు నియోజకవర్గంలో తనదైన మార్క్‌ను కేటీఆర్ చూపించారు. అసమ్మతికి షాక్ ఇచ్చిన ‘చెన్నమనేని’.. వేములవాడ ఎమ్మెల్యే రమేశ్‌బాబు తన వ్యతిరేక అసమ్మతి వాదులకు షాక్ ఇస్తూ.. టీఆర్ఎస్ పార్టీ టిక్కెట్‌ను సాధించారు. మరోసారి ఎన్నికల బరిలో రమేశ్‌బాబు నిలుస్తున్నారు. అధికార పార్టీకి చెందిన జెడ్పీ చైర్పర్సన్ తుల ఉమ వర్గీయులు వేములవాడలో తుల ఉమకు టిక్కెట్ వస్తుందని భావిస్తూ.. ప్రచారం చేశారు. మరోవైపు ఏకంగా అసమ్మతి గళాన్ని వినిపించారు. వారందరికీ ఝలక్ ఇస్తూ.. మొదటి జాబితాలోనే రమేశ్‌బాబు టిక్కెట్ సాధించారు. తుల ఉమకు వర్గంగా భావిస్తున్న టీఆర్ఎస్ నేతలకు తాజా నిర్ణయం మింగుడుపడడం లేదు. మరోవైపు పౌరసత్వం వివాదం కోర్టు విచారణలో ఉండాగానే మరోసారి టీఆర్ఎస్ పార్టీ టిక్కెట్ ఖరారు కావడం విశేషం. అసమ్మతికి షాక్ ఇస్తూ.. వేములవాడలో మరోసారి రమేశ్‌బాబు తన పట్టును నిరూపించుకున్నారు. మానకొండూరులో మరోఛాన్స్.. రసమయి బాలకిషన్‌కు మానకొండూరులో మరోఛాన్స్‌ను టీఆర్ఎస్ కల్పించింది. సిద్దిపేట జిల్లాకు చెందిన రసమయి బాలకిషన్ మానకొండూరు అభ్యర్థిగా బరిలో నిలుస్తున్నారు. మానకొండూరు రాజకీయాలపై క్షేత్రస్తాయిలో జోరుగా చర్చలు సాగుతున్నాయి. ఏది ఏమైనా రసమయి బాలకిషన్ మరోసారి టీఆర్ఎస్ టిక్కెట్‌ను సాధించడం విశేషం. చొప్పదండిలో శోభకు షాక్.. చొప్పదండి నియోజకవర్గం సిట్టింగ్ ఎమ్మెల్యే బొడిగె శోభకు పార్టీ టిక్కెట్‌ను తొలిజాబితాలో ఖరారు చేయలేదు. దీంతో ఇక్కడ ఏం జరుగుతుంది అని చర్చ సాగుతుంది. మొత్తంగా జిల్లాలో అప్పుడే ఎన్నికల సందడి మొదలైంది. అధికార పార్టీ శ్రేణులను ఎన్నికలకు సమాయత్తం చేస్తుంది. రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా ఆసక్తికరమైన రాజకీయ చర్చకు సీఎం కేసీఆర్ తెరలేపారు. -
‘తుపాకీ రాముడు’గా బిత్తిరి సత్తి
ఓ టీవీ ఛానల్ కార్యక్రమంతో ఫేమస్ అయిన బిత్తిరి సత్తి ప్రస్తుతం సినిమాల్లోనూ నటిస్తూ బిజీగా ఉన్నాడు. పలు టీవీ షోలకు గెస్ట్ గానూ వ్యవహరిస్తున్న సత్తి త్వరలో హీరోగా ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతున్నాడు. తెలంగాణ కళాకరుడు, ఎమ్మెల్యే, తెలంగాణ సాంస్కృతిక శాఖ సారథి రసమయి బాలకిషన్ నిర్మాణంలో తెరకెక్కబోయే సినిమాలో బిత్తిరి సత్తి ప్రధాన పాత్రలో నటించనున్నాడు. బతుకమ్మ సినిమాకు దర్శకత్వం వహించిన టి.ప్రభాకర్ ఈ సినిమాకు దర్శకుడు. ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న ఈప్రాజెక్ట్‌కు తుపాకీ రాముడు అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి జూన్ 2న సినిమాను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. -
ప్రజల దీవెనలే ప్రభుత్వానికి అండ
ఇల్లంతకుంట : ప్రజల దీవెనలే కేసీఆర్ సర్కారుకు కొండంత అండగా ఉన్నాయని మానకొండూర్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ అన్నారు. మండలంలోని తిప్పాపూర్‌లో గ్రామపంచాయతీ, యాదవసంఘం, మహిళా సంఘ భవనాలను బుధవారం ఆయన ప్రారంభించారు. ఎస్సీ, మున్నూరుకాపు సంఘం, బస్టాండ్ భవనాలకు కలెక్టర్ కృష్ణభాస్కర్‌తో కలిసి శంకుస్థాపన చేశారు. వేలాది కోట్ల రూపాయలతో గ్రామాల్లో అభివృద్ధి పనులు చేస్తున్నామని పేర్కొన్నారు. ప్రజల సంక్షేమం, అభివృద్ధే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలన్నింటిని ప్రభుత్వం అమలు చేస్తుందని, కావాలని ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయని ఆరోపించారు. ఎంపీపీ గుడిసె ఐలయ్య, సెస్ డైరెక్టర్ వెంకటరమణారెడ్డి, సర్పంచ్ మంజుల, గుండ సరోజన, రాఘవరెడ్డి, తహసీల్దార్ శ్రీనివాస్, ఎంపీడీవో సంధ్యారాణి, మల్లయ్య, శ్రీనివాస్, గొడుగు తిరుపతి పాల్గొన్నారు. -
టీఆర్ఎస్లోకి సండ్రకు ఆహ్వానం
అసెంబ్లీ ఆవరణలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రసమయి, వేముల వీరేశం, బాలరాజు టీటీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యల మధ్య బుధవారం ఆసక్తికర చర్చ జరిగింది. టీఆర్ఎస్లోకి రావాలంటూ సండ్రను ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఆహ్వానించారు. ‘మీరే టీడీపీలోకి రండి.. దొరల పాలన మనకొద్దు’అని సండ్ర చమత్కరించారు. బడుగులకు ఎన్టీఆర్ అండగా నిలిచారని సండ్ర అనగా.. ఎన్టీఆర్ కూడా దొరే అని బాలరాజు సమాధానం ఇచ్చారు. ‘ఆయన దొరనే కానీ ఆలోచనలు బడుగులవి..’అని సండ్ర చెప్పుకొచ్చారు. ఎన్టీఆర్ కన్నా కేసీఆర్ బడుగుల గురించి బాగా ఆలోచిస్తున్నారని టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మూకుమ్మడిగా జవాబిచ్చారు. -
'రైతు ఏడిస్తే కేసీఆర్ ఏడుస్తారు'
హైదరాబాద్: రైతులు ఏడిస్తే తొలుత కళ్లల్లో నీళ్లు వచ్చేది ముఖ్యమంత్రి కేసీఆర్‌కేనని టీఆర్ఎస్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ అన్నారు. బుధవారం అసెంబ్లీ శాసనసభలో రైతుల ఆత్మహత్యల ఘటనపై మాట్లాడుతూ రైతుల విముక్తి సాధన ఉద్యమం కేసీఆర్ చేశారని చెప్పారు. ముఖ్యమంత్రి ఏం చేసినా రైతుల కోసమే చేశారని, ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నారని, చెరువుల పూడిక తవ్వకాలు, హరిత హారం వంటి కార్యక్రమాలన్నీ కూడా రైతులకు భవిష్యత్ తరాల కోసమేనని చెప్పారు. ఎద్దు ఏడ్చినచోట ఎవుసం నిలవదని, రైతు ఏడ్చిన చోట రాజ్యం ఉండదని, రైతు ఏడిస్తే కేసీఆర్ ఏడుస్తారని తెలిపారు. రాజోలి బండ తూము పగులకొట్టినప్పుడు ప్రతిపక్షాలు నవ్వుతుంటే 102 డిగ్రీల జ్వరంతో ఉండి కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ పాదయాత్ర చేశారని అన్నారు. సమైక్య రాష్ట్రంలో ఉన్నప్పుడు తెలంగాణపై ప్రతిపక్ష పాత్రే, ఇప్పుడు ప్రతిపక్ష పాత్రే విపక్షాలు పోషిస్తున్నాయని, వారిది పూర్తిగా సవతి ప్రేమేనని బాల కిషన్ ఆరోపించారు. ఈ సమయంలో జానారెడ్డి జోక్యం చేసుకున్నారు. ఇప్పుడు రైతులకు కావాల్సింది భరోసా, ఆత్మస్థైర్యం అని చెప్పారు. కడుపులో నెలలు నిండని బిడ్డ గురించి ఆలోచించే తమ ముఖ్యమంత్రి రైతుల గురించి ఆలోచించకుండా ఎలా ఉంటారని, ఒక్కసారి అంతా గుండెమీద చేయి వేసుకొని ఆలోచించుకోవాలని తెలిపారు.