టీఆర్‌ఎస్‌ గూటికి సర్పంచ్‌లు  | Sarpanchs Are Joining In Trs Party | Sakshi
Sakshi News home page

టీఆర్‌ఎస్‌ గూటికి సర్పంచ్‌లు 

Published Wed, Mar 6 2019 12:03 PM | Last Updated on Wed, Mar 6 2019 12:06 PM

Sarpanchs Are Joining In Trs Party - Sakshi

టీఆర్‌ఎస్‌లో చేరుతున్న సర్పంచ్‌లు  

సాక్షి శంకరపట్నం: మండలం కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడితో సహా, 9 మంది  సర్పంచ్‌లు మంగళవారం కరీంనగర్‌ ఎంపీ వినోద్‌కుమార్‌ సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు. మండలంలోని వంకాయగూడెం గ్రామంలోని మాదవసాయి గార్డెన్‌లో మండల కాంగ్రెస్‌ అధ్యక్షుడు చౌడమల్ల వీరస్వామి, యూత్‌ అధ్యక్షుడు రమణారెడ్డి,  మొలంగూర్‌ ఎంపీటీసీ వావిలాల రాజు, మొలంగూర్‌ సర్పంచ్‌ మోరె అనూష, తాడికల్‌ సర్పంచ్‌ కీసర సుజాత, చింతగుట్ట సర్పంచ్‌ ఆడెపు రజిత, అర్కండ్ల సర్పంచ్‌ శేర్ల అనిత, రాజాపూర్‌ సర్పంచ్‌ పిన్‌రెడ్డి వసంత, కన్నాపూర్‌ సర్పంచ్‌ కాటం వెంకటరమణారెడ్డి, లింగాపూర్‌ సర్పంచ్‌ అంతం వీరారెడ్డి,  కల్వల సర్పంచ్‌ దసారపు భద్రయ్య, ఇప్పలపల్లె సర్పంచ్‌ బైరీ సంపత్, ఏరడపెల్లి మాజీ ఎంపీటీసీ మొగురం శంకర్, వివిధ పార్టీలకు చెందిన 500 మంది   కార్యకర్తలు టీఆర్‌ఎస్‌లో చేరారు. వీరికి ఎంపీ వినోద్‌కుమార్, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, కరీంనగర్‌ మేయర్‌ రవీందర్‌సింగ్‌ కండువాలు కప్పి టీఆర్‌ఎస్‌లో చేర్చుకున్నారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు లింగంపెల్లి శ్రీనివాస్‌రెడ్డి, ఎంపీపీ దొంగల విజయ, జెడ్పీటీసీ పొద్దుటూరి సంజీవరెడ్డి, సర్పంచ్‌ల సంఘం మండల అద్యక్షుడు పల్లె సంజీవరెడ్డి, యూత్‌ అధ్యక్షుడు గుర్రం శ్రీకాంత్, మార్కెట్‌ వైస్‌ చైర్మన్‌ కల్లూరి పోచయ్య, వైస్‌ఎంపీపీ పర్శరాములు, సింగిల్‌విండో చైర్మన్‌ హన్మంతరావు, రైతు సమితి కన్వీనర్‌ కొంరారెడ్డి, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, నాయకులు పాల్గొన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement